HomeNewsTelangana Media News: ప్రొడక్షన్ ఇంచార్జ్ రిజైన్.. సర్కులేషన్ ఇంచార్జ్ ఎగ్జిట్.. ఆ పత్రిక మూసివేత..

Telangana Media News: ప్రొడక్షన్ ఇంచార్జ్ రిజైన్.. సర్కులేషన్ ఇంచార్జ్ ఎగ్జిట్.. ఆ పత్రిక మూసివేత..

Telangana Media News: అయిపోయింది.. మొత్తం అయిపోయింది. నిష్టూరంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. 2014 నుంచి 2023 వరకు ఆ పత్రిక రాసిందే రాత. గీసిందే గీత. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం.. మన పత్రిక అనే ట్యాగ్ లైన్ తో ఆ పత్రిక యాజమాన్యం.. ఆ పత్రికలో పని చేసిన వారు చేసిన హడావిడి మామూలుగా ఉండేది కాదు. పైగా ఆంధ్ర అంటూ ముద్ర వేసేవారు. అక్కడితోనే ఆగిపోయేది కాదు.. తమ పార్టీ కార్యకర్తలతో.. ఆయా […]

Telangana Media News: అయిపోయింది.. మొత్తం అయిపోయింది. నిష్టూరంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. 2014 నుంచి 2023 వరకు ఆ పత్రిక రాసిందే రాత. గీసిందే గీత. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం.. మన పత్రిక అనే ట్యాగ్ లైన్ తో ఆ పత్రిక యాజమాన్యం.. ఆ పత్రికలో పని చేసిన వారు చేసిన హడావిడి మామూలుగా ఉండేది కాదు. పైగా ఆంధ్ర అంటూ ముద్ర వేసేవారు. అక్కడితోనే ఆగిపోయేది కాదు.. తమ పార్టీ కార్యకర్తలతో.. ఆయా పత్రికలు, చానల్స్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేవారు. అద్దాలు పగలగొట్టేవారు. పూల కుండీలు ధ్వంసం చేసేవారు. ఒకరకంగా చెప్పాలంటే.. తెలంగాణలో ఉండాలి అంటే తమకు అనుకూలంగా ఉండాలని.. తెలంగాణ గడ్డమీద వ్యాపారం చేయాలంటే తనకు జేజేలు పలకాలని మొహమాటం లేకుండా చెప్పేవారు.

ఇప్పుడు ఆ రోజులు కాదు. ప్రభుత్వం పోయింది. ఎస్ బాస్ అంటూ యాడ్స్ ఇచ్చేవారు లేరు. వందల కాపీలకు చందాలు కట్టే కాంట్రాక్టర్లు కూడా లేరు. ఒక ముక్కలో చెప్పాలంటే మన పత్రిక కాస్త కొడిగట్టిన దీపం అయింది. మన ఆత్మగౌరవం ఎందుకూ పనికిరానిది అయింది. అధికారం వచ్చిన తర్వాత ఆ పత్రిక ఒక పార్టీకి మరింత దగ్గరయిపోయింది. ఆ పార్టీ అధినేత దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాని రూపురేఖలు.. రంగులు అచ్చం పింక్ కలర్ లోకి చేంజ్ అయ్యాయి.

ఇప్పుడు అధికారంలో లేదు. ప్రకటనలు ఇచ్చేవారు లేరు. చందాలు కట్టేవారు అంతకంటే లేరు. పైగా ఆ పార్టీ అధినేత బయటికి రావడం లేదు. పిచ్చి పిచ్చి కంటెంట్ పబ్లిష్ అవుతుంది. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడే ఆ పత్రికను ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ పేపర్ ను ఎవరు దేకుతారు?, ఎవరు దగ్గరికి తీసుకుంటారు.. గాలి కథనాలు.. బురద క్యాంపెయిన్లు రాసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. రెవెన్యూ లేనప్పుడు మాత్రం పేపర్ ను ఎలా మెయింటేన్ చేస్తారు.. అధికారం కోల్పోయిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ పేపర్ లో పని చేసే ఎంప్లాయిస్ కు ఇంక్రిమెంట్లు,. బోనస్.. ఇతర బెనిఫిట్స్ కూడా లేవు. మొన్నటిదాకా జీతం ఎప్పుడో వచ్చేది.

యూట్యూబ్ చానల్స్.. కొన్ని గ్రూపులకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్న యాజమాన్యం.. ఈ పత్రికను పట్టించుకోవడం లేదు. కాకపోతే మొదటి నుంచి తనకు అండగా ఉన్న పత్రికను మాత్రం పక్కన పెడుతున్నాడని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడే ఆ పత్రికకు నూతన సంపాదకుడిని తీసుకున్నారు. ఆయన పోకడల వల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడ్డారు. వేతనాల పెంపుదల లేదని ధర్నా చేశారు. చివరికి అప్పట్లో యాజమాన్యం సర్ది చెప్పడంతో శాంతించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper