Scam : యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న 46 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన దంతవైద్యుడు డాక్టర్ రంజన్ రాజ్బన్షి పెద్ద స్కామ్ చేశాడు. ఇటీవల రెండేళ్ల వ్యవధిలో COVID-19 సహాయ నిధులలో $500,000 డాలర్లను దొంగిలించాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించారు.
స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (SBA) , US డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS) ద్వారా మొత్తం $850,000కి పైగా రిలీఫ్ ఫండ్లు కరోనా మహమ్మారికి సంబంధించిన నిర్దిష్ట వ్యాపార ప్రయోజనాల కోసం కేటాయించబడ్డాయి. అయితే ఈ నిధులను ఉద్దేశించిన విధంగా ఉపయోగించకుండా డాక్టర్ రాజ్బన్షి వ్యక్తిగత ఖర్చులు, పెట్టుబడుల కోసం $500,000 మళ్లించారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), SBA ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ , HHS ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్లు జరిపిన సమగ్ర విచారణలో ఈ స్కాం వెలుగుచూసింది. మన డాక్టర్ చేసిన ఈ అనధికార వ్యయాలు వెలుగులోకి వచ్చాయి.
డా. రాజ్బన్షి తన శిక్షకు ముందు దొంగిలించబడిన నిధులను తిరిగి చెల్లించడానికి అంగీకరించాడు. నేరం రుజువైతే అతను గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష , $250,000 వరకు జరిమానాను ఎదుర్కొంటాడు. డిసెంబర్ 4న శిక్ష ఖరారు కానుంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More