Homeవింతలు-విశేషాలుValentine's Day 2026: వాలెంటైన్స్‌ డే: ప్రేమికులకు బిగ్‌ వార్నింగ్‌

Valentine’s Day 2026: వాలెంటైన్స్‌ డే: ప్రేమికులకు బిగ్‌ వార్నింగ్‌

Valentine’s Day 2026: వాలెంటైన్స్‌ డే వచ్చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రోస్‌ డే, చాక్లెట్‌ డే నిర్వహించారు. ఇక ప్రేమికుల దినోత్సవమే మిగిలింది. అయితే విదేశీ సంప్రదాయం మన దేశంలో కొనసాగించడంపై కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏటా ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయ. ఈసారి కూడా ఇబ్బందులు తప్పవని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో క్రాంతి సేన సభ్యులు వార్నింగ్‌ ఇస్తున్నారు. ప్రేమ జంటలు కనిపించినా.. వారిని హోటళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతించినా చర్యలు […]

Valentine’s Day 2026: వాలెంటైన్స్‌ డే వచ్చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రోస్‌ డే, చాక్లెట్‌ డే నిర్వహించారు. ఇక ప్రేమికుల దినోత్సవమే మిగిలింది. అయితే విదేశీ సంప్రదాయం మన దేశంలో కొనసాగించడంపై కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏటా ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయ. ఈసారి కూడా ఇబ్బందులు తప్పవని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో క్రాంతి సేన సభ్యులు వార్నింగ్‌ ఇస్తున్నారు. ప్రేమ జంటలు కనిపించినా.. వారిని హోటళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతించినా చర్యలు ఉంటాయని లేఖలు పంపారు.

పాశ్చాత్య సంప్రదాయాలపై ఆక్షేపణలు
కిస్‌ డే, రోజ్‌ డే, చాక్లెట్‌ డేలతో ప్రారంభమయ్యే వాలంటైన్స్‌ వారం విదేశీయ ప్రభావాలను ప్రతిబింబిస్తాయని కొన్ని సంఘాల వాదన. స్థానిక సంస్కృతి, సామాజిక విలువలను రక్షించాలనే ఉద్దేశంతో తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. కానీ, ఇది ఇప్పటికే నగరాల నుంచి పట్టణాలు, చివరకు గ్రామాలకు పాకింది.

హెచ్చరికల ప్రభావం…
తాజా క్రాంతి సేన హెచ్చరికలతో పబ్లిక్‌ ప్రదేశాల్లో ప్రేమికులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారులు జంటలను అనుమతించకపోవచ్చు. ముజఫర్‌నగర్‌ వంటి సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి ప్రకటనలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయవు. 2013లో ఇక్కడ అల్లర్లు జరిగాయి.

పోలీసుల అలర్ట్‌..
భారతీయ చట్టం ప్రేమకు ఆటంకం విధించదు, కానీ పబ్లిక్‌ ప్రదేశాల్లో అనైతిక చర్యలు నిషేధం. హెచ్చరికలు చట్టవిరుద్ధమైతే పోలీసులు చర్యలు తీసుకోవాలి. హోటల్‌ యజమానులు కూడా చట్ట పరిధిలో రక్షణ కోరే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper