spot_img
Homeక్రైమ్‌Shocking Incident Aligarh: ప్రియుడితో భార్య.. హోటల్ రూమ్ లో సుఖ సంసారం.. ఈ భర్త...

Shocking Incident Aligarh: ప్రియుడితో భార్య.. హోటల్ రూమ్ లో సుఖ సంసారం.. ఈ భర్త చేసిన పని ఎంతో మంది మొగుళ్ళ ను బతికించింది!

Shocking Incident Aligarh: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వసాధారణంగా మారిపోయాయి. భార్య కు తెలియకుండా భర్త.. భర్త కు తెలియకుండా భార్య రహస్య సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారాలు బయటపడిన తర్వాత.. తమ బంధాన్ని కాపాడుకోవడం కోసం దారుణాలు చేస్తున్నారు. కట్టుకున్న వాళ్లను ఘోరంగా హత మార్చుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా దారుణాలు మనదేశంలో విపరీతంగా పెరిగిపోయాయి.

సరిగ్గా గత ఏడాది ఇండోర్ నగరంలో ఓ యువతి వివాహం చేసుకొని.. తన భర్తను హనీమూన్ తీసుకెళ్ళింది.. ఆ తర్వాత అక్కడ తన ప్రియుడితో కలిసి అతడిని చంపించింది. ఆ ఘటన అచ్చం సినిమాను తలపించింది. దాదాపు మూడు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును పరిష్కరించే బాధ్యతను భుజాలకు ఎతుకున్నారు. అనేక రోజులు దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇండోర్ నగరంలో జరిగిన ఈ దారుణం తర్వాత.. దేశవ్యాప్తంగా ఈ తరహా సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఒకప్పుడు వివాహేతర సంబంధాలు ఈ స్థాయిలో ఉండేవి కాదు.. కానీ, ఇప్పుడు ఇవన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయి. సోషల్ మీడియా.. స్మార్ట్ ఫోన్లు.. సినిమాలు.. వీటి ప్రభావం నేటి కాలంలో భార్యా భర్తల మధ్య విపరీతంగా ఉంటున్నది. అందువల్లే పచ్చని సంసారంలోకి మూడో వ్యక్తి ప్రవేశిస్తున్నారు.

ఇండోర్ ఘటన తర్వాత చాలామంది భర్తలు భయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. భార్య లు వేరే సంబంధాలు పెట్టుకుంటే.. అవి బయటపడితే.. మరో మాటకు తావు లేకుండా వదిలించుకుంటున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో వారే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ తరహా సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లోని అలీగర్ ప్రాంతంలో ఒక భర్త దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.. ఆ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వివాహం జరిగిన మూడు సంవత్సరాలు తిరగకముందే అతడి భార్య మరొక యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతనితో వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో భర్త నిఘా పెట్టాడు. ఆమె నడవడికను గమనించాడు. సరిగ్గా మూడు రోజుల క్రితం ఆ భర్త ఆఫీస్ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. అతడు బయటికి వెళ్ళగానే భార్య అందంగా ముస్తాబై.. ప్రియుడి బైక్ మీద వెళ్లిపోయేది. ఆ భర్త వారి బైక్ ను ఫాలో అయ్యేవాడు. ఆ బైక్ పెద్ద హోటల్ దగ్గర ఆగేది. ఆ తర్వాత వారిద్దరు ఆ గదిలోకి వెళ్లిపోయేవారు. ఇదంతా ఆ భర్త గమనించాడు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి వారిద్దరిని పట్టుకున్నారు. హోటల్ గదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. భవిష్యత్ కాలంలో తనకు ఏదైనా ఆపద ఎదురైతే.. ఒకవేళ తను చనిపోతే దానికి భార్య, ఆమె ప్రియుడు కారణమని అతడు ఫిర్యాదు కింద రాయించాడు. ఆ తర్వాత హ్యాపీగా స్టేషన్ నుంచి బయటికి వచ్చేసాడు. అతని భార్య, ప్రియుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చాలామంది భర్తలను బతికించిందని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version