https://oktelugu.com/

BNP Recruitment 2022: బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌లో 81 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

BNP Recruitment 2022: బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 81 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్‌ టెక్నీషియన్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 1, 2022 6:11 pm
    Follow us on

    BNP Recruitment 2022: బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 81 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్‌ టెక్నీషియన్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    BNP Recruitment 2022

    BNP Recruitment 2022

    ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 2022 సంవత్సరం మార్చి 28వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. https://bnpdewas.spmcil.com/interface/home.aspx లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంది.

    Also Read: ఉక్రెయిన్ విష‌యంలో చైనా ఎందుకు వెన‌క‌డుగు వేస్తోంది?

    మొత్తం 125 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్ష జరగనుంది. వేర్వేరు విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఐఐటీ సర్టిఫికెట్ ను కలిగి ఉండటంతో పాటు ఎన్‌సీబీటీ నుంచి నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

    వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: వైఎస్ వివేకా అల్లుడి సంచలన స్టేట్ మెంట్.. జగన్ పైనే ఆరోపణలు?

    Recommended Video:

    Bheemla Nayak 5th Day Total Collections | Bheemla Nayak Sensational Box Office Collections