చికెన్, కోడిగుడ్లపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం స్రుష్టించడంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాలో భర్డ్ ఫ్లూ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ క్రమంగా పాకి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్లో విస్తరిస్తోంది. ఇటీవల ఈ వైరస్ తో కేరళలోని రెండు జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మరణించాయి. వాటి నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపించగా అందులో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని గుర్తించారు. దీంతో ప్రజలు చికెన్, గుడ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.