https://oktelugu.com/

హీరోగారితో జ్వాలాగారి పెళ్లి ఎప్పుడో ?

బ్యాడ్మింటన్‌ స్టార్‌ గా గుత్తా జ్వాలకి మంచి ఇమేజ్ ఉంది. కానీ, జ్వాల తన గేమ్ కంటే కూడా తన కామెంట్లతోనే ఎప్పుడు జ్వాలలా రగిలిపోతూ ఉంటుంది. ఇక జ్వాలగారు తమిళ యాక్టర్ విష్ణు విశాల్‌ తో కొన్నాళ్లుగా డేటింగ్‌ లో మునిగి తేలుతూ అతనితో పెళ్లికి రెడీ అయింది. ఏది ఏమైనా తన బిహేవియర్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉండే జ్వాల, విష్ణు విశాల్‌తో తన రహస్య సంబంధాన్ని బహిరంగానే […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 09:28 AM IST
    Follow us on


    బ్యాడ్మింటన్‌ స్టార్‌ గా గుత్తా జ్వాలకి మంచి ఇమేజ్ ఉంది. కానీ, జ్వాల తన గేమ్ కంటే కూడా తన కామెంట్లతోనే ఎప్పుడు జ్వాలలా రగిలిపోతూ ఉంటుంది. ఇక జ్వాలగారు తమిళ యాక్టర్ విష్ణు విశాల్‌ తో కొన్నాళ్లుగా డేటింగ్‌ లో మునిగి తేలుతూ అతనితో పెళ్లికి రెడీ అయింది. ఏది ఏమైనా తన బిహేవియర్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉండే జ్వాల, విష్ణు విశాల్‌తో తన రహస్య సంబంధాన్ని బహిరంగానే ధృవీకరించి మరీ.. వివాహానికి రంగం సిద్ధం చేసుకోవడమే లేకుండా.. తన గత పుట్టినరోజు వేడుక సందర్భంగా విష్ణు విశాల్‌ తో నిశ్చితార్థం కూడా చేసుకుంది.

    Also Read: చెన్నకేశవ స్వామి ఆలయంలో బాలయ్య ఫైట్ సీక్వెన్స్ !

    కానీ అప్పటినుండి పెళ్లి తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సర వేడుకల్లో గుత్తా జ్వాల – విష్ణు విశాల్‌ జంట కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఫోటోలు కూడా వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ, ఈ మధ్య అలాంటి ఫోటోలు ఎక్కువుగా సోషల్ మీడియాలో కనిపించడం లేదని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వారి కామెంట్స్ కి దీటుగా రీసెంట్ గా విశాల్ విష్ణు తనను ముద్దాడుతున్న ఫోటోను జ్వాలనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    Also Read: ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ ఎపిసోడ్-2.. వంటతో మంట పుట్టించారు!

    ఈ ఫోటోను బట్టి తమ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటింది జ్వాల. ఎంతైనా జ్వాల ఇలాంటి విషయాల్లో అసలు మొహమాటపడదు. ఇంతకీ హీరోగారితో జ్వాలగారి పెళ్లి ఎప్పుడో అని మళ్ళీ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి వీటికీ జ్వాలా మేడమ్ ఏమి సమాధానం చెబుతుందో. నిజానికి విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి కారణం గుత్తా జ్వాలనే అని విమర్శలు ఉన్నాయి. కాకపోతే జ్వాల ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోదు అనుకోండి. జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుని, అతనితో పెళ్లి బంధాన్ని కొద్దికాలానికి పరిమితం చేసింది. మరి హీరో విష్ణు విశాల్‌ బంధం ఎన్నాళ్ళో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్