https://oktelugu.com/

రేప్ చేసి చంపుతాడు! శవాలతో పైశాచికం.. వంద మందిని.. సైకోకిల్లర్ కథ!

మీ అందరికీ ఓ కథ చెబుతా. కల్పితం కాదు.. యథార్థం! భయానకమైన వాస్తవం! అప్పుడెప్పుడో జరిగింది. ఇప్పుడు ఎక్కడో ఓ చోట జరుగుతున్నది. రేపు మరోచోట ఖచ్చితంగా జరగబోయేది. ఇది ఇప్పటి వరకూ చూసిన సస్పెన్స్ క్రైమ్ సినిమాకి అబ్బలా ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ చూసి ఎక్కువ చెప్తున్నా అనుకుంటారేమో.. ఈ రియల్ స్టోరీ చదివిన తర్వాత తక్కువే చెప్పానంటారు! ఇక, ఆలస్యం చేయకుండా.. కథలాంటి నిజంలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక్కమాట. Also Read: ఇగ్లూ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2021 8:53 am
    Follow us on

    మీ అందరికీ ఓ కథ చెబుతా. కల్పితం కాదు.. యథార్థం! భయానకమైన వాస్తవం! అప్పుడెప్పుడో జరిగింది. ఇప్పుడు ఎక్కడో ఓ చోట జరుగుతున్నది. రేపు మరోచోట ఖచ్చితంగా జరగబోయేది. ఇది ఇప్పటి వరకూ చూసిన సస్పెన్స్ క్రైమ్ సినిమాకి అబ్బలా ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ చూసి ఎక్కువ చెప్తున్నా అనుకుంటారేమో.. ఈ రియల్ స్టోరీ చదివిన తర్వాత తక్కువే చెప్పానంటారు! ఇక, ఆలస్యం చేయకుండా.. కథలాంటి నిజంలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక్కమాట.

    Also Read: ఇగ్లూ ఇల్లు.. మజాగుండు.. చలికాలంలో చూడాల్సిన మన ప్రదేశాలు

    ‘‘తెల్లకోటు వేసుకున్న ప్రతివాడూ డాక్టర్ కాదు..
    నల్లకోటు తొడుక్కున్న ప్రతివాడూ లాయర్ కాదు..
    అలాగే.. కెమేరా పట్టుకున్న ప్రతివాడు ఫొటోగ్రాఫర్ కాదు..’’

    * కథ ప్రారంభం..
    స్టోరీ ఓపెన్ చేస్తే.. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం. పక్కాగా చెప్పాలంటే 1979, జూన్ 20వ తేదీ. అమెరికా దేశంలోని కాలిఫోర్నియా. అందులోని హంటింగ్టన్ బీచ్‌‌ ప్రాంతం. ఆ ప్రాంతానికే చెందిన ఓ బాలిక. పేరు రాబిన్ సమ్సోయ్. వయసు 12 సంవత్సరాలు. ఉన్నట్టుండి మిస్సయ్యింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడి పోలీసులు తీవ్రంగానే వెతికారు. కానీ.. జాడ లభించలేదు. ఆ పాప మిస్సయిన 12 రోజుల తర్వాత పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ హిల్ స్టేషన్ వద్ద ఓ బాలిక శవం కుళ్లిన స్థితిలో పడి ఉందన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎంక్వైరీ చేస్తే అది కనిపించకుండా పోయిన రాబిన్ సమ్సోయ్‌ శవమని తేలింది.

    *ఎవరు చేశారీ దారుణం?
    ‘బాడీ దొరికింది. కానీ.. ఆమెను ఎవరు చంపారు?’ ఏ మాత్రం ఆధారమూ లేని కేసును ఓ కొలిక్కి తేవడమంటే మామూలు విషయం కాదు. కానీ.. పోలీసుల డ్యూటీ అదే కదా మరి?! వేట మొదలు పెట్టారు. సీన్ కట్ చేస్తే.. ఈ బాలిక మరణానికి కొద్ది నెలల ముందు మరో ఇద్దరు కూడా ఈ రాబిన్ సమ్సోయ్ తరహాలోనే చనిపోయిన విషయం తెలిసింది. దీంతో పోలీసు బుర్రకు డౌట్ రానే వచ్చింది. రాబిన్ సమ్సోయ్ హత్యకు, గత రెండు హత్యలకూ మధ్య ఏదో లింక్ ఉందని.. కేసును ఆ దిశగా ట్రాక్ మళ్లించి, అక్కడి నుంచి తవ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రాబిన్ స్నేహితులను కూడా ప్రశ్నించారు.

    * క్లూ దొరికింది..
    రాబిన్ స్నేహితులతో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. కొద్ది రోజుల కిందట తాము సమ్సోయ్ తో కలిసి బీచ్‌లో ఉన్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి తమ వద్దకు వచ్చి ఫొటోలు తీశాడని చెప్పారు. వారు చెప్పిన వివరాలతో సినిమాల్లో గీయించినట్టుగానే నిందితుడి బొమ్మ గీయించారు. వాటిని మిగతా పోలీస్ స్టేషన్లకు పంపారు. పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఆ ఫొటోలను అతికించి ఆ పోలికలతో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతున్నట్లయితే తమకు తెలియజేయాలని సినిమాటిక్ గా  ప్రకటించారు.

    * తొలి ఫలితం వెలువడింది..
    ఆ నిందితుడి బొమ్మను చూసిన ఓ జైల్ అధికారికి వాణ్ని ఎక్కడో చూసినట్టుగా కొడుతోంది! ఆలోచిస్తే.. గతంలో జైలుకు వచ్చిన వాడిలాగా కనిపిస్తున్నాడు. వెంటనే ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ టీమ్ కు చెప్పేశాడు. దీంతో విచారణ వేగవంతం చేశారు. ఎన్నో ప్రాంతాలు తిరిగారు.. ఎంతో మందిని విచారించారు.. అణువణువూ శోధించారు. అడుగుల గుర్తులు కూడా కనిపించుకుండా చెరిపేస్తూ హత్యలు చేసుకుంటూ వెళ్లిన హంతకుడి కోసం నిద్రలేని రాత్రులు గడిపారు పోలీసులు. ‘ఎంత తెలివైన నేరస్థుడైనా ఏదో చిన్న తప్పు చేసి దొరికిపోతాడు’అంటూ సినిమాల్లో చాలా సార్లు వినిపించిన డైలాగ్ ఇక్కడ రిపీట్ అయ్యింది. కేవలం ఒక చిన్న ఆధారంతో నిందితుడు పోలీసులకు దొరికాడు. కానీ.. పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి! అధికారులు నిశ్చేష్టులైపోయారు! అతను హత్య చేసింది రాబిన్ సమ్సోయ్ ని మాత్రమే కాదు.. అంతకు ముందు చనిపోయిన ఇద్దరిని మాత్రమే కాదు.. ఆ నెంబర్ పెరిగేలా కనిపిస్తోంది! 10.. 20.. 30.. 50.. 80.. 90.. 100.. ఇంకా పెరిగేలా ఉంది!!! అసలు ఎంత మందిని చంపాడు? ఇంత మందిని ఎందుకు చంపాడు? అసలు ఎవడు చంపాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే.. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ సీన్లోకి ఎంటరైనట్టు మనం కూడా వెనక్కి వెళ్లాలి. సీరియల్ కిల్లర్ పరిచయం మళ్లీ మొదలు పెట్టాలి.

    Also Read: టీమిండియాకు షాక్: బయటకొచ్చిన ఐదుగురు క్రికెటర్లు ఐసోలేషన్ కు..

    *నేరస్థుడి పరిచయం..
    అతడి పేరు ‘రాడ్నీ జేమ్స్ అల్కాలా.’ చిన్ననాటి నుంచే ఒక విధమైన మనస్తత్వంతో పెరిగిన అల్కాలా.. క్రమంగా ఒక సైకో మెంటాలిటీని అలవర్చుకున్నాడు. అంతకు ముందు అతను చేసిన నేరాలు.. ఘోరాల గురించి ఎవరికీ తెలియదుగానీ.. 1968లో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి.. ‘హాలీవుడ్ అపార్ట్‌మెంట్‌లో ‘తాలి షాపిరో’ అనే ఎనిమిదేళ్ల చిన్నారిపై అల్కాలా అత్యాచారయత్నం చేస్తుండగా అడ్డుకున్నాను.’ అని  చెప్పాడు. అయితే.. పోలీసులు అక్కడికి వచ్చేసరికి అల్కాలా పరారయ్యాడు. తప్పించుకున్న అల్కాలా న్యూయార్క్‌లో జాన్ బర్గెర్ అనే మారు పేరుతో ఫిల్మ్ స్కూల్‌లో చేరాడు. అయితే.. ఎఫ్‌బీఐ పోస్టర్లలో అతడి ఫొటోను చూసిన కొంతమంది ఫిల్మ్ స్కూల్ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుమారు మూడేళ్ల తర్వాత 1971లో అల్కాలా అరెస్టయ్యాడు. మొత్తం ఐదేళ్లు జైల్లోనే ఉన్నాడు. పెరోల్ రూల్‌ను అతిక్రమించడమే కాకుండా ఓ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినందుకు మరికొన్నేళ్లు జైలు జీవితం గడిపాడు అల్కాలా.

    *జైలు నుంచి విడుదలయ్యాడు..
    శిక్ష పూర్తయిన తర్వాత జైలు నుంచి విడుదలైన అల్కాలా.. కారణమేంటో తెలియదుగానీ.. హాలీవుడ్ నైట్ క్లబ్ యజమాని కుమార్తె ఎలైనే‌ను హత్య చేశాడు. అయితే.. ఆ హత్య అతడే చేశాడని పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో అల్కాలా ఫ్రీ బర్డ్ అయ్యాడు. ఆ తర్వాత 1978లో ‘లాస్ ఏంజిల్స్‌ టైమ్స్‌’ పత్రికలో ఉద్యోగం సంపాదించాడు. ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు.

    * మెడలో కెమెరా…
    అతని మెడలో ఎప్పుడూ కెమెరా వేళాడుతూ ఉంటుంది. అవును.. మీరు ఊహించింది కరక్టే. అతను అద్భుతమైన ఫొటోగ్రాఫర్. ఎంత బాగా ఫొటోలు తీస్తాడంటే.. వేలాది మంది మోడల్స్ తమ ఫొటోలు తీయమంటూ అల్కాలా వెంట పడేంతగా! అలా.. తక్కువ కాలంలోనే గొప్పగా పేరు సంపాదించకున్నాడు. ఆ విధంగా పాపులర్ అయిన జేమ్స్ అల్కాలా.. అమెరికాలో పాపులర్ టీవీ షో ‘ది డేటింగ్ గేమ్’ షోలో పాల్గొన్నాడు. ఇంచుమించు ఇప్పుడు మన దగ్గర ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్’షో లాంటిది. చాలా అందంగా ఉండే అల్కాలా.. ఆ పోటీలో విజేతగా నిలిచాడు. ఇంకేముంది? మనోడి పాపులారిటీ ఆకాశాన్ని తాకింది. అమెరికా మొత్తం మార్మోగింది.

    *అదృశ్యమవుతున్న అమ్మాయిలు..
    ఫొటో గ్రాఫర్ గా మరిన అల్కాలా.. ‘ది డేటింగ్ గేమ్’ ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. ఈ ఫేమ్.. అమ్మాయిలను మచ్చిక చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది. పైగా అందగాడు కూడా. దీంతో.. ఎంతో మంది అమ్మాయిలతో డేటింగ్ చేస్తూ.. జాలీగా జీవితాన్ని గడిపేశాడు. అయితే.. ఆ సమయంలో చాలామంది టీనేజ్ అమ్మాయిలు మిస్సయిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా? హత్యాచారాలు చేస్తున్నారు? ఎవరు, ఎందుకు చేస్తున్నారా? అనేవేవీ తెలియట్లేదు. పోలీసులు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. కానీ.. ఫలితం దక్కలేదు. గేమ్ షోలో విజయం సాధించిన తర్వాత అల్కాలా హత్యలు చేయడం మరింత పెరిగింది. కానీ.. ఈ విషయం పోలీసులకు తెలియదు. దీంతో అమ్మాయిలతో లైంగిక జీవితం అనుభవించడం.. ఆ తర్వాత వారిని చంపేయడం ఒక అలవాటుగా మారింది అల్కాలాకు.

    *గొంతు నొక్కి.. ఎంజాయ్ చేస్తాడు
    తన వద్ద ఫొటోలు తీయించుకోడానికి వచ్చే మోడల్స్‌ దుస్తులు విప్పించేవాడు. ఆ తర్వాత వారికి మాయమాటలు చెప్పి సెక్స్ చేసేవాడు. అంగీకరించని మోడల్స్‌తో దురుసుగా ప్రవర్తించేవాడు. ఇక, వారిలో చిన్న వయస్సు వారు ఉంటే.. వారిపై దాడిచేసి, గొంతు నొక్కి స్పృహ తప్పేలా చేసి, అనంతరం అత్యాచారం చేసేవాడు. వాళ్లు మళ్లీ స్పృహలోకి వస్తే.. మరోసారి పీక నొక్కేవాడు. ఆ క్రమంలో వాళ్లు చనిపోయేవారు. అయితే.. అప్పటికీ వారిని వదలకుండా నగ్నంగా ఉన్న శవాలతో ఫొటోషూట్ చేసి ఆనందించేవాడు. ఆ తర్వాత శవాలను నగర శివారు ప్రాంతాల్లో పడేసేవాడు. ఏ ఒక్క ఆధారమూ దొరకకుండా జాగ్రత్తపడేవాడు. ఇలా ఎన్నో నేరాలు చేశాడు. కానీ,  మనం కథ మొదట్లో చెప్పుకున్న 12 ఏళ్ల బాలిక రాబిన్ సమ్సోయ్ మర్డర్ సంద్భంగా అల్కలా వదిలిన ఒక చిన్న ఆధారంతో పోలీసులు అతడే నేరస్థుడని గుర్తించారు.

    *పట్టించిన చెవి రింగులు..
    12 ఏళ్ల బాలిక చనిపోయినప్పుడు బొమ్మలు గీయించగా.. ఓ జైల్ అధికారి ఆ బొమ్మను గుర్తించాడని చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు..  1980లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి స్టోరేజ్ లాకర్‌ ను పరిశీలించగా.. అందులో బాలిక సమ్సోయ్ చెవి రింగులు లభించాయి. ఆ రింగులపై ఉన్న వేలి ముద్రలు సైతం అల్కాలాతో సరిపోయాయి. దీంతో.. అల్కాలానే ఆమెను చంపాడని పోలీసులు నిర్ధరించారు. కానీ, అల్కాలా మాత్రం నేరాన్ని అంగీకరించలేదు.

    *కోర్టు ఉరిశిక్ష వేసింది కానీ..
    బాలిక రాబిన్ సమ్సోయ్ కుటుంబ సభ్యులు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు అతడికి మరణ దండన విధించింది. కానీ, కాలిఫోర్నియా సుప్రీం కోర్టు.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. నేరగాడి గత నేరాలను దృష్టిలో పెట్టుకుని మరణ దండన విధించారని పేర్కొంది. పూర్తి ఆధారాలతో మళ్లీ కేసును విచారించాలని తీర్పు చెప్పింది. దీంతో కథ మళ్లీ మొదటి కొచ్చింది. 1980 నుంచి పోలీసులు మళ్లీ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అలా విచారించి.. ఆధారాలు సంపాదించి.. అల్కలాను మళ్లీ న్యాయస్థానం ముందు హాజరుపరచడానికి సుమారు ఆరేళ్ల సమయం పట్టింది!

    *రెండోసారీ సీన్ రిపీట్..!
    1986లో మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. మరణించిన బాలిక రాబిన్ సమ్సోయ్ స్నేహితులు అల్కాలాను గుర్తించి, అతడే తమను ఫొటోలు తీశాడని చెప్పారు. కానీ.. ఈ ఆధారం సరిపోదని కోర్టు చెప్పింది. ఇంకా బలమైన ఆధారాలు ఉండాలని పేర్కొంది. మరోవైపు అల్కలా కూడా తన న్యాయవాది ద్వారా తాను నిర్దోషినని తెలుపుకొనేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. పైకోర్టులను ఆశ్రయిస్తూ నేరం నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించాడు అచ్చం తెలుగు సినిమాలో విలన్ మాదిరిగా.

    *నేరం నిరూపించిన డీఎన్ఏ..
    దశాబ్దాల పాటు కొనసాగిన ఈ కేసుకు డీఎన్ఏ పరీక్షలు ముగింపు పలికాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిందితుడు అల్కాలా శాంపిళ్లు.. గతంలో హత్యకు గురైన మరో నలుగురు యువతుల శాంపిళ్లతో మ్యాచ్ అయ్యయి. దీంతో.. అల్కాలాపై మొత్తం ఐదు హత్యాచార కేసులు నమోదయ్యాయి.

    Also Read: డ్రై రన్ బేషుగ్గా ఉందని కితాబిచ్చిన గవర్నర్ తమిళ సై..!

    *31 సంవత్సరాల తర్వాత..
    బాలిక రాబిన్ సమ్సోయో హత్య జరిగిన సుమారు 31 ఏళ్ల తర్వాత నేరస్థుడు అల్కలాకు మరణ దండన అమలైంది. ఎనిమిదేళ్ల వయసులో అల్కాలా అత్యాచార దాడి నుంచి బయటపడ్డ ‘తాలి షాపిరో’ కళ్ల ముందే.. అతడికి ఉరిశిక్ష అమలు చేయడం గమనార్హం. ఈ విషయాన్న ప్రస్తావిస్తూ.. అల్కాలాతో టీవీ ‘డేటింగ్‌షో’లో పాల్గొన్న పార్టనర్ చెర్లే బ్రాడ్షా 2012లో అతడి గురించి ఇలా చెప్పింది. ‘‘అతడు నన్ను చాలాసార్లు డేటింగ్‌కు రావాలని, బయట కలుద్దామని చెప్పేవాడు. కానీ.. అతడు నాకు నచ్చకపోవడం వల్ల వెళ్లలేదు. అందుకే ప్రాణాలతో ఉన్నాను’’ అని తెలిపింది.

    *ఆచూకీలేని 109 మంది..
    అయితే.. అల్కాలాకు శిక్షపడింది ఐదుగురి కేసులో మాత్రమే. కానీ.. అల్కాలా ఇంట్లో జరిపిన సోదాల్లో సుమారు వెయ్యికి పైగా అమ్మాయిల ఫొటోలు లభించాయి. వాటిలో అమ్మాయిలంతా దాదాపు నగ్నంగానే ఉన్నారు. వారిలోనూ ఎక్కువమంది టీనేజర్లే ఉన్నారు. మొదట్లో పోలీసులు ఆ ఫొటోలు బయట పెట్టేందుకు ఇబ్బందిపడ్డారు. కానీ.. ఇటీవలే ఎఫ్‌బీఐ సైట్లో మొత్తం 109 మంది యువతుల ఫొటోలను పెట్టి.. వారి సంబంధీకులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. కానీ.. ఎవ్వరూ రాలేదు.

    *చనిపోయిన తర్వాత కూడా..
    అల్కాలాకు ఉరిశిక్ష వేసిన తర్వాత కూడా అతనిపై నేరాలు నిరూపణ కావడం గమనార్హం. క్రిస్టినే రుత్ థ్రాంటన్ అనే మహిళ హత్యలో కూడా అల్కాలా దోషని నిర్ధరించారు పోలీసులు. అయితే.. 2016లో ఈ విషయాన్ని తేల్చారు. అప్పటికే అల్కాలాను ఉరితీశారు. ఈ విధంగా.. చనిపోయిన తర్వాత కూడా అతనిపై ఇంకా కేసులు నమోదవుతుండటం గమనార్హం. కనిపించకుండా పోయిన 109 మంది కూడా అల్కాలా బాధితులే అన్నది గట్టి అనుమానం. కాబట్టి.. వీరిలో కూడా ఎవరికి సంబంధించిన ఆధారాలైనా భవిష్యత్ లో బయటపడి, అల్కాలానే నేరస్థుడని తేలి, కేసులు నమోదైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదీ.. సైకో సీరియల్ కిల్లర్ ‘రాడ్నీ జేమ్స్ అల్కాలా’ రియల్ క్రైమ్ స్టోరీ. ఈ నిజమైన కథ ఎలా ఉంది? ‘అంతకు మించి’ అనిపిస్తోంది కదూ? ఈ కథతోపాటు అందులోని నీతిని కూడా మరోసారి గుర్తుంచుకోండి..

    ‘‘తెల్లకోటు వేసుకున్న ప్రతివాడూ డాక్టర్ కాదు..
    నల్లకోటు తొడుక్కున్న ప్రతివాడూ లాయర్ కాదు..
    అలాగే.. కెమేరా పట్టుకున్న ప్రతివాడు ఫొటోగ్రాఫర్ కాదు..’’ 

    -నక్క రాధాకృష్ణ

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు