AP New Disticts: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 26 జిల్లాలు ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధాని నగరాల ఏర్పాటును చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రానికి 26 జిల్లాల ఏర్పాటును చూస్తుంటే త్వరలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని అంటున్నారు. 13 కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని మంత్రి అన్నారు.
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను దాని మళ్లించేందుకే కొత్త జిల్లాలపై ప్రకటన చేశామని చెప్పడం సరికాదని ప్రభుత్వం తరుఫున స్పష్టం చేశారు.
ప్రముఖల పేర్లతో జిల్లాల పేర్లను మార్చడంపై టీడీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ప్రభుత్వ ఉద్దేశాలను ఆపాదించడం సరికాదని అంటోంది. ఉద్దాత్తమైన ఉద్దేవంతో జిల్లాల్లో ఒకదానికి ఎన్టీ రామారావు పేరు పెట్టిన దాన్ని వైసీపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుకూలమా? వ్యతిరేకమా? అని మంత్రి అవంతి ఆరాతీయడం కౌంటర్ అటాక్ లా మారింది. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలను ప్రశ్నించిన అవంతి వారిని డిఫెన్స్ లో పడేసే ఎత్తుగడను అమలు చేస్తున్నారు.
ఇక కొత్త జిల్లాలకు టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రభుత్వం ప్రశ్నకు టీడీపీ గుర్రుగా ఉంది. కొత్త రాష్ట్రాలపై టీడీపీ వైఖరిని అడిగే ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఏ ప్రాతిపదికన పునర్వ్యస్థీకరిస్తున్నారని మంత్రి ప్రశ్నించాల్సి ఉంటుందని టీడీపీ ప్రశ్నిస్తోంది.
మొత్తంగా ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలతోనే మూడు రాజధానులను పట్టాలెక్కించేందుకు తెరవెనుక వడివడిగా పనులు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ సర్కార్ కొత్త జిల్లాలను ప్రకటించినట్టుగానే సడెన్ గా మూడు రాజధానులను కూడా అమలు చేయబోతోందని సమాచారం. మరి దీనికి ప్రతిపక్ష టీడీపీ ఎలా ప్రిపేర్ అవుతుందని వేచిచూడాలి.