Crypto Money Laundering: పన్నుల చెల్లింపు విషయంలో మనదేశంలో ఎన్నో పారదర్శకమైన విధానాలు ఉన్నప్పటికీ.. కొంతమంది అడ్డగోలు ప్రయత్నాలకు పాల్పడుతుంటారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఆ నగదును వివిధ మార్గాల ద్వారా బయటికి పంపిస్తుంటారు. తద్వారా విదేశాలలో భారీగా ఆస్తులను కూడబెట్టుకుంటారు. వారు పన్నులు చెల్లించకపోవడం వల్ల మన దేశం అభివృద్ధి కుంటుపడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో పథకాలలో కోతపడుతుంది. అభివృద్ధి పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వం అవసరాల కోసం అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఆ అప్పు దేశ ప్రజలు తీర్చాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందువల్లే పన్ను చెల్లింపును ప్రజలు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు సక్రమంగా చేపట్టాలి. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడితే దేశం వెనుకబడిపోతుంది. అభివృద్ధి కుంటుపడిపోతుంది.
Also Read: Mahesh Babu : నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!
వాట్సప్, గూగుల్ తో..
పన్ను ఎగవేతదారులు ఇటీవల కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. డబ్బును వివిధ మార్గాలలో విదేశాలకు తరలిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని భారత ఆదాయపు పన్ను శాఖ రహస్యంగా గుర్తించింది. పన్ను ఎగవేతదారులు, బినామీలు దాచిన డబ్బులు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇతర దేశాలకు తరలిస్తున్నారు. అయితే వీటిని గుర్తించడానికి భారత ఆదాయపు పన్ను శాఖ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నది..వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్, గూగుల్ మ్యాప్స్ మొత్తాన్ని విశ్లేషించి కనిపెడుతున్నది. ఇటీవల కాలంలో భారత ఆదాయపు పన్ను శాఖ దాదాపు 200 కోట్ల క్రిప్టోప్ కరెన్సీని ఎన్ క్రిప్టెడ్ మెసేజ్లు ఆధారంగా గుర్తించింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా డబ్బు దాచిన చోటును.. ఇన్ స్టా గ్రామ్ ద్వారా బినామీ ప్రాపర్టీ ఓనర్ షిప్ ను కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు.
Also Read: National Herald Case: సోనియా, రాహుల్ చేసిన ‘ఇండియన్ హెరాల్డ్’ మనీలాండరింగ్ అసలు కథ ఏంటి..?
స్థిరాస్తి, ఫార్మా రంగాలలో..
స్థిరాస్తి, ఫార్మా రంగాలలో ఈ తరహా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని.. ఆదాయపు పన్ను శాఖను బురిడీ కొట్టించి అక్రమార్కులు కోట్లల్లో నగదును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గుర్తించింది. అందువల్లే వారు దాచిన నగదును.. ఇతర మార్గాలలో తరలించిన నగదును ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ మార్గాలను కట్టడి చేయడానికి.. ముఖ్యంగా పన్నులు చెల్లించకుండా నగదును ఇతర మార్గాలలో తరలిస్తున్న వారికి షాక్ ఇవ్వడానికి చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. ఒకవేళ ఇవి గనుక అమల్లోకి వస్తే నల్లధనం ఇతర దేశాలకు వెళ్లే మార్గాలు దాదాపు మూసుకుపోతాయి. అప్పుడు ఆ నగదు పన్ను రూపంలో భారత ఖజానాలోకి చేరుతుంది. ఫలితంగా ఇతర దేశాల వద్ద అప్పులు తీసుకొచ్చే దుస్థితి మన దేశానికి ఉండదు.