Homeక్రైమ్‌Karnataka court sensational verdict: కర్నాటక కోర్టు సంచలన తీర్పు.. రేరెస్ట్‌ ఆఫ్‌ రేర్‌ కేసులో...

Karnataka court sensational verdict: కర్నాటక కోర్టు సంచలన తీర్పు.. రేరెస్ట్‌ ఆఫ్‌ రేర్‌ కేసులో ముగ్గురికి మరణ శిక్ష

Karnataka court sensational verdict: భారత దేశంలో మరణ శిక్ష విధించడం చాలా అరుదు. గడిచిన 25 ఏళ్లలో ఆరేడుగురికి మాత్రమే కోర్టులు మరణ శిక్ష విధించాయి. తాజాగా కర్నాటక కోర్టు ఓ రేరెస్ట్‌ ఆఫ్‌ రేర్‌ కేసులో 20 నుంచి 28 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులకు మరణ శిక్ష విధించింది. ఇది సంచలనంగా మారింది. మరణశిక్ష పడినవారు కర్నాటకకు చెందిన మల్లేశ్‌ (20), సాయిద్‌ (25), శరణప్ప (28) ఉన్నారు. దాడి, హత్య, అత్యాచారం కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఘటన నేపథ్యం
ప్రపంచవ్యాప్త పర్యాటకుల ఆకర్షణ హంపి వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌. ఏటా వేల మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ హోటళ్లతోపాటు హోం స్టేలు ఉంటాయి. 11 నెలల క్రితం ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన ఓ యువతితోపాటు ఓ అమెరికా జాతీయుడు, ఇద్దరు పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు ఇందులో దిగారు. యజమాని మహిళ. ఆమె వయసు కూడా 30 ఏళ్లలోపే. ఆరోజు రాత్రి వీరంతా కలిసి స్టార్‌ గేజింగ్‌కు వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో మత్తులో ఉన్న నిందితులు బైక్‌పై ఆక్రమించారు. పెట్రోల్‌ అయిపోయిందని రూ.100 అడిగిన నిందితులు, తర్వాత రూ.1000 కావాలని అడిగారు. దీంతో అక్కడ ఉన్న ముగ్గురు యువకులు మర్యాదగా లేడీస్‌ ఉన్నారని వెళ్లిపోవాలని సూచించారు. కానీ మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు వారిని కొట్టి నీటిలో పడేశారు. ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఇరోడు మహిళపై కూడా దాడి చేశారు. చుట్టుపక్కలవారు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అమెరికా జాతీయుడు కాపాడబడ్డాడు, మరో యువకుడు మరణించాడు.

ప్రత్యేక కోర్టులో విచారణ..
11 నెలల విచారణలో నిందితులు నిర్దోషులని చెప్పడానికి ఆధారాలు లేకపోవడం, దారుణత మేరకు ’రేరెస్ట్‌ ఆఫ్‌ రేర్‌’ కేసుగా పరిగణించి మరణశిక్ష విధించారు. న్యాయవాది క్షమాగుణం కోరినా కోర్టు తీవ్రంగా స్పందించలేదు. హంపి వంటి ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో హోమ్‌స్టేల వద్ద రాత్రి భద్రతా చర్యలు పెంచాలి. మరణశిక్ష అరుదైనప్పటికీ (26 ఏళ్లలో 10 మందికి మాత్రమే), దారుణ నేరాలకు గట్టి శిక్షలు అవసరమని తీర్పు సందేశం. కర్నాటక ప్రజలు స్వాగతిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular