Homeక్రైమ్‌Online Shopping Scam: ఆన్ లైన్ లో యువతికి మోసం..సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ..ఆ...

Online Shopping Scam: ఆన్ లైన్ లో యువతికి మోసం..సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ..ఆ 30 కోట్ల కథేంటంటే..

Online Shopping Scam: తీగ లాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా. ఇది కూడా అలాంటిదే. పైగా అసలే కాప్స్.. వాళ్లకు ఏదైనా హింట్ కనిపిస్తే చాలు చెలరేగిపోతారు. ప్రతీ విషయాన్ని లోెతుగా తవ్వుతారు.. దుష్టుల భరతం పడతారు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆ ప్రాంతంలో ఫాతిమా అనే అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నది. ఆమె ఇటీవల ఇన్ స్టా లో రీల్స్ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒక షాపింగ్ కంపెనీ ప్రకటనలు […]

Online Shopping Scam: తీగ లాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా. ఇది కూడా అలాంటిదే. పైగా అసలే కాప్స్.. వాళ్లకు ఏదైనా హింట్ కనిపిస్తే చాలు చెలరేగిపోతారు. ప్రతీ విషయాన్ని లోెతుగా తవ్వుతారు.. దుష్టుల భరతం పడతారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆ ప్రాంతంలో ఫాతిమా అనే అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నది. ఆమె ఇటీవల ఇన్ స్టా లో రీల్స్ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒక షాపింగ్ కంపెనీ ప్రకటనలు చూసింది. అందులో ఒక కుర్తి కొనుగోలు చేసింది. షాప్ నిర్వాహకులు ఆమె వాట్సాప్ ఖాతాకు క్యూఆర్ కోడ్ పంపించారు. మొదట ఆమె 400 పే చేసింది. అనంతరం కొనుగోలు చేసిన వస్తువును చెంతకు చేర్చడానికి రుసుం ఇవ్వాలని మరోసారి విన్నవించారు. ఆమె కూడా వారు చెప్పినట్టు చేసింది. మరోసారి ఫోన్ చేశారు. ఈసారి ఏకంగా పాస్ కోడ్ ఇవ్వాలని అడిగారు. ఆ తర్వాత తన చరవాణికి వచ్చిన సంఖ్యను వారికి చెప్పింది.

ఇంకోసారి ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని అడిగారు. ఆ రుసుం తిరిగి చెల్లిస్తామని మాయ మాటలు చెప్పారు. విడతల వారీగా పదకొండు వందల యాభై, రెండు వేలు, రెండువేల ఆరొందల యాభై, ఆరువందల యాభై రూపాయాలను బదిలీ చేయించుకున్నారు. చివరికి ఆమె ఆర్డర్ పెట్టిన వస్తువు పార్సల్ కాలేదు. డబ్బు కూడా ఆమె ఎకౌంటుకు రీ ఫండ్ కాలేదు. తాను మోసపోయినట్టు ఆమె గ్రహించింది.

దీనిపై ఆ విద్యార్థిని సంబంధిత ఖాకీ అధికారులకు సమాచారం అందించింది. ఆ తర్వాత నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువతి వివిధ క్యూఆర్ కోడ్లకు చెల్లించిన డబ్బులు కెనరా బ్యాంకులో ఒక ఖాతాకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఆ ఖాతాతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని తమదైన శైలిలో విచారించారు..

అతడు చెప్పిన సమాచారం ఆధారంగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తుల మీద వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలోనే 27 కేసులున్నాయి. కాగితాల్లోనే కంపెనీలు నిర్మిస్తారు. అంతర్జాలంలో గట్టిగా ప్రచారం చేస్తారు. వివిధ వ్యక్తుల పేరు మీద బ్యాంకులలో అకౌంట్లు ఓపెన్ చేస్తారు. మాయ మాటలు చెప్పి డబ్బు వసూలు చేస్తారు. మొత్తంగా ఈ మోసగాళ్లు 25 బ్యాంకు ఖాతాలను కొనసాగిస్తున్నారు. వారు ఇలా మోసాలు చేసి 30 కోట్ల సొమ్మును మళ్లించారు. మోసగాళ్ల దగ్గర నుంచి ఫోన్లు.. ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper