HomeజాతీయంSonia Gandhi Autobiography: రాజీవ్ గాంధీతో ప్రేమ, పెళ్లి... సినిమాకు మించి ట్విస్టులు.. సోనియా ఆత్మకథలో...

Sonia Gandhi Autobiography: రాజీవ్ గాంధీతో ప్రేమ, పెళ్లి… సినిమాకు మించి ట్విస్టులు.. సోనియా ఆత్మకథలో ఏముందంటే..

Sonia Gandhi Autobiography: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు.. రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ తన సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. జీవిత ప్రయాణంలో అనుభవాలను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఆత్మ కథ కూడా రాశారు. దానికి బిలాంగింగ్ జర్నీ ఆఫ్ లవ్ పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని వచ్చేనెల 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. గ్రీక్ రెస్టారెంట్లో.. కేం బ్రిడ్జిలోని […]

Sonia Gandhi Autobiography: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు.. రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ తన సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. జీవిత ప్రయాణంలో అనుభవాలను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఆత్మ కథ కూడా రాశారు. దానికి బిలాంగింగ్ జర్నీ ఆఫ్ లవ్ పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని వచ్చేనెల 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.

గ్రీక్ రెస్టారెంట్లో..

కేం బ్రిడ్జిలోని ఒక చిన్న గ్రీక్ రెస్టారెంట్లో సోనియాగాంధీ, రాజీవ్ గాంధీకి మధ్య ప్రేమ ప్రయాణం మొదలైంది. నాడు వారిద్దరు అక్కడ తరచుగా కలుసుకునేవారు. ఎన్నో తీపి జ్ఞాపకాలు.. ఎన్నో మధురమైన స్మృతులు.. నవ్వులు.. కలిసి ఆరగించిన పదార్థాలు.. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సోనియా గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. నవంబర్ 10న ఆ పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఒక ఉద్యోగ భరితమైన వీడియోను.. అప్పటి ఫోటోలను సోనియా బయట పెట్టారు.

ఈ పుస్తకాన్ని దాదాపు 554 పేజీలతో రూపొందించారు సోనియాగాంధీ.. మనదేశంలో హార్పర్ కాలిన్స్ ఇండియా.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రఖ్యాత ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ పబ్లిక్ సంస్థలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇటలీలో సోనియాగాంధీ బాల్యం మొదలైంది. 1965 లో కేంద్రంలో విద్యార్థిగా ఆమె చేరినప్పుడు రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. అనంతరం వారిద్దరు తమ బంధాన్ని పెళ్లితో మరింత పదిలం చేసుకున్నారు. రాజీవ్ గాంధీతో ఉన్న స్మృతులను.. జ్ఞాపకాలను ఎంతో భావోద్వేగమైన విధానంలో సోనియాగాంధీ ఈ పుస్తకంలో పొందుపరిచారు.. ముఖ్యంగా భారతీయ సంస్కృతికి ఎటువంటి సంబంధం లేకుండా.. ఒక విదేశీ యువతీ దేశంలో అడుగుపెట్టడం.. నెహ్రూ.. గాంధీ కుటుంబాలలో కోడలిగా.. ముఖ్యమైన వ్యక్తిగా ఇమిడిపోవడం వంటి విషయాలను ఆమె అక్షరీకరణ చేశారు.

కేవలం తమ ప్రేమకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే ఇందులో సోనియాగాంధీ ప్రస్తావించలేదు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ కుటుంబం పడిన ఇబ్బందులు.. గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు.. దేశ రాజకీయాలలో ఈ రెండు కుటుంబాలు పోషించిన పాత్ర వంటి వాటిపై ఈ పుస్తకంలో సోనియాగాంధీ వివరించారు. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురి కావడం.. 1991లో రాజీవ్ గాంధీ దుర్మరణం చెందడం వంటి దారుణాలు జరిగినప్పుడు తాను ఎదుర్కొన్న విషాదం.. అనుభవించిన మానసిక వేదనను సోనియాగాంధీ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. తన కళ్ళ ముందు రక్త సంబంధాలు విచ్చిన్నం కావడం.. పిల్లలు రాహుల్.. ప్రియాంకను చూసుకుంటూ.. ఒంటరిగా ఆమె సాగించిన రాజకీయ ప్రయాణాన్ని ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పని చేశారు. 1990 చివరి కాలంలో రాజకీయాల్లోకి సోనియా గాంధీ బలవంతంగా వచ్చారు. ముఖ్యంగా 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు.. ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. దానిని తిరస్కరించిన విధానం.. మన్మోహన్ సింగ్ ఎంపిక.. రెండు పర్యాయాలు కేంద్రంలోకి అధికారంలోకి రావడం.. కీలకమైన సమాచార హక్కు చట్టం.. ఉపాధి వంటి పథకాలను అమలు చేయడం మట్టి విషయాలను సోనియాగాంధీ ఇందులో ప్రస్తావించారు.

ఇక ఈ పుస్తకం ప్రచురణకు ముందు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తో వచ్చిన వివాదాలు.. మధ్యలోకి హార్పర్ కాలిన్స్ సంస్థ రావడం.. వంటి పరిణామాలు ఈ పుస్తకానికి మరింత ప్రచారం తీసుకొచ్చాయి.. ఇటలీలో పుట్టడం.. కేం బ్రిడ్జిలోని యూనివర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమలో పడడం.. ఇండియాలోకి అడుగుపెట్టడం.. భర్తను కోల్పోవడం.. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం.. ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేయడం.. ఇన్ని పరిణామాలను సోనియాగాంధీ ఈ పుస్తకంలో వివరించారు. అయితే బుక్ రిలీజ్ అయిన తర్వాత దేశ రాజకీయాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper