రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం చెప్పారు. సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన రైతు చట్టాలపై సంస్కరణలు చేపట్టడానికి, ప్రభుత్వం, రైతుల మధ్య ఉన్న ప్రతిష్ఠంభణను తొలగించడానికి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతులను చర్చలకు కోరారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, చట్టాలపై తమకున్న భయలను చెప్పుకోవచ్చన్నారు. కాగా ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్ లను […]

Written By: Velishala Suresh, Updated On : December 22, 2020 2:11 pm
Follow us on

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం చెప్పారు. సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన రైతు చట్టాలపై సంస్కరణలు చేపట్టడానికి, ప్రభుత్వం, రైతుల మధ్య ఉన్న ప్రతిష్ఠంభణను తొలగించడానికి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతులను చర్చలకు కోరారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, చట్టాలపై తమకున్న భయలను చెప్పుకోవచ్చన్నారు. కాగా ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్ లను కలిపై జాతీయ రహదారులపై రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రజారవాణాను అడ్డుకొని పండ్లు, కూరగాయల సరఫరాను అడ్డుకున్నారు.