HomeజాతీయంIndian Employees :...

Indian Employees : అప్డేట్ అవుతామంటున్న భార‌తీయులు.. 90 శాతం మందిది ఇదేమాట‌!

Indian Employees : అప్డేట్ కానిది ఏదైనా అంత‌టితో ఆగిపోతుంది. సాఫ్ట్ వేర్ అయినా.. మ‌నిషి అయినా అంతే. ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్ అవుతూ, స‌రికొత్త నైపుణ్యాల‌ను అందిపుచ్చుకుని, ముందుకు సాగుతుంటేనే మ‌నుగ‌డ‌లో ఉంటారు. భార‌తీయ ఉద్యోగులు సైతం ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. 90 శాతం మంది ఉద్యోగులు ప్ర‌స్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వ‌దిలి, కొత్త రంగంలోకి మారాల‌ని కోరుకుంటున్నార‌ట‌. స‌రికొత్త నైపుణ్యాల‌ను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఈ మేర‌కు ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది.

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఈ స‌ర్వే చేప‌ట్టింది. ఆగ‌స్టు 17 నుంచి 23 తేదీల మ‌ధ్య నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో.. మొత్తం వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారు. భార‌తీయులు ఉద్యోగం మారాల‌ని కోరుకోవ‌డానికి, కొత్త రంగాల‌ను ఎంచుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డానికి కార‌ణం ఏంట‌న‌ప్పుడు.. దాదాపుగా అంద‌రూ చెప్పిన స‌మాధానం క‌రోనా. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల వేత‌నాల్లో కోత ప‌డింద‌ని ఉద్యోగులు భావిస్తున్నారు. అందువ‌ల్ల సామ‌ర్థ్యం, నైపుణ్య‌త పెంచుకోవ‌డం ద్వారా వేత‌నాన్ని పెంచుకోవాల‌ని చూస్తున్నారు. ఇంకా.. ఈ అధ్య‌య‌నంలో వెలుగు చూసిన అంశాలు ఏమంటే..

మెజారిటీ ఉద్యోగులు.. త‌మ‌కు ఇప్పుడున్న స్కిల్ స‌రిపోద‌ని భావిస్తున్నార‌ట‌. రాబోయే ఐదేళ్ల‌లో త‌మ నైపుణ్యానికి కాలం చెల్లుతుంద‌ని ఏకంగా 75 శాతం మంది అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని స‌ర్వే తెలిపింది. వీరిలో 90 శాతం మంది కొత్త స్కిల్ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనివ‌ల్ల ఉద్యోగ భ‌ద్ర‌త పెరుగుతుంద‌ని భావిస్తున్నారు.

47 శాతం మంది సుర‌క్షిత‌మైన ప‌ని వాతావ‌ర‌ణం ఉండాల‌ని కోరుకుంటుండ‌గా.. 49 శాతం మంది మ‌రింత ఉన్న‌త స్థాయికి వెళ్లేందుకు అవ‌కాశాలు ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని స‌ర్వే రిపోర్టు తెలిపింది. ఉద్యోగంలో ఉన్న‌త స్థాయికి వెళ్లాలంటే.. సాంకేతిక‌, డిజిట‌ల్‌నైపుణ్యాలు ఉండాల‌ని 45 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. 38 శాతం మంది మార్కెటింగ్ నైపుణ్యాలు అవ‌స‌ర‌మ‌ని చెప్పారు.

మొత్తంగా.. క‌రోనా తెచ్చిన ప‌రిస్థితుల కార‌ణంగా.. మ‌నుషుల జీవ‌న విధానం మార‌డంతోపాటు ఆలోచ‌న‌ల్లోనే భారీ మార్పులు వ‌చ్చేశాయి. భ‌విష్య‌త్ భ‌ద్ర‌త గురించి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఆలోచించ‌డం, అడుగులు వేయ‌డం చేస్తున్నారు. ఈ కార‌ణంగానే.. అంద‌రూ అప్డేట్ అవుతామంటున్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Pakistan: పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన ఆఫ్గాన్‌… అంగీకరించిన రక్షణ మంత్రి!

Pakistan: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్తావారాలతోపాటు 11 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసింది. డీజీఎంవో స్థాయి చర్చల తర్వాత సీజ్‌ఫైర్‌ కుదిరింది. అయితే ఆపరేషన్‌ సిందూర్‌లో తామే విజయం సాధించినట్లు పాకిస్తాన్‌ సంబురాలు చేసుకుంది. ర్యాలీలు నిర్వహించింది. పాక్‌ సైనికాధికారి ఆసిమ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షన్‌గా...

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: భారతదేశంలో ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం లెక్కలు వెల్లడించింది. అలాగే, గత పదేళ్లలో మన దేశంలో ప్రజల సగటు ఆదాయం ఎంత పెరిగిందో కూడా తెలిపింది. అయితే, ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు బాగా ముందున్నాయి.. మరికొన్ని వెనుకబడ్డాయి....

Microsoft carbon credit purchase: ఇక లెట్రిన్ గుంటలకు కాపాలా పెట్టాలేమో..మలమూత్రాలు టన్నుకు రూ.30వేలిచ్చి కొంటున్న మైక్రోసాఫ్ట్

Microsoft carbon credit purchase: ఇక నుంచి మన ఇంట్లోని, పబ్లిక్ టాయిలెట్ల లెట్రూం గుంటల వద్ద కూడా సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుందేమో. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మనుషుల వ్యర్థాలను.. అంటే మలం, మూత్రాన్ని డబ్బు పెట్టి కొంటోంది. ఒక టన్ను వ్యర్థాలకు ఏకంగా రూ.30,000 (350 డాలర్లు) ఇస్తోందట. వోల్టెడ్ డీప్ అనే...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.