Homeవింతలు-విశేషాలుSIM Card Cut Corner: సిమ్ కార్డుకు ఒకవైపు కట్ చేసి ఉంటుంది.. ఎందుకో తెలుసా..

SIM Card Cut Corner: సిమ్ కార్డుకు ఒకవైపు కట్ చేసి ఉంటుంది.. ఎందుకో తెలుసా..

SIM Card Cut Corner: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ ఫోన్లో సిమ్ లేకపోతే ఎలాంటి పనులు చేయరాదు. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ కు సిమ్ కార్డ్ గుండెకాయ లాంటిది. అయితే సిమ్ కార్డు నాలుగు మూలల్లో ఒక మూల మాత్రం కట్ అయి ఉంటుంది. చాలామంది దీనిని చూసి డిజైన్ కోసం చేశారని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. […]

SIM Card Cut Corner: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ ఫోన్లో సిమ్ లేకపోతే ఎలాంటి పనులు చేయరాదు. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ కు సిమ్ కార్డ్ గుండెకాయ లాంటిది. అయితే సిమ్ కార్డు నాలుగు మూలల్లో ఒక మూల మాత్రం కట్ అయి ఉంటుంది. చాలామంది దీనిని చూసి డిజైన్ కోసం చేశారని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఇలా ఒక మూల చేయడం వెనక పెద్ద ప్రయోజనమే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఏ వస్తువు అయినా చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం ఉంటే సౌకర్యంగా ఉంటుంది. సిమ్ కార్డు కూడా మార్కెట్లోకి వచ్చినా కొత్తలో నాలుగు మూలలు సమానంగా ఉండేవి. అయితే చాలామంది ఈ నాలుగు మూలలు సమానంగా ఉండేసరికి ఎటువైపు సిమ్ కార్డును మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలో అర్థం చేసుకోలేకపోయారు. ఈ విషయంలో చాలామంది వినియోగదారులు ఇబ్బందులు పడినట్లు కంపెనీలు గుర్తించారు. అంతేకాకుండా కొందరు తప్పుడు గా మొబైల్ లో బలంగా నెట్టడం ద్వారా అవి పాడైపోయేవి.

ఈ సమస్య పరిష్కారానికి టెలికాం నిపుణులు ‘నోచ్ డిజైన్’ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నాలుగు మూలలుగా ఉండే సిమ్ కార్డును ఒకవైపు కట్ చేశారు. దీంతో కట్ చేసిన భాగం వైపు సిమ్ కార్డును మొబైల్ లో ఇన్స్టాల్ చేయాలని సూచించారు. అప్పటినుంచి ప్రతి ఒక్కరూ ఏమాత్రం తికమక పడకుండా సిమ్ కార్డును తమ మొబైల్ లో సరైన విధంగా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.

ఈ చిన్న మార్పుతో వినియోగదారుల పెద్ద సమస్య తీరినట్లు అయింది. గతంలో ఈ సమస్యలతో చాలామంది తమ సిం కార్డులను కోల్పోయేవారు. కంపెనీలు సైతం శాశ్వత వినియోగదారులు లేకుండా నష్టాలను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు ఇరువురికి అధిక లాభం చేకూరినట్లు అయింది. ప్రస్తుత కాలంలో చాలామంది మొబైల్ వాడకం లేకుండా ఉండలేకపోతున్నారు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఒక్కో ఫోన్లో రెండు సిమ్ కార్డులు ఉంటున్నాయి. వీటిని సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటూ కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు.

సిమ్ కార్డులు కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అందువల్ల మొబైల్ లో ఉండే సిమ్ కార్డ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దీనిని ఇన్స్టాల్ చేసే సమయంలో సరైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper