Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకి విష్ణు ప్రియ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాపం నరకం అనుభవిస్తుంది అనే చెప్పాలి. ఒక విధంగా ఆమె అలాంటి నరకం అనుభవించడానికి పృథ్వీ, యష్మీ కారణం. పృథ్వీ ని విష్ణు ప్రియ మొదటి నుండి నిజాయితీగా ఇష్టపడుతుంది. కంటెంట్ కోసం ఎలాంటి పిచ్చి డ్రామాలు వేయలేదు. తనకి ఎలా ఉండాలని అనిపిస్తుందో, అలానే ఉంటుంది. గత వారం వరకు పృథ్వీ, విష్ణు బాగానే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళ మధ్యలోకి యష్మీ దూరిందో అప్పటి నుండి పృథ్వీ విష్ణు కి దూరం అయ్యాడు. ఈ వారం జరిగిన నామినేషన్స్ లో అందరూ పృథ్వీ, విష్ణు రిలేషన్ ని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ వేశారు. దీనికి యష్మీ పృథ్వీ కి క్లాస్ పీకుతుంది.
అప్పటి నుండి పృథ్వీ విష్ణు ని రోజుకో యాంగిల్ లో టార్చర్ పెడుతున్నాడు. పూర్తిగా ఆమెని దూరం పెట్టేసరికి విష్ణు నరకం అంటే ఏంటో హౌస్ లో చూస్తుంది. ఉదాహరణకి నిన్న ఎపిసోడ్ చివర్లో విష్ణు, యష్మీ మధ్య చిన్న వాదన జరుగుతుంది. ఈ వాదనలో యష్మీ ఒక సైకో లాగా ప్రవర్తించిందని చెప్పొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్న సూర్య కి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆయన సినిమాల్లోని సూపర్ హిట్ పాటలకు కంటెస్టెంట్స్ అందరూ జోడీలుగా మారి డ్యాన్స్ వేయాల్సిందిగా బిగ్ బాస్ టీం కోరుతుంది. ఊహించినట్టుగానే బిగ్ బాస్ యష్మీ, నిఖిల్ ని ఒక జంటగా, విష్ణు, పృథ్వీ ని మరో జంటగా నిర్ణయిస్తాడు. అందరూ డ్యాన్స్ రిహార్సల్స్ మొదలు పెడుతారు. కానీ పృథ్వీ మాత్రం విష్ణు తో డ్యాన్స్ చేయడం ఇష్టం లేక వంటింట్లోకి వచ్చి అంట్లు తోముకుంటూ ఉంటాడు. అప్పుడు విష్ణు ప్రియ అక్కడికి వచ్చి ‘అందరూ రిహార్సల్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి అంట్లు తోముకుంటున్నావు. నాతో డ్యాన్స్ చేయడం నీకు ఇష్టం లేదా’ అని అడుగుతుంది. ‘నీతోనే కాదు..హౌస్ లో ఎవరితో చేయడానికైనా నేను రెడీ’ అని పృథ్వీ అంటాడు.
‘మరి నువ్వు ప్రాక్టీస్ చేయడానికే ఆసక్తి చూపించడం లేదు’ అని అంటుంది విష్ణు ప్రియ. నీకు స్టెప్స్ తెలుసా?, తెలిస్తే ప్రాక్టీస్ చేద్దాం పదా అని అంటాడు పృథ్వీ. అతనిలోని ఇబ్బందిని గమనించిన విష్ణు ప్రియ, దయచేసి మా జోడీని మార్చండి అని బిగ్ బాస్ ని కోరుతుంది. బిగ్ బాస్ విష్ణు ప్రియ రిక్వెస్ట్ ని అంగీకరిస్తూ విష్ణు, నిఖిల్ ని ఒక జోడిగా, పృథ్వీ, యష్మీ ని ఒక జోడిగా మారుస్తాడు. ఇక్కడి నుండి మొదలైంది అసలు సిసలు రచ్చ. యష్మీ చేసిన ఓవర్ యాక్షన్ మామూలుది కాదు. నిఖిల్ తో డ్యాన్స్ వేయకపోతే నేను చచ్చిపోతాను అనే రేంజ్ లో ఆమె రెచ్చిపోయింది. నీ వల్ల నా సంతోషం పోయిందని, నువ్వు చెప్పబట్టే బిగ్ బాస్ అలా మార్చాడని, విష్ణు ప్రియ పై లేనిపోనీ అబాండాలు వేసింది. ఆమె ఓవర్ యాక్షన్ ని చెప్తే సరిపోదు, మీరే చూడండి ఈ క్రింది వీడియోలో.
Papam #VishnuPriya thappu em lekapoyina #Yashmi overraction chesi Vishnu ni blame chestundi annitiki..
Selfish and arrogant Yashmi ki rojulu daggara paddayi..
Vishnu vala gang nundi bayataki vaste better, valu elago vala kosame aadutaru#BiggBossTelugu8 #Prithvi #Nikhil pic.twitter.com/wJHhDdwXzQ
— TeluguBigg (@TeluguBigg) October 26, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 yashmi showing hell to vishnu priya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com