spot_img
HomeNewsBunny: కొరటాల- బన్నీ కాంబోలో పుష్పను మించిపోయే సినిమా?

Bunny: కొరటాల- బన్నీ కాంబోలో పుష్పను మించిపోయే సినిమా?

Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​, రష్మిక హీరోయిన్​గా నటిస్తోన్న సినిమా పుష్ప. సుకుమార్​ దర్శకత్వంలోవస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్​ను వేగం పెంచారు మేకర్స్​. ఈ క్రమంలోనే నిన్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు. హైదరాబాద్​లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొరటాల శివ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు.

kortala-siva-speech-at-pushpa-massive-pre-release-party

సుకుమార్ ప్రస్తుతం ఇక్కడకు రాలేకపోయాడు కాబట్టి ఆయన తరఫున నేను మాట్లాడుతున్నా అంటూ దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు బన్నీ ఈ సినిమా కోసం పడుతున్న కష్టానికి ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్​ కఠోర శ్రమతో కెరీర్​లో కొత్త శిఖరాలను చేరుకున్నాడని అన్నారు. అతనికి అంకితభావం, కష్టపడే స్వభావం పుష్కలంగా ఉన్నాయని.. సినమా కోసం బన్నీ పెట్టే డెడికేషన్​ చూస్తుంటే.. ఎలాంటి కథలు రాయాలో అర్థమవుతోందని అన్నారు. త్వరలోనే పుష్ప కంటే పెద్ద కథతో నీ దగ్గరకు వస్తా బన్నీ.. అంటూ చెప్పుకొచ్చారు.

ఒక నటుడిని అది కూడా నీలాంటి వ్యక్తిని ఏ రేంజ్​లో చూపించొచ్చనేది బాగా ఆలోచించుకుని, స్క్రిప్ట్​ రెడీ చేసి సంప్రదిస్తానని కొరటాల ఈవెంట్​లో స్పష్టం చేశారు.  దీంతో బన్నీ, కొరటాల కాంబోలో సినిమా గ్యారంటీ అనీ అందరూ ఫిక్స్​ అయ్యారు. కాగా, పుష్ప సినిమా ట్రైలర్​ ఇటీవలే విడుదల కాగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 17న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper