Ustaad Bhagat Singh USA Review: ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని చూడడానికి ఉత్సాహం చూపిస్తాడు. కారణం ఏంటి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఒక మేనియా ను క్రియేట్ చేశాడు. ఆయన స్టైల్ లో గాని, స్వాగ్ తో గాని ప్రేక్షకులందరిని థియేటర్ కి రప్పించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన నుంచే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా పడితే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాను టాప్ లెవెల్లో నిల్చోపెట్టాడు. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడిపోయాయి… యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా ఎలాంటి టాక్ ని సంపాదించుకుంది. అక్కడ హిట్ అయిందా ఫర్ అయిందా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
కథ
ఒక పొలిటిషన్ (పార్తిబన్) తన చుట్టూ పక్కల ఉన్న కొన్ని ఊర్లను తన గుప్పెట్లో ఉంచుకొని అక్కడ కొన్ని ఇల్లీగల్ వ్యవహారాలైతే నడిపిస్తూ ఉంటాడు. అక్కడికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఉస్తాద్ భగత్ సింగ్ ఆయనను ఎలా ఢీకొట్టాడు ఆ పొలిటీషియన్ చేసే పనుల్లో ఉన్న అక్రమాలు ఎలా బయటపెట్టాడు అనేదే ఈ సినిమా స్టోరీ…
విశ్లేషణ
హరీష్ శంకర్ ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లాడు… ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సీన్లలో ఉన్న ఇంటెన్షన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యారట…ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్ ను సైతం విపరీతంగా వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఎపిసోడ్ అలాగే సెకండాఫ్ లో విలన్ ఇంట్లో వచ్చే ఒక హై వోల్టేజ్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయట… కొన్ని కామెడీ సన్నివేశాలు సైతం ఈ సినిమాకి ప్లస్ అయినట్టుగా తెలుస్తుంది.
ఆ క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్స్ ను సైతం పవన్ కళ్యాణ్ చాలా బాగా పోట్రే చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి పంచ్ డైలాగ్ కూడా ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుందట. మొత్తానికైతే హరీష్ శంకర్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తను ఒక ఖాతాలో వేసుకున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టైమ్ లో తన స్వాగ్ ను ఉపయోగించి సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాడు.
ఈ సినిమాలో సైతం మరోసారి దాన్ని రిపీట్ చేసినట్టుగా తెలుస్తుంది… పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ లీల క్యారెక్టర్ కి కూడా చాలా మంచి స్కోప్ ఉండడంతో ఆమె పాత్ర కూడా బాగా నటించిందట. తన గ్లామర్ పాత్రకి న్యాయం చేసింది… పార్థీబన్ విలనిజం కూడా హైలెట్ గా నిలిచిందని కొత్త ఫేస్ కావడంతో ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతుంది…
అలాగే దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా పరీక్షలను ఆకట్టుకున్నాయి. అలాగే తమన్ బిజియం సైతం బాగుందట… ఈ సినిమా యూఎస్ఏ లో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ మూవీ రేపు ఇండియాలో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను మరింత పెంచుతుందా? లేదా అనేది చూడాలి…
