Bigg Boss 7 Telugu Wild Card Entries: బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. సీజన్ ని సరికొత్తగా ఉల్టా పుల్టా గా ప్రారంభించారు . ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది . ఇప్పుడు మొదలైన సీజన్ 7 కి కూడా రేటింగ్స్ భారీగా నమోదు అవుతున్నాయి . కంటెస్టెంట్స్ విషయానికొస్తే కేవలం పద్నాలుగు మంది మాత్రమే హౌస్ లోకి అడుగుపెట్టారు . దాదాపు ఇరవై మందిని ఇంట్లోకి పంపించే బిగ్ బాస్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు . ఇప్పటికే మూడు వారాలు ,ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు .
ఇక హౌస్లో మిగిలింది పదకొండు మంది మాత్రమే . వారిలో శివాజీ,సందీప్ ,శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ లు పవర్ అస్త్ర గెలిచి ఇంటి సభ్యులుగా మారారు . మిగిలిన వారు పవర్ అస్త్ర కోసం యుద్ధం చేస్తున్నారు .ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి . ఈ వారం కూడా ఒక కంటెస్టెంట్ ఇంటి బాట పట్టనున్నారు . ఇక మిగిలేది పది మంది మాత్రమే .
ఇప్పుడు ఈ రియాలిటీ షో మీద జోరుగా ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఏంటంటే బారిగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉండబోతున్నాయని, మినీ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఇందులో నిజం లేకుండా పోలేదు ,బిగ్ బాస్ నిర్వాహకులు అక్టోబర్ 9 న మినీ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారట.
ఈ ఈవెంట్ లో మరో ఆరుగురు లేదా కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లో కి పంపనున్నారు తెలుస్తుంది. అంబటి అర్జున్, పూజా మూర్తి, ఫర్జానా, సురేఖావాణి కూతురు సుప్రీత, జబర్దస్త్ నరేష్, మొగలి రేకులు ఫేమ్ అంజలీ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు . వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది. .