Yellamma Movie: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నితిన్ (Nithin) లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయనకు ఒక్క సక్సెస్ కూడా రావడం లేదు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. భీష్మ (Bhishmaa) సినిమా తర్వాత ఆయన చేసిన ఆరు సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారడంతో ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం ఆయన చాలా కేర్ ఫుల్ గా ఉంటేనే ఆయనకు సక్సెస్ లు దక్కుతాయి. లేకపోతే మాత్రం ఆయన భారీ డౌన్ ఫాల్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవ్వచ్చు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్గా దిల్ రాజు బ్యానర్లో చేసిన తమ్ముడు (Tammudu) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక దాంతో దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లోనే ఎల్లమ్మ (Yellamma) సినిమాకి కమిట్ అయిన నితిన్ ఈ సినిమాకి సంబంధించిన విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దిల్ రాజు సైతం ఇప్పటికే దర్శకుడు వేణుతో చెప్పి కథ లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పారట. మరి దానికి అనుగుణంగానే దర్శకుడు సైతం ప్రొడ్యూసర్ నిర్ణయానికి వాల్యూ ఇస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read:: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!
మరి ఏది ఏమైనా కూడా నితిన్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన మరోసారి సక్సెస్ బాట పడతాడు. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది డౌన్ ఫాల్ అవ్వడమే కాకుండా ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక బలగం(Balagam) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణు ఈ సినిమాని సైతం సక్సెస్ఫుల్గా నిలిపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఒక కొత్త స్ట్రాటజీని మైంటైన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
నితిన్ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటాను ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నితిన్ సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. నితిన్ కెరియర్ ఎటువైపు వెళుతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…