Homeజాతీయం - అంతర్జాతీయంED fines NewsClick 184 crore: న్యూస్‌క్లిక్‌.. విదేశీ నిధులతో భారత్ వ్యతిరేక కుట్రలు.. మీడియాపై...

ED fines NewsClick 184 crore: న్యూస్‌క్లిక్‌.. విదేశీ నిధులతో భారత్ వ్యతిరేక కుట్రలు.. మీడియాపై కేంద్రం ఉక్కుపాదం..

ED fines NewsClick 184 crore: భారత దేశంలో ప్రజాస్వామ్యం లేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక మానవుల హక్కులు హరించబడుతున్నాయని విపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. మోదీ విదేశాలకు తలొగ్గుతున్నాడని, దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని ఆరోపిస్తున్నాయి. ఇక లౌకికవాదం ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు తెలుపతున్నాయి. ఈ కారణంగానే బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే, తాజాగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఈడీ భారీగా జరిమానా విధించింది. కమ్యూనిస్టు నేత, జర్నలిస్ట్‌ ప్రబీర్‌ పురకాయస్త నడిపే న్యూస్‌క్లిక్‌ వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీవ్ర చర్యలు తీసుకుంది.

ఫెమా చట్టం ఉల్లంఘన
జరనలిస్టు ప్రబీర్‌ పురయాయస్త నడిపే వెబ్‌సైట్, యూట్యూబ్‌కు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయి. మన శత్రు దేశమైన చైనా పరోక్షంగా నిధులు అందిస్తోంది. అమెరికాలోని తన ప్రతినిధులు, ఏజెంట్ల ద్వారా పురకాయస్త డబ్బులు తీసుకుని భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడు. దీనిపై విచారణ జరిపిన ఈడీ ఫెమా చట్టం సెక్షన్‌ 16 ప్రకారం మొత్తం రూ.184 కోట్ల జరిమానా విధించారు. ప్రబీర్‌ పురకాయస్తకు రూ.64 కోట్లు, న్యూస్‌క్లిక్‌కు రూ.120 కోట్లు విధించారు.

ఆర్థిక నేరాల ఆరోపణలు
ఛానల్‌ నిర్వహణకు విదేశీ నిధులు ఉపయోగించి ప్రభుత్వ విధ్వంసక ప్రచారం చేశారని ఈడీ ధ్రువీకరించింది. ఈ నిధులు భారత వ్యతిరేక కార్యక్రమాలకు మళ్లించబడ్డాయని ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈడీచర్యలు విదేశీ ప్రభావంతో నడిపే మీడియా ఛానళ్లపై పరిమితులు విధించే సంకేతంగా కనిపిస్తున్నాయి. ప్రబీర్‌ పురకాయస్త నాయకత్వంలోని న్యూస్‌క్లిక్‌ భారత విధ్వంసక ప్రచారంలో పాల్పడినట్టు ఆరోపణలు బలపడ్డాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version