మంచులో చిక్కకున్న 500 మంది పర్యాటకులు

భారీగా మంచు కురవడంతో దాదాపు 500 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ పరిధిలోని సోలాంగ్ మధ్య వీరు చిక్కకున్నట్లు సమాచారం. వీరిని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు రెస్క్యూ టీం బ్రుందం శనివారం రాత్రి 8 గంటలకు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా మనాలీ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రమణ్ ఘర్సాంగీ మాట్లాడుతూ మనాలీలో చిక్కకున్న పర్యాటకులను కాపాడేందుకు రెస్క్యూ టీం డూండీ చేరుకుందన్నారు. అలాగే 40 సీట్లు కలిగిన […]

Written By: Suresh, Updated On : January 3, 2021 8:45 am
Follow us on

భారీగా మంచు కురవడంతో దాదాపు 500 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ పరిధిలోని సోలాంగ్ మధ్య వీరు చిక్కకున్నట్లు సమాచారం. వీరిని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు రెస్క్యూ టీం బ్రుందం శనివారం రాత్రి 8 గంటలకు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా మనాలీ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రమణ్ ఘర్సాంగీ మాట్లాడుతూ మనాలీలో చిక్కకున్న పర్యాటకులను కాపాడేందుకు రెస్క్యూ టీం డూండీ చేరుకుందన్నారు. అలాగే 40 సీట్లు కలిగిన ట్యాక్సీలను కూడా పంపించామన్నారు. కాగా ఈనెల 5 వరకు మంచు కురిసే అవకాశాలున్నాయని పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది.