Homeవింతలు-విశేషాలుViral Wedding Video: అతిథులెవరూ లేనట్టు పెళ్లికి సింహాలను పిలిచారు.. వైరల్ వీడియో

Viral Wedding Video: అతిథులెవరూ లేనట్టు పెళ్లికి సింహాలను పిలిచారు.. వైరల్ వీడియో

Viral Wedding Video: మన ఇళ్లల్లో వేడుకలు జరిగితే బంధువులను పిలుచుకుంటాం. మన స్థాయికి తగ్గట్టుగా భోజనాలు పెడతాం. స్వాగతసత్కరాలు చేస్తాం. పెళ్లిళ్ల సమయంలో అడంబరాలు ఎక్కువ చేస్తాం కాబట్టి.. అప్పుడు అతిథులు ఎక్కువగా వస్తుంటారు. మనస్థాయికి తగ్గట్టుగా భోజనాలు, ఇతర విందులు పెడతాం. కానీ, పెళ్లికి ఎవరైనా సింహాలను పిలుస్తారా? అయ్య బాబోయ్ సింహాలు పెళ్లికి రావడం ఏంటి? ఇదేలా సాధ్యం అనుకుంటున్నారు కదూ.. ఈకథనం మొత్తం చదవండి మీకే తెలుస్తుంది. మనదేశంలో సింహాలు ఎక్కువగా […]

Viral Wedding Video: మన ఇళ్లల్లో వేడుకలు జరిగితే బంధువులను పిలుచుకుంటాం. మన స్థాయికి తగ్గట్టుగా భోజనాలు పెడతాం. స్వాగతసత్కరాలు చేస్తాం. పెళ్లిళ్ల సమయంలో అడంబరాలు ఎక్కువ చేస్తాం కాబట్టి.. అప్పుడు అతిథులు ఎక్కువగా వస్తుంటారు. మనస్థాయికి తగ్గట్టుగా భోజనాలు, ఇతర విందులు పెడతాం. కానీ, పెళ్లికి ఎవరైనా సింహాలను పిలుస్తారా? అయ్య బాబోయ్ సింహాలు పెళ్లికి రావడం ఏంటి? ఇదేలా సాధ్యం అనుకుంటున్నారు కదూ.. ఈకథనం మొత్తం చదవండి మీకే తెలుస్తుంది.

మనదేశంలో సింహాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలతో గుజరాత్ మొదటిస్థానంలో ఉంటుంది. ఇక్కడ దట్టమైన అరణ్యాలు, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అందువల్లే ఇక్కడ సింహాలు ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ ప్రాంతంలో ఇటీవల ఓ వివాహ వేడుక జరిగింది. ఆ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. శ్రీమంతుల పెళ్లి కావడంతో అతిథులు కూడా భారీగానే వచ్చారు.

వివాహ వేడుక పూర్తయిన తర్వాత బంధువులు భోజనాలు చేశారు. అప్పటికి రాత్రి కావడంతో ఎక్కడి వారు అక్కడ నిద్రకు ఉపక్రమించారు. ఇంక కొంతమంది భోజనాలు చేస్తూనే ఉన్నారు. వంటవాళ్లు వంట సామగ్రిని సర్దుతున్నారు. ఈలోగా కొన్ని సింహాలు భోజనాలు చేసే ప్రాంతం వద్దకు వచ్చాయి. అటూ ఇటూ తిరుగుతూ షామీయానా కింద పడుకున్నాయి.

అక్కడి బంధువులు కొంతమంది భయపడగా.. మరికొంత మంది సింహాలు తిరుగుతున్న తీరును కెమెరాలలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా సర్కులేట్ లో ఉంది. ఉన్నట్టుండి సింహాలు పెళ్లికి రావడం.. అవి అటూ ఇటూ తిరగడంతో వచ్చిన బంధువులకు గుండె ఆగినంత పనయింది.

‘ఎవరైనా పెళ్లిళ్లలకు అతిథులను పిలుస్తారు. మీరేంటి భయ్యా ఏకంగా సింహాలను పిలిచారు. సింహాలు మీకు ఏమైనా బంధువులా? పోనీ సింహాలకు మీకు ఏమైనా దగ్గరి చుట్టరికం ఉందా? సింహాలను చూస్తే మీకు భయం కూడా కలగడం లేదా? సింహాలను పెళ్లికి పిలిచారంటే మీరు కచ్చితంగా సింహ బలురై ఉంటారని’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jist (@jist.news)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper