Ukraine-Russia War: ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయులు సమిధలవుతున్నారు. వారి యుద్ధ కాంక్షతో ఇండియాకు చెందిన విద్యార్థులు స్వదేశం చేరుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిపై రష్యా సైనికులు పాశవికంగా దాడి చేస్తున్నారు. దీంతో వారు రోదిస్తూ తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నారు. తమను రక్షించాలని వేడుకుంటున్నారు. ఇతర దేశాల సైనికులు సైతం భారతీయులపై దాడులకు తెగబడుతున్నారు.
కాళ్లతో తన్నుతూ వాహనాలు పైకి తీసుకువస్తూ భయపెడుతున్నారు. దీంతో భారతీయులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉక్రెయిన్, పోలెండ్ దేశాల సరిహద్దులో విద్యార్థుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. తల్లిదండ్రులతో తమ బాధలు చెప్పుకుంటున్నారు. రష్యా సైనికుల ఆగడాలను చెబుతూ తమను స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నారు.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం: రష్యా తగ్గడం లేదు..
స్లొవేకియా పోలీసులు భారతీయ విద్యార్థుల కంట్లో కారం కొట్టారు. పెప్పర్ స్ప్రే కొట్టారు. దీంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాల సైనికుల ఘాతుకాలకు బలి అవుతున్నారు.ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నారు. తినడానికి తిండి లేకుండా నిద్ర కరువై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరుతున్నారు.
సరిహద్దుల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు భారతీయ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం సాయం అందిస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు నలుగురు మంత్రులను పంపించి భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నలుగురు మంత్రులను నాలుగు సరిహద్దులకు పంపించి వారిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!