Homeఅంతర్జాతీయంPranay Upadhyaya questions Trump: మోడీనే కాదు మన జర్నలిస్టులు ట్రంప్ ను వదల్లేదు.. ట్రంప్...

Pranay Upadhyaya questions Trump: మోడీనే కాదు మన జర్నలిస్టులు ట్రంప్ ను వదల్లేదు.. ట్రంప్ ముఖం మీద చెప్పేశారు

Pranay Upadhyaya questions Trump: ట్రంప్ ముఖం మాడిపోయింది. ఆ ప్రశ్నకు అతని దగ్గర నుంచి సమాధానం లేకుండా పోయింది. ఏం చెప్పాలో కొంతసేపటి వరకు ఆయనకు అర్థం కాకుండా పోయింది. చివరికి తప్పదు అన్నట్టుగా గొంతు సవరించుకోవలసి వచ్చింది. అంతేకాదు భయపడుతూ.. ఇబ్బంది పడుతూ సమాధానం చెప్పాల్సి వచ్చింది. ట్రంప్ ను ఇటీవల కాలంలో ఈ స్థాయిలో అమెరికా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టలేదు. చైనా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టలేదు. చివరికి అమెరికా ప్రతిపక్ష పార్టీ నేతలు […]

Pranay Upadhyaya questions Trump: ట్రంప్ ముఖం మాడిపోయింది. ఆ ప్రశ్నకు అతని దగ్గర నుంచి సమాధానం లేకుండా పోయింది. ఏం చెప్పాలో కొంతసేపటి వరకు ఆయనకు అర్థం కాకుండా పోయింది. చివరికి తప్పదు అన్నట్టుగా గొంతు సవరించుకోవలసి వచ్చింది. అంతేకాదు భయపడుతూ.. ఇబ్బంది పడుతూ సమాధానం చెప్పాల్సి వచ్చింది. ట్రంప్ ను ఇటీవల కాలంలో ఈ స్థాయిలో అమెరికా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టలేదు. చైనా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టలేదు. చివరికి అమెరికా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఈ స్థాయిలో ఒత్తిడికి గురి చేయలేదు. ఇదంతా చేసింది భారతదేశానికి చెందిన ఒక జర్నలిస్ట్.

అతని పేరు ప్రణయ్ ఉపాధ్యాయ్.. ఇండియా టుడే లో సీనియర్ జర్నలిస్ట్. G7 సమ్మిట్ లో భాగంగా ఆ ప్రోగ్రాం మొత్తాన్ని కవర్ చేయడానికి తన ఛానల్ తరఫున ఆయన వెళ్ళాడు .. ఈ క్రమంలో ట్రంప్, మోడీ కూర్చున్న చోట.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ను ఉద్దేశించి ప్రశ్నల పరంపర కురిపించారు. దానికి ట్రంప్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అంతేకాదు ఆ ప్రశ్నలకు ఆయన గొంతు సరి చేసుకోవాల్సి వచ్చింది.”మీరు ఇండియా గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఇటీవల మీరు తీసుకున్న నిర్ణయాలు ఇండియాకు ఇబ్బంది కలిగించాయి. ఆర్థికంగా నష్టం చేకూర్చాయి. ఇప్పుడేమో మీరు ఇండియా గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు.. దీనిని ఏ విధంగా చూడాలి అంటారు” అని ప్రణయ్ ప్రశ్నించాడు.

ఆ ప్రశ్న తట్టుకోలేక ట్రంప్ కొద్దిసేపటి వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. అనంతరం లేని వినయాన్ని.. కృత్రిమ ప్రేమను ప్రదర్శించాడు..” శ్వేత సౌదం భారతీయులకు అనుకూలంగా ఉంటూనే ఉంది. నేను గతంలో.. ఇప్పుడు భారతదేశానికి అనుకూలంగానే వ్యవహరించాను. ఇప్పటి నిర్ణయాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం నాకు తెలియదు. నేను ఇండియాను ప్రేమిస్తాను. ఇండియాకు నాయకత్వం వహించే నాయకుడు ఇక్కడే ఉన్నారని” ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నార్వేలో పర్యటించినప్పుడు.. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.. దీనిపై మనదేశంలో రకరకాల చర్చలు జరిగాయి. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నరేంద్ర మోడీ వెళ్లిపోతున్నారని చాలామంది వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ట్రంప్ మన దేశ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో తడబడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper