Chandrababu: తెలంగాణలో( Telangana) డ్రగ్స్ కలకలం తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసింది. ఆ పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయనపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా ఉంది. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఐదు రోజుల్లో వివరణతో పాటు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. అంతవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. దీంతో అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఉపేక్షించనని.. ఓ నలుగురిపై చర్యలు తీసుకుంటానని కూడా సంకేతాలు పంపించారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. అటువంటి వారితో పార్టీకి డామేజ్ జరుగుతోందని.. అటువంటి వారిని మోయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. తిరుపతి జిల్లా పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో నేతల వ్యవహార శైలి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అయితే పూర్తి అసహనంతో కనిపించడం విశేషం.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
* మారని తీరు
ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారు. వారి విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల వైఖరి బాగాలేదు. దానిపై ఫిర్యాదులు వస్తుండడం, ఇంటలిజెన్స్( intelligence) వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు చంద్రబాబు. రోజురోజుకు కొంతమంది వైఖరి చికాకుగా మారుతోంది. ఇదే ఫైనల్ అన్నట్టు చంద్రబాబు వైఖరి ఉంది. ఏం జరిగితే జరిగింది అని చర్యలకు ఉపక్రమించే ఛాన్స్ కనిపిస్తోంది. ఐ కమాండ్ ఆదేశాలు పాటించని ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకే వివాదాస్పద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓ నలభై మందిని వరుసగా పిలిచి మాట్లాడుతున్నారట చంద్రబాబు. లేనిపోని వ్యవహారాల్లో తలదూర్చి.. వ్యసనాలతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.
* కూటమిపరంగానూ..
అయితే ఒక్క తెలుగుదేశం ( Telugu Desam)పార్టీ మాత్రమే కాదు జనసేనలో సైతం లైంగిక పరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వపరంగా ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ ఇటువంటి పరిణామాలు ఎప్పుడు జరుగుతాయా? ఎప్పుడు వాటిని బయట పెడతామా? అన్న ఆలోచనలో ఉంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం పై సానుకూలత విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు కూటమిలోని వివాదాస్పద నేతల వ్యవహార శైలి పై గట్టిగానే దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ఘటనలన్నీ బయటపడుతున్నాయి. అందుకే పదే పదే చంద్రబాబు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ నేతల వైఖరి మారలేదు. వారి తీరుతో పార్టీకి భారీగా డామేజ్ జరుగుతోంది. అందుకే ఈ ఫైనల్ వార్నింగ్ ఇచ్చి చర్యలకు ఉపక్రమించనున్నారట చంద్రబాబు.
