Home Blog Page 106

అమెరికా-ఇరాన్ వార్: ఇంతకీ గెలిచిందెవరు ఓడిందెవరు

America Iran War Analysis
America Iran War Analysis

America Iran War Analysis: రక్తపుటేరులు పారుతుంటే.. మాంసం వ్యాపారులకు గిరాకీ ఉంటుంది. ఆ ఏరులు అలాగే పారాలి అని వ్యాపారులు అనుకుంటారు. ఇది ఒక ఆఫ్రికన్ సామెత.. ఇప్పటి నవీన కాలానికి ఇది నూటికి నూరు శాతం సరిపోతుంది. దీనిని అలా చేసింది అమెరికా.. అగ్రరాజ్యంగా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్న అమెరికా.. ప్రతిసారి ఏదో ఒక పెంట చేయడం.. దానిని ప్రపంచం మీద రుద్దడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల మిగతా దేశాలు నరకం చూస్తున్నాయి. ధరలు పెరగడం.. ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోవడం.. ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇంత జరిగినప్పటికీ అమెరికాకు బుద్ధి రావడం లేదు. బుద్ధి తెచ్చుకోవడం లేదు.

అధ్యక్షులు మాత్రమే మారుతున్నారు

అమెరికా తీరు ఎలా ఉందంటే.. ప్రతిసారి అధ్యక్షుడు మారినప్పుడు.. అమెరికా చేస్తున్న యుద్ధ తీవ్రత మారుతుంది. బిల్ క్లింటన్, బుష్, ఒబామా, ట్రంప్, బైడన్, ట్రంప్.. ఇలా ప్రతి సందర్భంలో అమెరికా ఇతర దేశాల మీద యుద్ధాలు చేయడం.. యుద్దాల పేరుతో ఆయుధాల వ్యాపారాలు చేయడం అలవాటుగా మార్చుకుంది. ఒక అవసరాన్ని సృష్టించడం.. దానికోసం ఒత్తిడి తీసుకురావడం.. అవసరం తీరే విధంగా తానే ఏర్పాట్లు చేయడం.. ఇలా త్రిపద సిద్ధాంతాన్ని అమెరికా అమలు చేస్తోంది. దండిగా సంపాదించుకుంటున్నది.

తాజా ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సంబంధం లేదు. అసలు అమెరికా వేలు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం న్యూక్లియర్ వెపన్స్ పేరుతో అమెరికా ఇందులోకి ప్రవేశించింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేస్తుంది అనే అంశం మీద ఇప్పటికీ అమెరికాకు ఒక క్లారిటీ లేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది అనే విషయాన్ని కూడా ఇంతవరకు బయట పెట్టలేకపోయింది. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉందని అమెరికా అనేక సందర్భాల్లో ఆరోపించినప్పటికీ.. అది ఆరోపణగానే మిగిలిపోయింది. నిజానికి చైనా.. ఉత్తరకొరియా.. పాకిస్తాన్.. వంటి దేశాల మధ్య న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాటి జోలికి అమెరికా వెళ్లదు. పైగా ఇటీవల ట్రంప్ చైనా వెళ్ళినప్పుడు.. దారుణమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి చైనా ఇచ్చిన బహుమతులను కూడా అనుమానంతో బయట పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇజ్రాయిల్ ఒత్తిడి వల్ల ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేసింది. అయితే ఆ తర్వాత ఇజ్రాయిల్ తెలివిగా పక్కకు తప్పుకుంది. దీంతో అమెరికా యుద్ధం చేయాల్సి వచ్చింది. భారీగా నష్టపోవాల్సి వచ్చింది.. అంతేకాదు ఇప్పుడు ఇరాన్ పెట్టిన ప్రతి కండిషన్ కు అమెరికా ఒప్పుకోవాల్సి వచ్చింది.. వాస్తవానికి ఇరాన్ దేశానికి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని అమెరికా చెప్పినప్పటికీ.. 14 షరతుల జాబితాలో 300 బిలియన్ డాలర్లు ఇరాన్ దేశానికి అమెరికా ఇవ్వాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.. మరోవైపు హార్మోజ్ సంధిని 60 రోజులపాటు తెరిచి ఉంచుతామని ఇరాన్ చెబుతోంది.

ఇరాన్ పట్టుబట్టిన ప్రతి అంశానికి అమెరికా ఓకే చెప్పింది. అలాంటప్పుడు ఈ యుద్ధంలో అగ్రరాజ్యం సాధించింది ఏముందని వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జల సంధిని మూసివేయడం.. తెరిపించడం మాత్రమే ట్రంప్ సాధించిన అచీవ్మెంట్. అంతకుమించి అమెరికాకు ఒరిగింది ఏమీ లేదు.

ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన 'దృశ్యం 3'..కానీ తెలుగు వెర్షన్ విడుదల మాత్రం లేదు.. కారణం ఏంటంటే..

Drishyam 3 Collections
Drishyam 3 Collections

Drishyam 3 OTT Release: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై , సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం 3’. మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ ‘దృశ్యం’ సిరీస్ కి మొదటి నుండి ఉన్నటువంటి విపరీతమైన క్రేజ్ కారణంగా , ఈ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ‘దృశ్యం’ సిరీస్ ని కొనసాగిస్తామని ఆ చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది.

నాలుగు వారాల థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీ లో స్ట్రీమ్ చేసుకోవాలి అనే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి , ఈ చిత్రాన్ని నిన్న అర్థ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ చిత్రం కేవలం మలయాళం , తమిళం మరియు కన్నడ వెర్షన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు లో మాత్రం విడుదల అవ్వలేదు. అందుకు కారణం రీమేక్ రైట్స్ డైరెక్టర్ ప్రియా మరియు రాజ్ కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కొనుగోలు చేయడం వల్లే. వీళ్ళు రీసెంట్ గా హై కోర్టు కి వెళ్లి , తమ వద్ద తెలుగు వెర్షన్ రీమేక్ రైట్స్ ఉన్నాయని , దయచేసి ఈ చిత్రాన్ని ఓటీటీ లో తెలుగు వెర్షన్ రిలీజ్ ని ఆపాలంటూ పిటీషన్ వేశారు. దీని పై విచారణ చేపట్టిన హైకోర్టు , తెలుగు వెర్షన్ విడుదలని ఆపుతూ నోటీసులు ఇచ్చింది.

ఆ కారణం చేతనే , ఈ చిత్రం కేవలం 3 భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ కి కూడా ఇదే సమస్య. అక్కడ ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. ఆ కారణం చేత ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో లేదు. ఇది తెలుగు , హిందీ భాషల్లోని దృశ్యం సిరీస్ అభిమానులకు తీవ్రమైన నిరాశే అని చెప్పొచ్చు. తెలుగు వెర్షన్ లో ఇప్పటికే వెంకటేష్ దృశ్యం రెండు భాగాలను చేశాడు . కానీ మూడవ భాగం లో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు. మరి నిర్మాతలు ఈ సమస్య కు చెక్ పెట్టి ఓటీటీ లో తెలుగు వెర్షన్ విడుదలయ్యేలా చేస్తారా లెదా అనేది చూడాలి.

టాలీవుడ్ లో రీ షూట్స్ పర్వం.. పాపం నిర్మాతలకు తలనొప్పిగా మారిన డైరెక్టర్స్..

Tollywood Reshoots Trend
Tollywood Reshoots Trend

Tollywood Reshoots Trend: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టార్ హీరోల నుండి సినిమాలు ఆలస్యం అవ్వడం సంగతి కాసేపు పక్కన పెడితే , మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఒక్కో సినిమాని పూర్తి చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక స్టార్ హీరో , పాన్ ఇండియన్ డైరెక్టర్ తో చేస్తున్న ఒక బడా చిత్రానికి సంబంధించిన 30 నిమిషాల షూటింగ్ ఫుటేజీ ని తొలగించి , రీ షూట్ చేయాల్సి వచ్చింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాకు సంబంధించిన 30 నిమిషాల నిడివి వేస్ట్ అయ్యిందంటే సాధారణమైన విషయం కాదు, నిర్మాతకు నష్టం కోట్లలోనే ఉంటుంది. కేవలం ఈ ఒక్క స్టార్ హీరో సినిమానే కాదు , మిగిలిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇదే పరిస్థితి.

రీ షూట్స్ మీద రీ షూట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి. ఇక మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో నాని చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అంటున్నారు విశ్లేషకులు. మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా రావడం లేదు , అసలు ఈ ఏడాది విడుదల అనుమానమే అని అంటున్నారు. ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం రీ షూటింగ్స్. ఇంకా ఈ చిత్రం పూర్తి అవ్వడానికి 60 రోజుల సమయం పడుతుందట. పోనీ షూటింగ్ పూర్తి అయ్యాక అయినా సినిమా విడుదలకు సిద్ధం అవుతుందా అంటే అనుమానమే , మళ్లీ రీ షూట్ చెయ్యాలి అంటే ఏంటి పరిస్థితి? , నిజానికి డైరెక్టర్స్ నిర్మాతల రక్తం తాగేస్తున్నారు అనే చెప్పాలి.

‘పెద్ది’ చిత్రానికి కూడా ఈ రీ షూటింగ్స్ కారణంగా బడ్జెట్ హద్దులు దాటింది. ఆ కారణం చేత నిర్మాత ఈ చిత్రాన్ని భారీ రేట్స్ కి అమ్మాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసింది , కానీ ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు , మరో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే తప్ప , బ్రేక్ ఈవెన్ కష్టం. తప్పు ఎవరిదీ?, కచ్చితంగా డైరెక్టర్ దే. అందరూ అనిల్ రావిపూడి ని చూసి నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తాడు , లిమిట్ బడ్జెట్ ని మాత్రమే ఖర్చు చేయిస్తాడు , 6 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో సహా సినిమాని పూర్తి నిర్మాత చేతిలో పెడుతాడు. ఆ చిత్రాలు ఇప్పుడు అవలీలగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతున్నాయి. ఇది డైరెక్టర్ కి ఉండాల్సిన లక్షణం అంటే, సంవత్సరాల తరబడి సినిమాలు చేయడం , అందరికీ నష్టాలను మిగిలించడం కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు అంటూ హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్..

Tamannaah Shocking Comments On Dance
Tamannaah Shocking Comments On Dance

Tamannaah Shocking Comments On Dance: మన ఇండియా డ్యాన్స్ అద్బురంగా వేసే హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. ఈమెతో డ్యాన్స్ వేయాలంటే స్టార్ హీరోలు భయపడిపోతుంటారు. తోపు డ్యాన్సర్లు అనిపించుకున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని కూడా డామినేట్ చేసిన చరిత్ర తమన్నా సొంతం. ఈ స్పీడ్ గా డ్యాన్స్ వేయడమే కాదు , గ్రేస్ ఫుల్ గా కూడా డ్యాన్స్ వేయగలదు. ఇప్పటికీ కూడా ఈమె నేటి తరం లో టాప్ డ్యాన్సర్లు గా పిలవబడే సాయి పల్లవి , శ్రీలీల వంటి వారితో సమానంగా పోటీ పడి డ్యాన్స్ వేయగలదు. అలాంటి టాప్ డ్యాన్సర్ అయినటువంటి తమన్నా , రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తన డ్యాన్స్ తనకే నచ్చలేదు వంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఆమె కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన సాంగ్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.

