Homeజాతీయం - అంతర్జాతీయంNeal Katyal Trump tariff case: ట్రంప్ టారిఫ్‌కు చెక్‌ పెట్టింది మనోడే.. సుప్రీం తీర్పు...

Neal Katyal Trump tariff case: ట్రంప్ టారిఫ్‌కు చెక్‌ పెట్టింది మనోడే.. సుప్రీం తీర్పు వెనుక భారత సంతతి లాయర్‌!

Neal Katyal Trump tariff case: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై రాజ్యాంగ విర్ధుంగా, తన ఇష్టారాజ్యంగా విధించిన టారిఫ్‌లు చెల్లవని అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. టారిఫ్‌లను రద్దు చేసింది. అమెరికా ఫస్ట్‌ అంటూ.. ప్రపంచంలో అన్ని దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు విధించారు. ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై 5 శాతం నుంచి 150 శాతం వరకు టారిఫ్‌లు వేశారు. దీనిని సవాల్‌ చేసింది. అమెరికాలోని ఓ భారతీయ వ్యాపారే. ఇక ఆ వ్యాపారి తరఫున వాధించింది భారత సంతతి మూలాలు ఉన్న లాయర్‌ నీల్‌ కత్యాల్‌ కావడం మరో విశేషం.

నీల్‌ కత్యాల్‌ కీలక పాత్ర..
చిన్న వ్యాపారులు, డెమోక్రాట్‌ రాష్ట్రాల తరపున కత్యాల్‌ 1977 ఐఈఈపీఏ చట్టాన్ని ఉపయోగించి సుంకాలు విధించడాన్ని రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. తీర్పు తర్వాత ఆయన రాజ్యాంగ ఆధిక్యతను సుప్రీంకోర్టు రక్షించిందని, ఇది చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

కత్యాల్‌ నేపథ్యం..
షికాగోలో భారత వలసదారుల కుటుంబంలో జన్మించాడు కత్యాల్‌. ఇతని తల్లి వైద్యురాలు, తండ్రి ఇంజినీర్‌. యేల్‌ లా స్కూల్‌ నుంచి డిగ్రీ పొందిన కత్యాల్, జస్టిస్‌ బ్రేయర్‌ వద్ద క్లర్క్‌గా పనిచేశారు. ఒబామా హయాంలో సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు.

50కిపైగా కేసుల్లో వాదించిన కత్యాల్‌ ట్రంప్‌ ప్రయాణ నిషేధాలు, ఇంపీచ్‌మెంట్‌ విషయాల్లో వ్యతిరేకించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ కేసులో ప్రాసిక్యూటర్‌గా నిలబడి, న్యాయవిభాగం అత్యున్నత పురస్కారం పొందారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version