ఇన్ స్టంట్ లోన్.. ఆన్ లైన్ మనీ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న సంస్థలపై తెలంగాణ పోలీసులు దృష్టిసారించారు. కొందరు వ్యక్తులు ఆన్ లైన్లో యాప్ లు నిర్వహిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Also Read: ఢిల్లీకి కోమటిరెడ్డి..ఈ ఇద్దరిలో ఒకరు పీసీసీ చీఫ్
కరోనా కాలంలో చాలామంది ఇబ్బందులకు గురవుతుండటంతో ఇటీవలీ కాలంలో చాలామంది ఆన్ లైన్లో ఇన్ స్టంట్ లోన్ తీసుకున్నారు. అయితే వాటిని తిరిగి కట్టడంలో ఆలస్యం చేస్తే సదరు సంస్థలను లోన్ తీసుకున్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇన్ స్టంట్ మనీ తీసుకున్న కొందరు బాధితులు యాప్ నిర్వాహాకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు వడ్డీలు కట్టలేక నానాఇబ్బందులు పడుతుండటంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో ఇప్పటికే ఇద్దరు బాధితులు ఆన్ లైన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు బలయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు ఆన్ లైన్ సంస్థలపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ పోలీసులు తాజాగా గూగుల్‌కు లేఖ రాశారు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..?
ఫ్లిప్‌క్యాష్.. క్యాష్ ఓకే.. మైబ్యాంక్.. లిక్విడ్ క్యాష్.. ధనిబజార్.. మనీమార్ట్.. లోన్‌యాప్.. స్నాప్ ఇట్.. క్రేజీ డీన్.. రూపీస్ ఫ్యాక్టరీ.. తదితర యాప్‌ల సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి వీటిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని తెలంగాణ పోలీసులు లేఖలో కోరినట్లు తెలుస్తోంది.
ఆన్ లైన్లో డబ్బులిచ్చి వేధింపులకు ఎవరైనా పాల్పడితే బాధితులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరిగేలా చూస్తామనీ చెబుతున్నారు. ప్రజలెవరూ కూడా మనీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్