జైలర్ చిత్రం లో ‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ అనుభూతి గురించి తమన్నా మాట్లాడుతూ ‘ఎందుకో ఈ పాటలో నేను వేసిన డ్యాన్స్ నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు. ఈ సాంగ్ షూట్ పూర్తి అయ్యాక, మళ్లీ ఆ మూవీ షూటింగ్ కి వెళ్తున్నప్పుడు నాకు ఎందుకో అసంతృప్తి గా అనిపించేది. ఇంకా చాలా బాగా చేసి ఉండుంటే బాగుండేది అనిపించేది. కానీ అనూహ్యంగా ఆ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం నాకొక థ్రిల్లింగ్ అనుభూతి’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఒక్కోసారి మనం చేసిన పని మనకి సంతృప్తి ని ఇవ్వకపోవచ్చు , కానీ అవతల వాళ్లకు చాలా బాగా అనిపిస్తుంది , సరిగ్గా తమన్నా విషయం లో అదే జరిగింది.

ఈ పాటకు తమిళ వెర్షన్ లో ఏకంగా 413 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా తెలుగు వెర్షన్ పాటకు 85 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ రేంజ్ సాంగ్ తమన్నా కి నచ్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్నా నే , అందులో ఎలాంటి సందేహం. ఇకపోతే తమన్నా ప్రస్తుతం తమిళం లో మూడు సినిమాలు , హిందీ లో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగు లో ఈమె చివరి సారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘ఓదెల 2’. ఈ చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదు.

ఓహో.. మమతాబెనర్జీ చివరికి మెస్సిని కూడా వదలలేదా ..బాప్ రే ఇంత జరిగిందా..

Mamata Banerjee Messi Controversy
Mamata Banerjee Messi Controversy

Mamata Banerjee Messi Controversy: 15 సంవత్సరాలపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించింది మమతా బెనర్జీ. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్ల మీదకి వచ్చే స్వేచ్ఛ ఇవ్వలేదు. దాడులు చేయడం.. హత్య చేయడం.. ఆడవాళ్లను దారుణంగా చెరచడం వంటి వాటిని నాటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలవాటుగా మార్చుకున్నారు. బెంగాల్ రాష్ట్రంలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. మమత అండదండలు ఉండడంతో వారంతా విచ్చలవిడిగా వ్యవహరించారు. పదిహేను సంవత్సరాల తర్వాత బెంగాల్ ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇంకా వీరి ఆగడాలు భరించే ఓపిక లేదని ఓటుతో బుద్ధి చెప్పారు.

ప్రజలనే కాదు..

బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మమత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేది. ఈ పథకాలకు లబ్ధి పొందిన వారి నుంచి నాటి టిఎంసి కార్యకర్తలు.. నాయకులు డబ్బులు కొంతమేర మినహాయించుకునేవారు. దీనికి అక్కడ పెట్టిన పేరు కట్ మనీ. ఇలా లబ్ధిదారుల నుంచి ప్రతినెల కట్ మనీ వసూలు చేసేవారు. ప్రజలకు నరకం అంటే ఏంటో చూపించేవారు.. ప్రజల నుంచి వసూలు చేసిన కట్ మనీ ద్వారా చాలామంది నేతలు కోట్లకు ఎదిగిపోయారు. కొందరైతే సమాంతర వ్యవస్థలను నడిపారు. జిల్లాలలో కలెక్టర్లను డమ్మీలుగా మార్చారు. అధికారుల మీద దాడులు కూడా చేశారు. కొన్ని సందర్భాలలో వివిధ అక్రమాలపై దర్యాప్తు సాగించడానికి వచ్చే కేంద్ర బృందాలపై కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారంటే అక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మెస్సిని కూడా వదిలిపెట్టలేదు

పశ్చిమ బెంగాల్లో ఫుట్ బాల్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మెస్సికి అక్కడ విపరీతంగా అభిమానులు ఉంటారు. అతని ఆటను సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటారు. మెస్సి గత ఏడాది గోట్ టూర్ లో భాగంగా కోల్ కతా లోని సాల్ట్ లేక్ స్టేడియంలోకి వచ్చారు. అక్కడ మెస్సి టీం సందడి చేసింది. మెసేజ్ విగ్రహాన్ని కోల్ కతా ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టి ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో మెస్సి కూడా పాల్గొన్నారు. అయితే నాడు కోల్ కతా టూర్ లో గందరగోళం నెలకుంది. మెస్సి టూర్ లో చీకటి లావాదేవీలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి. దీని వెనక నాడు ప్రమోటర్ గా వ్యవహరించిన శతద్రు దత్తా తప్పు ఉందని అప్పట్లో అధికారులు గుర్తించారు.

మెస్సీ టీమ్ రాసిన లేఖతో..

మెస్సి బృందం ఇప్పుడు కోల్ కతా పోలీసులకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నాడు ఈ టూర్లో అక్రమాలు జరగడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం లో కీలకంగా పనిచేసిన మంత్రి ఆరూప్ విశ్వాస్ వ్యవహరించిన తీరు కారణమని తేలింది. దీంతో మమతా బెనర్జీ చివరికి మెస్సిని కూడా వదిలిపెట్టలేదని.. అక్రమాలకు.. దారుణాలకు ఎంతటివారినైనా మమతా బెనర్జీ వాడుకుందని బిజెపి నేతలు అంటున్నారు. మరి దీనిపై అక్కడి బిజెపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కోసం రాసుకున్న ఎలివేషన్ సీన్స్ ను ' డ్రాగన్' కోసం వాడుతున్నాడా..?

Prashanth Neel Dragon Movie
Prashanth Neel Dragon Movie

Prashanth Neel Dragon Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుస విజయాలను సాధిస్తున్న స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుపోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సాధించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో యావత్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరిస్తున్నారు… ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రాగన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రభాస్ ‘సలార్ 2’ మేరకు సినిమా కోసం రాసుకున్న కొన్ని ఎలివేషన్ సన్నివేశాలను సైతం డ్రాగన్ సినిమాలో చేర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసి అతనికి ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనేది ప్రశాంత్ నీల్ యొక్క గోల్ గా తెలుస్తుంది. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటిని చూసిన ప్రశాంత్ నీల్ కెరియర్ మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం అని చెబుతున్నాడు.

కాబట్టి తన అభిమాన హీరోకి ఒక భారీ సక్సెస్ అందివ్వకపోతే తను ఉండి ఎందుకు అంటూ చాలా మొండిగా మాట్లాడుతున్నాడు. దీన్నిబట్టి చూస్తే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచింవచ్చిన గ్లింప్స్ లో సినిమా యొక్క వరల్డ్ ని పరిచయం చేశారు. కాబట్టి మొత్తానికైతే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ప్రశాంత్ నీల్ ఇచ్చే సక్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ హీరోగా మారతాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం త్రివిక్రమ్ తో చేసే సినిమా మీద కూడా భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి…

ఈ వ్యాధితో పురుష లక్షణాలు తగ్గుతాయి.. అసలేంటీ 'కెన్నెడీ డిసీజ్'..

Kennedy Disease Symptoms
Kennedy Disease Symptoms

Kennedy Disease Symptoms: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు యువకుడు అత్యంత అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. గత కొంతకాలంగా కాళ్లు, చేతుల కండరాలు బలహీనపడటంతో నడవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆయన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ని ఆశ్రయించారు. అక్కడ వైద్యులు అతనికి పలు రకాల అధునాతన పరీక్షలు నిర్వహించగా, చివరకు అతనికి ‘కెన్నెడీ డిసీజ్’ (Kennedy’s Disease) ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధితో క్రమంగా వారిలో పురుష లక్షణాలు క్షీణిస్తాయని తెలిపారు. అసలేంటీ ‘కెన్నెడీ డిసీజ్’..?

గుంటూరు GGH న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రామకృష్ణ ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ డిసీజ్ సోకిన వారిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పురుషులలో ఉండే సెక్స్ హార్మోన్ల (టెస్టోస్టెరాన్) ప్రభావం తగ్గిపోయి, క్రమంగా వారిలో పురుష లక్షణాలు క్షీణిస్తాయని తెలిపారు. అదే సమయంలో స్త్రీలకు సంబంధించిన కొన్ని శారీరక లక్షణాలు (ఉదాహరణకు రొమ్ము భాగం పెరగడం వంటివి) కనిపించడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణమని వివరించారు. దీనితో పాటు మోటార్ న్యూరాన్లు దెబ్బతినడం వల్ల కాళ్లు, చేతుల కండరాలు పూర్తిగా బలహీనపడిపోతాయని చెప్పారు.

అసలేంటీ ఈ ‘కెన్నెడీ డిసీజ్’?
అరుదైన వ్యాధిని మొదటిసారిగా 1962లో డాక్టర్ విలియం ఆర్. కెన్నెడీ అనే ప్రముఖ శాస్త్రవేత్త గుర్తించారు. అందుకే దీనికి ఆయన పేరిట ‘కెన్నెడీ డిసీజ్’ (దీనినే స్పైనల్ అండ్ బల్బార్ మస్కులర్ అట్రోఫీ – SBMA అని కూడా పిలుస్తారు) అని పేరు పెట్టారు. ఇది కేవలం పురుషులలో మాత్రమే లక్షణాలను చూపిస్తుంది. స్త్రీలు ఈ వ్యాధికి సంబంధించిన జన్యువును కేవలం ఒక తరం నుండి మరో తరానికి చేరవేసే ‘క్యారియర్స్’ (వాహకులు) గా మాత్రమే ఉంటారు కానీ, వారిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడవు. 30 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా బయటపడుతుంటాయి.

ప్రస్తుతం గుంటూరు GGHలో చేరిన ఈ రోగికి న్యూరాలజీ నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన వైద్య సహాయం, సపోర్టివ్ థెరపీలను అందిస్తున్నారు. ఎంతో అరుదైన ఇలాంటి కేసులను సైతం గుర్తించి, చికిత్స అందించే సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం విశేషం.

నిస్సత్తువలో తెలంగాణ బీజేపీ ఇలాగయితే ఎలా?

Telangana BJP strategy

Telangana BJP strategy :జనంలో ఒక టాక్ బలంగా నడుస్తోంది. దక్షిణాదిన బీజేపీకి వ్యూహం లేదు హవా లేదని అంటున్నారు. 10 మందిలో ఆరు ఏడుగురు ఇదే చెప్తారు. కర్ణాటకలో తప్పితే బీజేపీ ఎక్కడ బలంగా లేదు. కర్నాటకలో వచ్చిన అధికారం నిలుపుకోవడం లేదు. తమిళనాడులో బీజేపీకి మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. కానీ అన్నామలై వచ్చాక ఆ ముద్రను చెరిపేసి కొంత వరకూ సక్సెస్ అయ్యారు. చివరకు ఆయనే బీజేపీ నుంచి వెళ్లిపోవడంతో అక్కడా వ్యూహం బెడిసికొట్టింది..

ఇక ఏపీలో సొంతంగా బలపడే వ్యూహమే అక్కడ లేదు. టీడీపీతో కలిసే పోటీచేస్తు గెలుస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వ్యతిరేకత బలపడింది. రాజ్యసభలో మద్దతు కోసం జగన్ ను చేరదీసి పొందారని జనంలో భావన ఉంది. బీజేపీ కి ఆంధ్రాలో బలం లేకపోగా వ్యూహం కూడా లేకపోయింది.

కేరళలో బీజేపీ వ్యూహం సక్సెస్ అయ్యింది. రాజీవ్ చంద్రశేఖర్ లాంటి నాయకుడిని బీజేపీ ఎంపిక చేయడం కమలం పార్టీకి బలంగా మారింది. తెలంగాణలో ఏర్పడిన దాంట్లో కూడా బీజేపీకి వాటా ఉందని సుష్మ స్వరాజ్ చెప్పడం.. తెలంగాణ ప్రజలు ఆదరించడం జరిగింది. తెలంగాణలో దీనివల్ల ఒరిగిందేమీ లేదు. కేవలం మోడీ మీద అభిమానంతో పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తెచ్చుకుంది. బండి సంజయ్ హయాంలోనే బీజేపీ తెలంగాణలో బలపడింది.. అనేక సీట్లు గెలిచింది కూడా. బండి సంజయ్ పాదయాత్ర ఆపించేసి బీజేపీ తప్పు చేసింది. అది కంటిన్యూ చేసి ఉంటే బీజేపీ బలపడేది. కానీ బండి సంజయ్ ను పక్కనపెట్టి తెలంగాణలో బీజేపీ మంచి అవకాశం కోల్పోయింది.

నిస్సత్తువలో తెలంగాణ బీజేపీ ఇలాగయితే ఎలా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'పెద్ది' 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 14 వ రోజున గట్టి ఎదురుదెబ్బ తగిలింది..

Peddi 2 Weeks Worldwide Collections
Peddi 2 Weeks Worldwide Collections

Peddi 2 Weeks Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 13 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన ఈ చిత్రానికి నిన్నటితో బ్రేక్ పడింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , నిన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ రెండు వారాల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది , ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనేది వివరంగా చూద్దాం.

ముందుగా నైజాం ప్రాంతం వసూళ్ల విషయానికి వస్తే , ఈ చిత్రం 10 రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది. మొత్తం మీద 14 రోజులకు గానూ ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 52 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే , సీడెడ్ ప్రాంతం నుండి 20 కోట్ల 26 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 93 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 34 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 74 లక్షల రూపాయిలు , గుంటూరు నుండి 12 కోట్ల 20 లక్షలు , కృష్ణ నుండి 9 కోట్ల 82 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 143 కోట్ల 71 లక్షలు , 218 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , కర్ణాటక నుండి 14 కోట్ల 85 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 5 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 11 కోట్ల 80 లక్షలు , ఓవర్సీస్ నుండి 22 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా రెండు వారాల్లో ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 195 కోట్ల రూపాయిల 11 లక్షల షేర్ వసూళ్లు , 329 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా పాతిక కోట్ల రూపాయిల షేర్ రావాలి , అది దాదాపుగా అసాధ్యమే.

జగన్ మరో క్రింజ్ ఎలివేషన్; చనిపోయిన తర్వాత నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి..

Jagan_Mohan_Reddy_

Jagan photo remarks : ఉత్తరకొరియాలో నియంత కిమ్ ఆదేశాలు మాత్రమే నడుస్తూ ఉంటాయి. ఆయన చేసుకున్నట్టుగానే అక్కడి ప్రజలు హెయిర్ కట్ చేసుకోవాలి. ఆయన ఫోటోలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ఆయన చెప్పినట్టుగానే నడుచుకోవాలి. చివరికి ఆయన తిన్న తిండే అక్కడి ప్రజలు తినాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన ఏం చెప్తే అక్కడ ప్రజలు అదేం చేయాలి. కాదు కూడదు అంటే మాత్రం వచ్చే బర్త్ డే ఉండదు.

కిమ్ వ్యవహార శైలి పట్ల ప్రపంచ దేశాల నేతలు ఇప్పటికి ఆశ్చర్యపోతుంటారు. ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సరే అదంటే కమ్యూనిస్టు దేశం కాబట్టి సరిపోయింది. ప్రజాస్వామ్యంలో అది సాధ్యమవుతుందా.. ఒక నాయకుడి ఫోటోలను ప్రజలు మొత్తం తమ ఇంట్లో పెట్టుకోవడం వీలవుతుందా.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. తమకు నచ్చినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి అవకాశం ఉండదు..

ఈ విషయాన్ని మర్చిపోయారో.. తాను ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో కాదనుకున్నారో తెలియదు గాని.. జగన్ మరోసారి క్రింజ్ కామెడీ చేశారు. ఏకంగా అందరూ నవ్వుకునే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫోటో ప్రజలు పెట్టుకోవాలట. అదే ఆయన తపన.. తాపత్రయమట. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తే ఫోటోలు పెట్టుకోవాలని అడుక్కోవలసిన అవసరం ఉండదు. ఆటోమెటిగ్గా వాళ్ళే పెట్టుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు నేటికీ ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. రూపాయికి కిలో బియ్యం అనే పథకం పేరు చెప్తే చాలు ఆయన గుర్తుకొస్తారు. ఆరోగ్య శ్రీ పథకం.. పేరు చెప్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు. చివరికి సైబరాబాద్ పేరు ప్రస్తావనకు వస్తే చంద్రబాబు యాదికి ఉంటారు. ఇదంతా వారు బలవంతంగా చేయలేదు. వారు ప్రజల్లో ప్రేమను పొందారు కాబట్టి.. ఈ స్థాయిలో గౌరవాన్ని పొందారు.

ఇటీవల కాలంలో జగన్ తరచూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఏదో ఒక అంశం మీద తెరపైకి వస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారం లేక తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నారు. డీఎస్సీ విషయంలో అలానే చేశారు. ఇప్పుడు ఏదో మీటింగ్ పేరుతో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అందులో తన ఫోటో గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. చివరికి మీమర్లకు.. చేతినిండా పని కల్పించి వెళ్లిపోయారు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి స్క్రిప్ట్ రాసిస్తున్న వారికి ఓ దండం పెట్టాలి. ఈ స్థాయిలో క్రింజ్ కామెడీ తోపు డైరెక్టర్ల వల్ల కూడా కాదు.

పీఓకేకు మద్దతుగా సైన్యాధికారులు, పోలీసులు.. పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోతుంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుంది..

POK protests

POK protests : పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఆందోళనలు తగ్గలేదు.. ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో పాకిస్థాన్ ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోవాలని.. తమకు జమ్ము కాశ్మీర్ మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని.. తమకు స్వేచ్ఛను ప్రసాదించి.. సానుకూల జీవితాన్ని కొనసాగించే విధంగా చూడాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ తొలగించినప్పటికీ.. తమ మీద ఆంక్షలు విధించినప్పటికీ అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.

మొదట్లో ఈ నిరసనలు హింసాత్మక విధానంలో జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ రంగంలోకి దారుణంగా కాల్పులు జరిపింది. చిన్నపిల్లలు.. గర్భవతులు ఎక్కువగా చనిపోయారు. ఈ హింస పట్ల అంతర్జాతీయ సమాజం దాయాది మీద తీవ్రస్థాయిలో మండిపడింది. ఇటువంటి విధానాలు ఏమాత్రం సరికావని బ్రిటన్ అత్యున్నత సభ హెచ్చరించింది. ప్రపంచంలో స్వేచ్ఛను కోరుకునే సంస్థలు.. మానవ హక్కులను పరిరక్షించే మేధావులు పాకిస్తాన్ దుశ్చర్యను తీవ్రస్థాయిలో ఖండించారు. అంతేకాదు ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేదని స్పష్టం చేశారు.

అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఎందుకంటే అక్కడ మొహరించిన పాకిస్తాన్ ఆర్మీ సొంత దేశానికి వెళ్లిపోయింది. అక్కడి పోలీసులు ప్రజల మీద దాడులు చేసేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. కర్రలు ఎత్తబోము.. తుపాకులు సంధించబోము అంటూ వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరోవైపు అక్కడి ప్రజలు శాంతియుత విధానంలో నిరసన పాటిస్తున్నారు. పోలీసుల మీద రాళ్లు విసరడం లేదు. ఆర్మీ ని తిట్టడం లేదు. వీధులలో హింసాత్మక ఘటనలకు పాల్పడటం లేదు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. ఎవరినీ నొప్పించకుండా శాంతియుత విధానంలో నిరసన పాటిస్తున్నారు.. ఈ పరిణామంతో పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఇన్నాళ్లపాటు సాగించిన పెత్తనానికి చరమగీతం పాడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ గుప్పెట్లో పెట్టుకున్న ఆ. స్థానాలను కూడా అక్కడి పార్లమెంట్ నిర్ణయానికే వదిలేయాలని ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చైనా ఈడ్చి తంతే.. అమెరికా లాగి కొట్టింది.. పాపం పాకిస్తాన్

pakistan-caught-between-china-and-us-geopolitical-setback

Pakistan diplomacy : అధిక స్నేహం ప్రాణగండం అంటారు.. ఇప్పుడు ఈ సామెత పాకిస్తాన్ దేశానికి అచ్చు గుద్దినట్టు సరిపోతోంది.. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా అండతో పాకిస్తాన్ బతికి బట్ట కట్టింది. లేకుంటే ఇండియా చేతిలో చావు దెబ్బ తినేదే. ఆ తర్వాత అమెరికాతో గట్టిగా అంటకాగడం మొదలుపెట్టింది పాకిస్తాన్. దీనికి తోడు పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దగ్గరగా ఉండడం మొదలుపెట్టారు. ఆ మధ్య పాకిస్తాన్ లో దొరికే విలువైన వనరులను అమెరికా కంపెనీలకు దోచిపెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు.

అమెరికాకు దగ్గరగా కావడంతో.. ఏదైనా చేసుకోవచ్చు.. ఏమైనా జరపొచ్చు అని పాకిస్తాన్ భావించింది . అమెరికా అండ చూసుకొని భారత్ మీద పెత్తనం సాగించవచ్చు.. భారతదేశాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టవచ్చని పాకిస్థాన్ అనుకుంది. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. పాకిస్తాన్ దేశాన్ని అమెరికా పూచిక పుల్లతో పక్కనపెట్టింది. కూరలో కరివేపాకు మాదిరిగా తీసి పడేసింది. అమెరికా తీరే అలా ఉంది అనుకుంటే.. చివరికి చైనా కూడా జాడిచ్చి తన్నింది.

చైనాతో కూడా పాకిస్తాన్ అంట కాగడం మొదలుపెట్టింది. పైగా పాకిస్తాన్ దేశానికి చైనా అనేక విషయాలలో అండదండలు అందిస్తోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తోంది. ఇంకా కొన్ని విషయాలలో కీలకంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్తో కలిసి చైనా అనేక రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.

ఇటీవల పాకిస్తాన్ బాలుచ్ లిబరేషన్ ఉద్యమకారులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని తీర్మానం చేసింది. దీనికి చైనా సపోర్ట్ చేసింది. అయితే అమెరికా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని పక్కన పెట్టింది. అసలు వాళ్ళ మీద ఉగ్రవాదులు అని ముద్ర వేయడానికి ఎటువంటి ఆధారం లేదని అమెరికా వాదించింది. దీంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇక్కడ పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా జై కొట్టిన చైనా.. మరో విషయంలో మాత్రం చావు దెబ్బతీసింది. కీలకమైన ఎయిర్ బేస్ లు.. దాచిన మిస్సైల్స్.. చేపడుతున్న అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన ఫోటోలను బయటపెట్టింది.

ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ అత్యంత రహస్యంగా చేస్తోంది. దీంతో పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అటు అమెరికా ఇబ్బంది పెట్టడం..ఇటు చైనా దూరం పెట్టడంతో పాకిస్తాన్ పరిస్థితి అడ కత్తెరలో ఇరుక్కున్నట్టుగా మారింది. మొన్నటిదాకా అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ విర్రవీగింది. చైనా సపోర్ట్ చూసుకొని మీసాలు తిప్పేసింది. కానీ ఆ రెండు దేశాలు పాకిస్తాన్ ను ఆటలో అరటిపండు మాదిరిగా వాడుకుంటున్నాయని ఇప్పుడు ఆ దేశ పరిపాలకు తెలిసింది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు చింతించి లాభం లేదు. ఇప్పుడు చేయాల్సింది కేవలం పిసుక్కోవడమే..

అల్లు అర్జున్ vs రణ్వీర్ సింగ్ మధ్య పోటీ ఉందా..?

Allu Arjun vs Ranveer Singh

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు సాధించిన హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. పెర్సనల్ విషయాల్లో ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి సినీ విషయంలో మాత్రం పోయి ఉంటుంది. పుష్ప, పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన నటుడు అల్లు అర్జున్… పుష్ప 2 సినిమాతో ఏకంగా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అంతటి కలెక్షన్స్ ని సాధించిన హీరో మరెవరు లేకపోవడంతో అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇక దురంధర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రన్వీర్ సింగ్ సైతం అల్లు అర్జున్ కి పోటీని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్టులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి.

ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా కాన్సెప్ట్ లను రెడీ చేయించుకొని మరి రన్వీర్ సింగ్ రంగంలోకి దిగుతున్నాడు. దురంధర్, దురంధర్ 2 సినిమాలు రెండు పార్టులు కలిపి 2500 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాయి. దాంతో రన్వీర్ సింగ్ సైతం ఒక్క సంవత్సర వ్యవధిలోనే రెండు సినిమాలతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక దురంధర్ సినిమా అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ కి నేను పోటీని ఇస్తానని బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ మాట్లాడాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు. వీళ్ళిద్దరి నుంచి ఇక మీదట రాబోయే మూడు సినిమాలతో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనేది తెలుస్తుంది…

బరితెగించి అందరి ముందు ఆ పని.. ట్రంప్ మామూలు రసికుడు కాదు

Trump Macron wife

Trump Macron wife : ట్రంప్ మామూలోడు కాదు. తెలివైన వ్యాపారి. అవసరాల కోసం స్నేహం సాగించే రాజకీయ వేత్త. తన ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి. స్వలాభం కోసం దేన్నైనా సరే వదులుకునే మనిషి. అప్పటికప్పుడు కోప్పడతాడు. వెంటనే నవ్వు తెచ్చుకుంటాడు. స్నేహ హస్తం చాచి తనకు తాను గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటాడు. అంతేకాదు యుద్ధాలు చేస్తూ.. తాను గొప్ప శాంతి దూతను అంటూ డప్పు చాటింపు వేసుకుంటాడు.. అటువంటి ట్రంప్.. ఇప్పుడు బరి తెగించాడు.

జి 7 సదస్సు కోసం ట్రంప్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నాడు. వివిధ దేశాల అధినేతలతో సమావేశం అయ్యాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చాలాసేపు మాట్లాడాడు. వ్యూహాత్మక అంశాల గురించి తనకు తోచిన విషయాలను చెప్పాడు. ఇరాన్ దేశంతో శాంతి ఒప్పందం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. తాను లేకపోతే ఇజ్రాయిల్ మట్టి కొట్టుకుని పోయేదంటూ వ్యాఖ్యానించాడు. ఇంతే కాదు ట్రంప్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు..

సదస్సు ముగిసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కు ట్రంప్ కు ఘన వీడుకోలు పలికాడు. ఇంతవరకు ట్రంప్ కుదురుగా ఉంటే బాగానే ఉండేది. కానీ మాక్రాన్ భార్య బ్రిగిట్టే ను ముద్దు పెట్టుకోబోయాడు. దీంతో ఆమె వారించింది. అతడు నుంచి దూరంగా జరిగింది. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత ట్రంప్ తిరిగి అమెరికా వెళుతుండగా..మాక్రాన్ దంపతులు ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయంలో మాక్రాన్ భార్యను ట్రంప్ ఆత్మీయంగా పలకరించాడు. డబుల్ చీక్ కిస్ ఇచ్చాడు. మరోసారి ట్రంప్ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె దూరం జరిగారు. ట్రంప్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది.

ట్రంపు వ్యవహార శైలి చూసిన చాలామంది.. 80 ఏళ్ల వయసులోనే ఇలా ఉన్నాడంటే.. అప్పుడు ఎంతమందిని ఇలా నలిపేశాడో.. ఎంతమందితో ఆటాడుకున్నాడోనని కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా ట్రంప్ మహా రసికుడని.. అనేక సందర్భాలలో దానిని నిరూపించుకుంటున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

2027 ఐపీఎల్ పై కీలక అప్డేట్.. బీసీసీఐ ట్విస్ట్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయిగా..

IPL history and growth
IPL history and growth

IPL 2027 Schedule : మనదేశంలో ఐపీఎల్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ జరిగే రోజులలో అభిమానులు మైదానాలకు మాత్రమే పరిమితం అవుతారు. మైదానాల దాకా వెళ్ళలేని వారు టీవీలకు లేదా ఫోన్లకు అతుక్కుపోతారు.. సాయంత్రమైతే చాలు అద్భుతమైన క్రికెట్ మజాను ఆనందిస్తూ ఉంటారు. 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ అశేషమైన భారతీయ క్రికెట్ అభిమానులకు అద్భుతమైన ఆనందాన్ని అందిస్తూనే ఉంది. అంతటి కరోనా సమయంలో కూడా ఐపీఎల్ ను విడతల వారీగా నిర్వహించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే ఏకంగా విదేశాలలో ఐపీఎల్ నిర్వహించారు.

వందల మంది ఆటగాళ్లు.. లక్షల కోట్ల ఆదాయం.. అంతకుమించినా ఆనందం.. అందిస్తుంటే ఐపీఎల్ నిర్వహించకుండా బీసీసీఐ ఎలా ఉంటుంది.. ప్రతి ఏడాది మెగా వేలం జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి భారీ స్థాయిలో వేలం నిర్వహిస్తారు. ఆటగాళ్ల మీద కోట్లు కుమ్మరిస్తారు.. ఆ తర్వాత టోర్నీ నిర్వహణను అంతకుమించి అనే స్థాయిలో నిర్వహిస్తారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి నిర్వాహక బీసీసీఐ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఇక వచ్చే సీజన్ గురించి ఇప్పుడే బిసిసిఐ అప్డేట్ ఇచ్చేసింది.

విపరీతమైన ఎండలు

ప్రస్తుతం దేశంలో విపరీతంగా ఎండలు ఉన్నాయి. వర్షాలు సరిగా కురవడం లేదు. పైగా కరువు పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకారం వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బిసిసిఐ కీలక ప్రకటన చేసింది. విపరీతమైన ఎండలు ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐపిఎల్ సీజన్ ను కొంచెం ముందుకు జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి పది నుంచి మే 15 మధ్యన టోర్నీ నిర్వహించాలని బోర్డు సెక్రటరీ దేవదత్ సైకియా వెల్లడించారు.. ఐపీఎల్, బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ తో చర్చలు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు..

పెంచే అవకాశం లేదట

అంతర్జాతీయ షెడ్యూల్ వల్ల మ్యాచుల సంఖ్యను 94 కు పెంచే అవకాశం లేదని.. ఎప్పటి మాదిరిగా 74 మ్యాచులు మాత్రమే ఉంటాయని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి మే 31 వరకు ఐపీఎల్ నిర్వహించారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉంది. దక్షిణాఫ్రికా, నమిబియా, జింబాబ్వే వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. అందువల్ల ఆ షెడ్యూల్ అనుసరించి.. ఐపీఎల్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా ఎండలు విపరీతంగా ఉండడంతో.. మైదానంలో ఆడిన ప్లేయర్లు క్రాంప్స్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వచ్చే ఏడాది కూడా ఎండలు అధికంగా ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. షెడ్యూల్ ఏకంగా 18 రోజులు ముందుకు జరుపుతున్నట్టు సమాచారం.

పెద్ది మూవీకి అంత నష్టం వచ్చిందా..? బయటికి రాని నిజాలు ఇవేనా..?

Peddi OTT
Peddi OTT

Peddi movie collections : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. ఇక ఎప్పుడైతే ఆయన ‘రంగస్థలం’ సినిమా చేశాడో అప్పటినుంచి ఆయన కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూనే భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక రీసెంట్ గా ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో కలెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్లను కలుపుతున్నప్పటికి వాటి మీద ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ సీన్లు ఎలా ఉంటాయి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ నష్టాలను తీసుకొచ్చి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా నిర్మాతల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

కాబట్టి ఈ మూవీ ఎంత మొత్తంలో కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రొడ్యూసర్లకు టేబుల్ ప్రాఫిట్ అయిన తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే ఈ సినిమాకి ఎంతో కొంత నష్టాలు వస్తాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజి గా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా చేసుకుంటున్నాడు. ఇక దానికి అనుగుణంగానే పెద్ది సినిమా ప్రమోషన్స్ లో సైతం పాల్గొంటుండటం విశేషం…

ఇక స్టార్ హీరోలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటే రామ్ చరణ్ ఇంకా ఆ ఫీట్ అయితే సాధించలేకపోతున్నాడు… రాబోయే సినిమాలతో అయిన 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా ఫైనల్ చేసే పనిలో సుకుమార్ ఉన్నాడు…

ఆ విషయంలో సీనియర్ హీరోల కంటే కుర్ర హీరోలే బెటర్..

Young Heroes Vs Senior Heroes
Young Heroes Vs Senior Heroes

Young Heroes Vs Senior Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతుంటే సీనియర్ హీరోలు తెలుగు సినిమాలకే పరిమితమవుతున్నారు. అయినప్పటికి వరుస విజయాలను సాధిస్తూ సీనియర్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటుండటం విశేషం… ఇక వీళ్ళతో పాటుగా కుర్ర హీరోలు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తమ హవా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వచ్చిన సినిమాలను వచ్చినట్టుగా చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబడుతున్నారు. ఇక సీనియర్ హీరోలు మాస్ కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. కానీ కుర్ర హీరోలు మాత్రం సాహసోపేతమైన సినిమాలను చేస్తూ ప్రయోగాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు. ఇక ఈ విషయంలో సీనియర్ హీరోల కంటే యంగ్ హీరోలే బెటర్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం యంగ్ హీరోలు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. కానీ సీనియర్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్ తోనే రంగంలోకి దిగుతున్నారు.

ఇక ఇప్పటికే చిరంజీవి ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకటేష్ సైతం గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించాడు. బాలయ్య సైతం వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు.

‘అఖండ 2’ తో కొంతవరకు నిరాశపర్చినప్పటికి అది పెద్దగా ప్రభావం చూపించలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాగార్జున సైతం ఇప్పుడు వరుసగా రెండు సక్సెస్ లను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ సీనియర్ హీరోలు సైతం డిఫరెంట్ సబ్జెక్టులను కథలుగా ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు.

కుర్ర హీరోలు చేసే ప్రయోగాలు సీనియర్ హీరోలు చేయలేకపోయిన వాళ్ళ ఏజ్ కి తగ్గ పాత్రలను పోషిస్తే బాగుంటుందనే రీతిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి… చూడాలి మరి వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తారనేది…