Homeజాతీయం - అంతర్జాతీయంIndia Pakistan Arabian Sea tension: సముద్రాన్ని ఆక్రమించిన పాకిస్తాన్‌.. రంగంలోకి భారత్‌.. తోక ముడిచిన...

India Pakistan Arabian Sea tension: సముద్రాన్ని ఆక్రమించిన పాకిస్తాన్‌.. రంగంలోకి భారత్‌.. తోక ముడిచిన దాయాది!

India Pakistan Arabian Sea tension: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది కొత్త ఆయుధాల తయారీతోపాటు ఉన్న ఆయుధాలను ఆధునికీకరిస్తోంది. ఈ క్రమంలో నింగిలో గతేడాది నాలుగైదుసార్లు నోటామ్‌ విధించి పరీక్షించింది. తాజాగా 2026 తొలిసారి ఈనెల 18 నుంచి 23 వరకునోటామ్‌ విధించింది. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్‌ కూడా మిస్సైల్‌ పరీక్షల కోసం ఆరేబియా సము6దంలో 450 కిలోమీటర్ల రేంజ్‌లో నోటామ్‌ విధించింది. భారత పరిధిలోని సముద్ర […]

India Pakistan Arabian Sea tension: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది కొత్త ఆయుధాల తయారీతోపాటు ఉన్న ఆయుధాలను ఆధునికీకరిస్తోంది. ఈ క్రమంలో నింగిలో గతేడాది నాలుగైదుసార్లు నోటామ్‌ విధించి పరీక్షించింది. తాజాగా 2026 తొలిసారి ఈనెల 18 నుంచి 23 వరకునోటామ్‌ విధించింది. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్‌ కూడా మిస్సైల్‌ పరీక్షల కోసం ఆరేబియా సము6దంలో 450 కిలోమీటర్ల రేంజ్‌లో నోటామ్‌ విధించింది. భారత పరిధిలోని సముద్ర భాగాన్ని కూడా పాకిస్తాన్‌ ఆక్రమించింది. దీంతో భారత్‌ వెంటనే అప్రమత్తమైంది. తక్షణం స్పందించిన నావికాదళం ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ను మొబైలైజ్‌ చేసింది. గతేడాది పహల్గామ్‌ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఏప్రిల్‌ 14–15 తేదీల మధ్య కరాచీ, ఓర్మారా, గ్వాదర్, సోన్‌మియానీ సమీపంలో పాక్‌ నోటామ్‌ జారీ చేసింది.

పాక్‌ మిస్సైల్‌ పరీక్ష నేపథ్యం
పాకిస్తాన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ (షాహీన్‌–3, బాబర్‌ క్రూయిజ్‌) పరీక్షల కోసం 415–450 కి.మీ. పొడవు, 50 కి.మీ. వెడల్పు ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతం పాక్‌ నావికాదళ యాడ్వాన్స్‌లకు సమీపంలో ఉండటం వల్ల భారత వాణిజ్య రవాణా, గస్తీలపై ప్రభావం చూపవచ్చు. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టం ప్రకారం చట్టవిరుద్ధం.
ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ సామర్థ్యాలు..
పరీక్షలకు 24 గంటల ముందే ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ మొబైలైజ్‌ చేసిన 7,300 టన్నుల ప్రాజెక్ట్‌ 15B కాల్కి క్లాస్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ అత్యాధునిక రాడార్, సెన్సార్లతో గుర్తించింది. ధ్రువ్‌ ట్రాకింగ్‌ రేంజ్‌ 400 కి.మీలు. బాలిస్టిక్‌/క్రూయిజ్‌ మిస్సైళ్లను ప్రయోగించగలదు. బ్రహ్మోస్‌ (సూపర్‌సోనిక్‌), బర్రాక్‌–8, యాంటీ–ఎయిర్, యాంటీ–సబ్‌మెరైన్, ఈగల్‌ రాడార్‌ కలిగి ఉంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌ షాక్‌లో ఉంది.

పాక్‌ మిస్సైల్స్‌ భారత వైపు లక్ష్యాలపై ఉంటే రణాంతరిక ఆందోళనలు తీవ్రమవుతాయి. భారత్‌ సముద్ర గస్తీలు, ఫ్రీడమ్‌ ఆఫ్‌ నావిగేషన్‌ ఆపరేషన్స్‌ చేపడుతుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper