Kalagnanam Predictions: అప్పట్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం పేరుతో భవిష్యత్తు లో జరగబోయే సంఘటనలను వివరిస్తూ ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో అనేక వింతలు.. యావత్ భూ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటనలు జరుగుతాయని ఆయన ప్రస్తావించారు. ఆయన రాసినవన్నీ నూటికి నూరు శాతం జరగకపోయినప్పటికీ దాదాపు జరుగుతున్నాయి.అందువల్లే నేటి అధునిక కాలంలో కూడా వీరబ్రహ్మేంద్రస్వామి పుస్తకం గురించి చర్చ జరుగుతోందంటే మాములు విషయం కాదు. కాలాన్ని ముందే ఊహించి వీరబ్రహ్మేంద్రస్వామి ఆ పుస్తకం రాశారు. భవిష్యత్ లో జరగబోయే పరిణామాాలను అంచనా వేయగలిగారు. అందువల్లే నేటికాలంలోనూ ఆయన ప్రస్తావన వినిపిస్తోంది.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో రాసినట్టు ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. ఆకస్మికంగా వరదలు వస్తున్నాయి. అదే సమయంలో కరువు కాటకాలు చోటు చేసుకుంటున్నయ్. మనుషుల్లో విపరీతమైన బుద్ధులు పడుతున్నాయి. క్రోదం వల్ల మనుషులు తమను తాము చంపుకుంటున్నారు. డబ్బు కోసం.. బంగారం కోసం మోసాలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విలాసాల కోసం అయిన వాళ్లను నట్టేట ముంచుతున్నారు. అంతేకాదు మనుషులు విచక్షణ కోల్పోయి ఘోరాలకు పాల్పడుతున్నారు.
ప్రకృతి పరంగా కూడా వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టుగానే జరుగుతోంది. హిమాలయ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా కొండ ప్రాంతాలలో విపరీతంగా నష్టం వాటిల్లుతోంది. పుణ్యక్షేత్రాలలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మేడారం లాంటి ప్రాంతాలలో ప్రకృతి పరంగా విపరీతమైన నష్టం కలుగుతోంది. చెట్లు విరిగిపోతున్నాయి. కుంభవృష్టి కురుస్తోంది. ఇదే సమయంలో దారుణమైన కరువు ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రస్తావించారు.
తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెల్దుర్తి అనే గ్రామంలో ఊహించని ఘటన చోటుచేసుకు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు సమీపంలో ఒక ఆవు రోడ్డు పక్కన ఉంది. ఆవు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో.. ఒక వరాహం అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే ఆవు పొదుగులో నోరు పెట్టింది. పాలు తాగడానికి ప్రయత్నించింది. దానికి గోమాత అడ్డు చెప్పలేదు. పైగా వరాహానికి పాలు ఇవ్వడానికి ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వరాహంలో తన బిడ్డను చూసుకుంది గోమాత. ఈ దృశ్యం ఆసక్తికరంగా ఉండడంతో చాలామంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంతమంది ఇది అద్భుతం అని కొనియాడుతుంటే.. మరికొందరేమో వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన కాలజ్ఞానం నిజమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఒక అరుదైన, వింత ఘటన చోటుచేసుకుంది..
ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల నేరుగా ఒక గోమాత వద్దకు చేరి పాలు తాగుతూ తన ఆకలిని తీర్చుకుంది..
ఆ పంది పిళ్లను తన సొంత దూడలా భావించిన ఆ గోవు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పాలు తాగనిచ్చింది..
వెల్దుర్తి పోలీస్స్టేషన్… pic.twitter.com/Z5n9oNNjJP
— RTV (@RTVnewsnetwork) August 26, 2026