https://oktelugu.com/

ఇగ్లూ ఇల్లు.. మజాగుండు.. చలికాలంలో చూడాల్సిన మన ప్రదేశాలు

ఎంతటి చలిలోనైనా ఐస్‌ క్రీమ్‌ తినడం సిటీ జనులకు అలవాటు. ముఖ్యంగా యూత్‌ యంగర్స్‌ నైట్‌ సిటీ అంతా చుట్టేస్తూ ఐస్‌ క్రీమ్‌లు తింటూ చలికాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చలికాలంలోనూ మంచు కొండల వద్దకు వెళ్తే ఆ కిక్కే వేరప్ప అని అంటున్నారు టూరిజనులు. అందులోనూ ఈ వింటర్‌‌ సీజన్‌లో మనాలికి వెళ్తే.. అందులోనూ ఇగ్లూలో స్టే చేస్తే.. ఆహా లైఫ్‌కి ఇంకేం కావాలి అనే ఫీలింగ్‌ కలుగక మానదు. Also Read: డ్రై రన్ బేషుగ్గా ఉందని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2021 / 08:42 AM IST
    Follow us on

    ఎంతటి చలిలోనైనా ఐస్‌ క్రీమ్‌ తినడం సిటీ జనులకు అలవాటు. ముఖ్యంగా యూత్‌ యంగర్స్‌ నైట్‌ సిటీ అంతా చుట్టేస్తూ ఐస్‌ క్రీమ్‌లు తింటూ చలికాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చలికాలంలోనూ మంచు కొండల వద్దకు వెళ్తే ఆ కిక్కే వేరప్ప అని అంటున్నారు టూరిజనులు. అందులోనూ ఈ వింటర్‌‌ సీజన్‌లో మనాలికి వెళ్తే.. అందులోనూ ఇగ్లూలో స్టే చేస్తే.. ఆహా లైఫ్‌కి ఇంకేం కావాలి అనే ఫీలింగ్‌ కలుగక మానదు.

    Also Read: డ్రై రన్ బేషుగ్గా ఉందని కితాబిచ్చిన గవర్నర్ తమిళ సై..!

    ఎత్తైన పర్వతాలు.. తెల్లగా పరుచుకున్న మంచు దప్పట్లు.. మధ్యలో మంచుతో నిర్మించిన ఇళ్లు. వాహ్‌ చదువుతుంటేనే ఏదో అనుభూతి కలుగుతుంది కదూ..! అవును మరి ఇవన్నీ ఎక్కడో బయటి దేశంలో ఉన్నాయనుకోకండి. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లాల్సిందే.

    కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లు జనం ఇళ్లకే పరిమితమైంది. కానీ.. పర్యాటక ప్రియులు మాత్రం మనాలికి వెళ్తే ఈ సరికొత్త అనుభూతిని మాత్రం పొందొచ్చు. మనం చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్న ఇగ్లూలు అక్కడ దర్శనమిస్తాయి. ఆ మంచు ఇళ్లలో సరదాగా రెండు మూడు రోజులు గడిపేయొచ్చు. దేశంలోనే మొట్టమొదటి సారి నిర్మించిన ఇగ్లూల్లో ఉంటూ ఆర్కిటిక్‌ అనుభూతిని పొందొచ్చు.

    * ప్రకృతి అందాలకు కేరాఫ్‌..
    మనాలి అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్‌. సాహస క్రీడలకు అనువైన ప్రాంతం కూడా. ఇది సిమ్లా నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు వెళ్తే హమ్తా పాస్‌లోని ఇగ్లూ హోస్ట్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు. సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచు ఇళ్లను 2017లో సేథన్‌ గ్రామానికి చెందిన వికాస్‌ కుమార్‌‌, తాషీ అనే ఇద్దరు యువకులు ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఏటా వింటర్‌‌లో ఈ ఇగ్లూలను పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. అంతేకాదు.. ఈ ఇగ్లూలలో స్టే చేయాలంటే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిందే. ఏప్రిల్‌ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది కరోనా దృష్ట్యా మార్చిలోనే మూసివేశారు. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు కొలిక్కి వస్తుండడంతో అక్కడి ప్రభుత్వం తాజాగా వికాస్‌ బృందానికి ఇగ్లూ హోటల్‌ తెరవడానికి అవకాశం ఇచ్చింది.

    Also Read: మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి

    *పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
    ఇగ్లూలను నిర్మించే పనిలో పడింది వికాస్‌ బృందం. ప్రస్తుతం ఆరుగురు వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారు. మనాలిలో రాత్రి ఉష్ణోగ్రత మైనస్‌ నాలుగు నుంచి 30 డిగ్రీలకు పడిపోతుంది. అందువల్ల.. పర్యాటకులు చలిని తట్టుకునేలా జనరేటర్‌‌ సాయంతో హీటర్లను ఏర్పాటు చేశారు. ఇగ్లూ లోపల ఎండుగడ్డి, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక దుస్తులు, వేడి నీళ్ల బాటిళ్లు సైతం అందుబాటులో ఉంటాయి. రాత్రి అక్కడే బస చేసే వారికి అల్పాహారం, టీ, కాఫీతోపాటు శాకాహారం, మాంసాహారంతో చేసిన వివిధ రకాల వంటకాలు లభిస్తాయి.

    *అందరికీ అందుబాటులో ప్యాకేజీలు..
    ఇగ్లూలో ఉండేందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కేవలం పగటి వేళ మాత్రమే అయితే పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. పగలు, ఒకరాత్రి ఉండేందుకు రూ.5,500 వసూలు చేస్తున్నారు. అలాగే రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీకి ఒక్కో వ్యక్తికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆరేళ్లలోపు పిల్లలకు ఇక్కడికి అనుమతి లేదు.

    *చూడదగిన ప్రదేశాలు..
    పగటి వేళ స్కేయింగ్‌, స్నో బోర్డింగ్‌ వంటి ఆటలతోపాటు రోహతాంగ్‌ పాస్‌, చంద్రఖని పాస్‌, సోలాంగ్‌ లోయ, సుల్తాన్‌పుర ప్యాలెస్‌ వంటి ప్రదేశాలను చూడొచ్చు. అంతేకాదు.. మంచు సూట్‌, గ్లౌజెస్‌, సాక్సులు, షూ ఇక్కడ అద్దెకు కూడా లభిస్తాయి. ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బంది పర్యాటకుల వెంట ఉంటారు.

    -శ్రీనివాస్.బి

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్