Mahesh Babu : రీసెంట్ గానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కి శ్రీ సాయి సూర్య డెవలపర్స్(Surya Developers) అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు, ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం రోజులైంది. ఆ సంస్థ మనీ లాండరింగ్ కేసు లో చిక్కుకోవడం , మహేష్ బాబు దాదాపుగా ఆరు కోట్ల రూపాయిలు చెక్ ద్వారా కొద్దిగా, ఆన్లైన్ ద్వారా కొద్దిగా అందడం తో, ఈడీ అధికారులు మహేష్ ని విచారించడం కోసం ఈ నోటీసులు జారీ చేసారు. నేడు బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం లో ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యం లో మహేష్ బాబు విచారణకు హాజరు కాబోతున్నాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. మీడియా కి అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈడీ అధికారులు ఆదేశించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందే.
Also Read : ఇంటర్నేషనల్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ..అదృష్టం అంటే ఇదే!
మనీ లాండరింగ్ కి పాల్పడిన కంపెనీలకు మహేష్ బాబు పెట్టుబడులు పెట్టమని ప్రజలను యాడ్స్ ద్వారా ప్రలోభ పెట్టాడని, అందుకు గాను ఆయనకు భారీగా పారితోషికం తీసుకున్నారు, అందులో సగం మనీ లాండరింగ్ ద్వారా మహేష్ కి చేరాయని ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి మహేష్ ఈడీ అధికారులకు ఏమని వివరణ ఇస్తాడో చూడాలి. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి వాటిల్లో చిక్కుకున్నప్పుడు, విచారణకు హాజరయ్యాక, మీడియా ముందుకొచ్చి అసలు ఏమి జరిగిందో చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు మహేష్ కూడా మీడియా ముందుకు వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మహేష్ బాబు మీద ఇలాంటివి ఎన్ని వచ్చినా జనాలు నమ్మే పరిస్థితి లో లేరు. ఎందుకంటే ఆయన చేసే సేవ కార్యక్రమాలు అలాంటివి మరి. ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించిన గొప్ప మనసు ఆయనది.
అలాంటి వ్యక్తి మీడియా ముందుకొచ్చి జనాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకొని ఒడిశా ప్రాంతంలో ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసారు. మే నెలలో రెండవ షెడ్యూల్ మొదలు కానుంది . ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఒక నెల రోజుల పాటు చిత్రీకరించనున్నారు. అనంతరం మూడవ షెడ్యూల్ కోసం మూవీ టీం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వి రాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ప్లాన్ ప్రకారం షెడ్యూల్స్ అన్నిటిని పూర్తి చేసి 2027 లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసున్నారు.
Also Read : హీరో విశ్వక్ సేన్ తో వివాదం గురించి నాని సంచలన వ్యాఖ్యలు!