AP ESMA Act: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పడటం లేదు. దీంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రంలో పాలన సాగడం లేదు. దీంతో రోజురోజుకు విభేదాలు ముదురుతున్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య కుదరడం లేదు. ఉద్యోగులు చర్చలకు రావడం లేదని మంత్రులు చెబుతున్నారు. ప్రభుత్వమే పట్టించుకోవడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో పీఆర్సీ తో ఏర్పడిన రగడ సాగుతూనే ఉంది. రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఫిబ్రవరిలో చెల్లించే వేతనాల కోసం ఇంకా బిల్లులు తయారు కాలేదు. దీంతో వచ్చే నెల జీతాల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 1.10 లక్షల బిల్లులు మాత్రమే తయారయ్యాయి. ఇంకా 4.50 లక్షల బిల్లులు తయారు కావాల్సి ఉంది. ఇవి కూడా ఆయా జిల్లాల కలెక్టర్ల చొరవతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుల జారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఫిబ్రవరిలో వేతనాలు అందే సూచనలు కనిపించడం లేదు.దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Also Read: కేంద్రానికి జగన్ సాయం.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన బీజేపీ..
ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో వారిలో కలవరం మొదలైంది. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులుండటంతో వారందరిపై ఎస్మా ప్రయోగించే అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందేమోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోందని తెలుస్తోంది. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సఖ్యత ఎప్పటికి ఏర్పడుతుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎవరో కొందరిని అరెస్టు చేసి ఉద్యోగుల్లో భయం పెంచి సమ్మె విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను ఒకరిద్దరు నేతలను అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఉద్యోగుల్లో కూడా అరెస్టుల భయం పట్టుకుంది. దీంతో తమను తాము రక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకుని అభాసుపాలవుతోంది. సమ్మె ప్రభావంతో సర్కారు నవ్వులపాలు కానున్నట్లు తెలుస్తోంది.
[…] Shiva Rajkumar: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పాత్రకు ‘జేమ్స్’ సినిమాలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైందని అతడి సోదరుడు, నటుడు శివరాజ్‌కుమార్ అన్నాడు. ‘డబ్బింగ్ చెప్పే సమయంలో స్క్రీన్ మీద నా సోదరుడు రాజ్‌కుమార్‌ను చూస్తుంటే నాకు మానసికంగా చాలా కష్టంగా అనిపించింది’ అని శివకుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. సినిమా మధ్యలోనే కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించడంతో ఆ పాత్రకు శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పాడు. […]