కరోనా స్ట్రేయిన్ కేసులు పెరుగుతుండడంతో బ్రిటన్ లో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య పెరిగిపోతుందని, దీంతో వైద్యులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ సోమవారం తెలిపారు. దీంతో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించక తప్పదన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ లాక్ డైన్ నెలరోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. కాగా సోమవారం బ్రిటన్ లో అక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. సోమవారం వరకు ఇంగ్లాండ్లోని ఆసుపత్రుల్లో 26,626 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇది వారం కిందటి కంటే 30 శాతం ఎక్కువ.