Supreme Court: నేటి కాలంలో భారతీయ వివాహ వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. పాశ్చాత్య దేశాల మాదిరిగా ప్రజలు వివాహ వ్యవస్థకు అంతగా కట్టుబడి ఉండడం లేదు. యువతరం వివాహ వ్యవస్థను బలంగా నమ్మడం లేదు.. పెళ్లి చేసుకున్న తర్వాత.. కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత.. విభేదాలు మొదలయితే ఎవరూ తగ్గడం లేదు. దీంతో మరో మాటకు తావు లేకుండా విడాకుల వరకు వెళ్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వారి తీరు మార్చుకోవడం లేదు. పైగా విడాకులకు సంబంధించి కోర్టుకు సమర్పించే ఆధారాలలో భార్యాభర్తలు సీక్రెట్ ఏజెంట్ లాగా పని చేస్తున్నారు. ఒకరి మీద మరొకరు నిఘా పెట్టుకొని స్పై ఆపరేషన్లు చేపడుతున్నారు. దీంతో కోర్టులు కూడా విడాకులు ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. విడాకుల విషయంలో మనుషుల సాక్ష్యాలు మాత్రమే కాకుండా.. ఇతర ఆధారాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు
భార్యాభర్తల విడాకుల విషయంలో భాగస్వామికి సంబంధించిన ఫోన్ సీక్రెట్ రికార్డింగ్ ను కూడా సాక్ష్యంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించడం కలకలం రేపుతోంది.. భార్యాభర్తల మధ్య వివాహ బంధం సరిగ్గా లేదనే విషయాన్ని అవి స్పష్టం చేస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడటం సంచలనం కలిగిస్తోంది. అయితే ఈ విషయంలో గతంలో పంజాబ్, హర్యానా సర్వోన్నత న్యాయస్థానాలు ఫోన్ రికార్డ్స్.. ఇతర వ్యవహారాలను విడాకులు మంజూరు చేసే విషయంలో సాక్ష్యాలుగా పరిగణించలేమని తీర్పు ఇచ్చాయి. వాటిని ప్రస్తుతం దేశ సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టడం విశేషం. పంజాబ్ లోని బఠిండా ప్రాంతానికి సంబంధించిన ఓ వ్యక్తి విడాకుల కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు చర్చకు దారి తీస్తోంది..
బఠిండాకు చెందిన ఓ వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం యువతితో వివాహం జరిగింది. వీరి సంసారం మొదట్లో సజావుగానే సాగింది. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో విడాకులు కావాలని అతడు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య ప్రవర్తన బాగోలేదని.. ఆమె తనపై హింసాయుతంగా వ్యవహరిస్తుందని ఆరోపించాడు. అయితే దీనికి సాక్ష్యాలుగా ఫోన్ రికార్డ్స్ ను అతడు న్యాయస్థానం ఎదుట ఉంచాడు. అయితే న్యాయస్థానం ఫోన్ రికార్డ్స్ ను సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకుంది.. ఆ తర్వాత కేసు విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఫ్యామిలీ కోర్టు తీరును తప్పు పడుతూ పంజాబ్, హర్యానా హై కోర్టును ఆశ్రయించింది.” భార్యాభర్తల మధ్య బంధం గొప్పగా ఉండాలి. అది విచ్ఛిన్నతకు లోను కాకూడదు. అలా జరిగితే ఆ బంధాన్ని బలోపేతం చేయడం సాధ్యం కాదు. బలోపేతం చేయాలని భార్యాభర్తలు మాత్రమే అనుకోవాలి. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలైనా సరిపోతాయి. సీక్రెట్ ఫోన్ రికార్డ్స్ ను ఇలాంటి వ్యవహారాలలో తప్పుగా భావించలేం. నిఘా పెడుతున్నారని కూడా చెప్పలేం. ఇలాంటి వ్యవహారాన్ని కొంతమంది తప్పుగా అనుకోవచ్చు. కానీ ఆ వాదన సమర్థనీయంగా అనిపించదు.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నారంటే అది వాంఛనీయం కాదు. ఆ బంధం కూడా బలంగా ఉందని అనిపించదు. అలాంటప్పుడు ఇలాంటి రికార్డులను కచ్చితంగా సాక్ష్యాలుగా పరిగణించవచ్చని” సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ట్రైన్ కోర్టు కేసు విచారణ సాగించవచ్చని సూచించింది.
ఈ కేసులో భర్త తన అంగీకారం లేకుండా సంభాషణలు రికార్డ్ చేశారని భార్య కోర్టులో పేర్కొంది. వాటిని సాక్ష్యాలుగా ఎలా పరిగణిస్తారని ఆమె ప్రశ్నించింది. ఇవి ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తాయని భావించింది. అయితే ఆమె అభ్యర్థనను హర్యానా, పంజాబ్ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదంలోకి తీసుకుంది. అంతేకాదు ఫ్యామిలీ కోర్టు వెలువరించిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఈ నేపద్యంలోని ఆమె భర్త ఏకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసును జస్టిస్ బివి నాగరత్న ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది.