Age Of Consent: స్మార్ట్ ఫోన్ వినియోగం, సినిమాలు, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల లైంగిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర లా కమిషన్ ఫోక్సో యాక్ట్ తీసుకొచ్చింది. మహిళలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఫోక్సో ద్వారా సత్వరంగా తీర్పు చెబుతోంది. ఈ యాక్ట్ ప్రకారం లైంగిక కార్యకలాపాల్లో సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 సంవత్సరాల కు తగ్గించాలనే వస్తున్న వాదనలను లా కమిషన్ వ్యతిరేకించింది. అయితే కొన్ని ఫోక్సో కేసుల విచారణలో ఏర్పడుతున్న సాంగ్ క్లిష్టత దృష్ట్యా వయసును తగ్గించాలని పలు కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇలా చేస్తే పిల్లల హక్కుల కోసం చేసే పోరాటాలపై అది ప్రభావం చూపిస్తుందని లా కమిషన్ అభిప్రాయపడుతోంది.
ముఖ్యంగా ఫోక్సో కేసుల విచారణ సమయంలో ఎంత వయసు అమ్మాయికి శృంగారానికి అంగీకారం తెలిపే అర్హత ఉంటుందన్న ప్రశ్న తరుచూ తలెత్తడమే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఈ చట్టంలోని సెక్షన్ 6, సబ్ సెక్షన్ 1 ప్రకారం 18 సంవత్సరాల లోపు వయసు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. అయితే, ఇద్దరూ ప్రేమలో ఉండి, కొంత కాలంగా శారీరక సంబంధంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనపై బాలిక తరపు వారు ఫిర్యాదు చేస్తే మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఫోక్సో చట్టం కింద ఇంటిదగ్గరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష కనీస శిక్షగా విధించడం న్యాయమూర్తులకు తప్పనిసరి అవుతుంది. కేసును విచారించే సమయంలో న్యాయమూర్తి విచక్షణకు ఏమాత్రం అవకాశం లేకుండా పోతోంది. దీంతో శారీరక సంబంధానికి అంగీకారం తెలిపే వయసును 18 నుంచి 16కు తగ్గించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
ఫోక్సో చట్టానికి సంబంధించి 22వ న్యాయ కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఉంగరానికి అంగీకారం తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదన సరైంది కాదని ఆ నివేదికలో అభిప్రాయపడింది. ఫోక్సో చట్టం కింద వయసును తగ్గిస్తే బాల్య వివాహాలు, పిల్లల లైంగిక వ్యాపారాన్ని నిరోధించడం కష్టమవుతుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏ సమయంలో 16 సంవత్సరాల దాటిన బాలికల విషయంలో శృంగారానికి ఆమె పరోక్ష అంగీకారం ఉందని కోర్టు భావిస్తే శిక్ష విధించే విషయంలో న్యాయస్థానానికి విచక్షణ అధికారం ఇవ్వాలని న్యాయ కమిషన్ సూచించింది. అంటే, వారిద్దరి మధ్య గతంలో ఉన్న పరిచయాన్ని లెక్కలకు తీసుకొని శిక్షణ ఖరారు చేస్తారు. నిందితుడు చేసింది నేరమే అయినప్పటికీ శిక్ష తీవ్రత విషయంలో కోర్టులకు దీనివల్ల వెసలు బాటు లభిస్తుంది. ప్రస్తుత చట్టం ప్రకారం బాలిక అంగీకారంతోనే శృంగారం జరిపినప్పటికీ నిందితుడికి రేప్ తీవ్రతను బట్టి 20 ఏళ్ల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించే అవకాశం ఉంది. కాగా, సంవత్సరాల జైలు శిక్ష పడడం నేరాల విషయంలో ఆన్ లైన్ లో ఎఫ్ ఐ ఆర్ లను నమోదు చేసే పద్ధతిని దశలవారీగా అమలు చేయాలని న్యాయ కమిషన్ సూచించింది. ఎఫ్ ఐ ఆర్ ల నమోదుకు వీలు కల్పించేందుకు కేంద్రీకృత జాతీయ పోర్టల్ నెలకొల్పాలని ఆదేశించింది.