Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan OTT Deal Cancelled: 'జన నాయగన్ ' ఓటీటీ డీల్ రద్దు.. నిర్మాతకు...

Jana Nayagan OTT Deal Cancelled: ‘జన నాయగన్ ‘ ఓటీటీ డీల్ రద్దు.. నిర్మాతకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?

Jana Nayagan OTT Deal Cancelled: చరిత్ర లో ఏ సినిమాకు ఎదురు అవ్వని కష్టాలు , తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటంచిన ‘జన నాయగన్'(Jana Nayagan) చిత్రానికి ఎదురు అవుతున్నాయి. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఒక సినిమాకు ఆపడం అనేది మనకు ఊహ తెలిసి ఏ సినిమాకు కూడా జరగలేదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ‘వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రానికి జరిగింది అట. మళ్లీ ఆయన ముఖ్య మంత్రి అయ్యాక విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ‘జన నాయగన్ ‘ చిత్రానికి సెన్సార్ చిక్కుముడులు దాదాపుగా వీడినట్టే. ఎందుకంటే మేకర్స్ బోర్డు సభ్యులు సూచించిన మార్పులు చేర్పు చేయడానికి అంగీకరించారు, చేసేశారు కూడా. కానీ ఇప్పుడు ఈ సినిమాకు బిజినెస్ మాత్రం అవ్వడం లేదు. ఇంతకు ముందు కొనుగోలు చేసిన బయ్యర్స్ ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే

ముందు అనుకున్న రేట్ కంటే 50 శాతం తగ్గిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అందుకు నిర్మాత ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతకు ఎదురైనా మరో అతి పెద్ద షాక్, ఓటీటీ రైట్స్ రద్దు అవ్వడం. మొదట్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రమే సంస్థ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు కొనుడగులు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ ఈ డీల్ ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. కారణం చెప్పిన డేట్ కి సినిమా రాలేదు అని. నిర్మాతలు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఒప్పుకోలేదట అమెజాన్ ప్రైమ్ సంస్థ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కి అమ్మే అవకాశాలు ఉన్నాయి. కానీ ముందు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు ఉండే అవకాశాలు లేదు. ఇంతకు ముందు 120 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే ఇప్పుడు 80 కోట్లకు అమ్ముడుపోవచ్చు, అంతకంటే తక్కువ కి కూడా అమ్ముడుపోవచ్చు.

అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనమంతా ‘హరి హర వీరమల్లు ‘ మూవీ విషయం లో కళ్లారా చూసాం. కానీ ఆ సమయం లో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగం లో దిగడం వల్ల , ఆ చిత్రం రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ విజయ్ మాత్రం ‘జన నాయగన్ ‘ మూవీ విషయం లో అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన ద్రుష్టి మొత్తం రాబోయే ఎన్నికలలో ఎలా పోటీ చెయ్యాలి, ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టాలి, ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి అనే వాటిపైనే ఉంది. పాపం నిర్మాత మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు. చేతినిండా సినిమాలు ఉన్నాయి, కానీ విడుదలకు నోచుకోలేని వింత పరిస్థితి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular