Homeవింతలు-విశేషాలుConsultant Rejects Job Offer Viral: పో.. పోవోయ్ నీ జాబ్ నాకు అవసరం లేదు.....

Consultant Rejects Job Offer Viral: పో.. పోవోయ్ నీ జాబ్ నాకు అవసరం లేదు.. ఒరేయ్ నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్

Consultant Rejects Job Offer Viral: ఉద్యోగం బానిసత్వం. ఇంత చదువు చదివి.. వాడి దగ్గర నేను పనిచేయాల్సిన అవసరం నాకు ఏంటి. ట్రస్ట్ నో వన్.. అపోస్ ఎనీ వన్.. బీ ఓన్లీ వన్.. ఇదిగో ఈ మాటలను అతడు పూర్తిగా ఒంట పట్టించుకున్నాడు. ఎవడికైనా ఈగో కొంతవరకు ఉంటుంది. నాకు మాత్రం నా చుట్టూ ఉంటుంది. వైఫై లాగా కనెక్టివిటీ అయి ఉంటుంది.. అని అతడు నిరూపించాడు. అతడు చేసిన పని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయింది. వాషింగ్టన్ డిసి నుంచి మొదలు పెడితే.. సోషల్ మీడియా వరకు అతడి గురించి రచ్చ రంబోలా అవుతోంది. ఇంతకీ అతడు చేసిన పనేంటి.. ఎందుకు ఇంతలా సెలబ్రిటీ అయిపోయాడు.. మీడియా మొత్తం అతడి నామ జపం ఎందుకు చేస్తోంది.. తెలుసుకుందాం పదండి..

ఉద్యోగం పురుషలక్షణం.. ఈ మాటను ఎవడు కనిపెట్టాడో తెలియదు గానీ.. ఆ ఉద్యోగం సంపాదించడానికి నేటి కాలంలో మగవాళ్ళు పడుతున్న ఇబ్బందులు మామూలువి కావు. వైట్ కాలర్ ఉద్యోగాలు సంపాదించాలంటే తడిసి మోపెడవుతుంది. ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే.. దానిని కాపాడుకోవడం మరింత ఇబ్బందిగా మారుతోంది. పైగా నేటి కాలంలో రకరకాల అవరోధాలు.. ప్రతి బంధకాలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేవు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. అంతర్జాతీయంగా ఏ మార్పు జరిగినా సరే వైట్ కాలర్ ఉద్యోగాల మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్న నేటి కాలంలో.. ఓ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు జాబ్ ఆఫర్ ఇచ్చిన కంపెనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

ఆ యువకుడు కన్సల్టెంట్ గా పనిచేశాడు. అతడికి ఆ రంగంలో విపరీతమైన పట్టు ఉంది.. అతడి చాకచక్యం కూడా ఈ స్థాయిలో ఎదగడానికి తోడ్పడింది. ఇటీవల అతడు ఒక బహుళతి సంస్థ నుంచి కాల్ అందుకున్నాడు. తన సీవీ కి సంబంధించిన జాబ్ ఉందని ఆ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే అతడు ఎగిరి గంతులు వేయలేదు. భారీ ఆఫర్ అని సంకలు గుద్దుకోలేదు. జస్ట్ ఆ సంస్థ ఫోన్ కాల్ రాగానే.. ఆ నెంబర్ మొత్తాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాడు. అంతేకాదు ఆ సంస్థలో పనిచేసే అవకాశం లేదని.. తాను లెజెండ్ అని మరో మాటకు తావు లేకుండా చెప్పేశాడు.. దీని వెనుక బలమైన కారణం ఉంది. ఎందుకంటే అతడి స్థాయికి తగ్గట్టుగా ఆ కంపెనీ లేదట. అందులో సౌకర్యాలు లేవట. పైగా జీతం బాగుంటే సరిపోతుందా.. నా స్టైల్ కి తగ్గట్టుగా అన్ని ఉండాలి కదా అని అతడు చెబుతున్నాడు. అయితే ఇతడిలో టాలెంట్ విపరీతంగా ఉండటంతో ఆ కంపెనీ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదట. ఎవరికి ఆ కంపెనీ సీఈవో మెయిల్ ద్వారా అతడిని సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. అయినప్పటికీ ఆ యువకుడు అందులో చేరడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఎందుకంటే అతడికి ఈగో వైఫై లాగా ఉంది. అన్నింటికీ మించి తన మీద తనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది.

“ఉద్యోగానిది ఏముంది.. కంపెనీ అయినా ఇస్తుంది. నా దగ్గర బోలెడంత టాలెంట్ ఉంది. ఏదైనా చేయగలను. ఏమైనా చేయగలను. అనుభవం కూడా ఉంది. అలాంటప్పుడు ఎవడో భారీ జీతం ఇచ్చి.. సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్న చోట పని చేయాలంటే ఎలా కుదురుతుంది. అన్ని బాగుంటేనే కదా పని బాగా చేయగలము. అలాంటప్పుడు ఆ కంపెనీ తన లోపాలను సవరించుకొని నా దగ్గరికి వస్తే అప్పుడు ఆలోచిస్తానని” ఆ యువకుడు చెబుతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular