Peddi movie collections : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. ఇక ఎప్పుడైతే ఆయన ‘రంగస్థలం’ సినిమా చేశాడో అప్పటినుంచి ఆయన కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూనే భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక రీసెంట్ గా ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో కలెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్లను కలుపుతున్నప్పటికి వాటి మీద ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ సీన్లు ఎలా ఉంటాయి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ నష్టాలను తీసుకొచ్చి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా నిర్మాతల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
కాబట్టి ఈ మూవీ ఎంత మొత్తంలో కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రొడ్యూసర్లకు టేబుల్ ప్రాఫిట్ అయిన తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే ఈ సినిమాకి ఎంతో కొంత నష్టాలు వస్తాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజి గా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా చేసుకుంటున్నాడు. ఇక దానికి అనుగుణంగానే పెద్ది సినిమా ప్రమోషన్స్ లో సైతం పాల్గొంటుండటం విశేషం…
ఇక స్టార్ హీరోలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటే రామ్ చరణ్ ఇంకా ఆ ఫీట్ అయితే సాధించలేకపోతున్నాడు… రాబోయే సినిమాలతో అయిన 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా ఫైనల్ చేసే పనిలో సుకుమార్ ఉన్నాడు…
















యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు షాక్.. సీఈవో ‘కుక్’ కామెంట్స్ తో తీవ్ర చర్చ..
Tim Cook Latest Statement: స్మార్ట్ ఫోన్ రంగంలో రారాజుగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు ఇది షాకింగ్ విషయమే. ఈ ఫోన్ పై ఉన్న అభిమానంతో ఎంత ధర కేటాయించినా కొనేందుకు క్యూ కడుతూ ఉంటారు. అయితే Apple కంపెనీ త్వరలో తన ఐఫోన్‌ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల తయారీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంస్థ సీఈవో Tim Cook తెలిపారు. దీంతో భవిష్యత్తులో విడుదలయ్యే ఐఫోన్ మోడళ్ల ధరలు మరింత పెరగవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా పెరుగుతాయంటే?
స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే NAND ఫ్లాష్ స్టోరేజ్, DRAM మెమరీ చిప్‌లు చాలా కీలకమైనవి. అయితే వీటి ధరలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో చిప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ఈ ప్రభావం నేరుగా స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా అధిక స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ప్రీమియం ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తి వ్యయం మరింత పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అంశంపై స్పందించిన యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ ‘ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. వినియోగదారులపై భారం తగ్గించే మార్గాలను పరిశీలిస్తున్నాం. అదే సమయంలో కస్టమర్లను రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ప్రస్తుతం పరిస్థితి భరించలేనిదిగా మారుతోంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే ధరలను ఎంత మేర పెంచుతారు? ఏ మోడళ్లపై ప్రభావం ఉంటుందనే విషయాలను ఆయన వెల్లడించలేదు.
సాధారణంగా యాపిల్ కొత్త మోడళ్ల విడుదల సమయంలోనే ధరల సవరణలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐఫోన్ సిరీస్‌లో ధరల పెంపు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా Pro, Pro Max వంటి హైఎండ్ మోడళ్లలో స్టోరేజ్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో వాటి ధరల్లో పెరుగుదల అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
యాపిల్ ధరల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే.. భారతీయ వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే దిగుమతి సుంకాలు, పన్నులు, కరెన్సీ మార్పిడి విలువల కారణంగా భారత్‌లో ఐఫోన్‌లు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ధరలకు విక్రయమవుతున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి వ్యయం కూడా పెరిగితే కొత్త మోడళ్ల ధరలు మరింత భారంగా మారే అవకాశముంది. కొత్త ఐఫోన్ కొనాలని భావిస్తున్నవారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ధరల పెంపు అధికారికంగా ప్రకటించబడితే పాత స్టాక్‌ల ధరలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలు నిర్ణయం తీసుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం అవసరమని చెబుతున్నారు.