Dussehra 2021: హిందూ ప్రజల ప్రధాన పండగల్లో దసరా ఒకటి. దేశవ్యాప్తంగా దసరాను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. దసరా ఉత్సవాలు అనేవి తొమ్మిదిరోజుల ముందుగానే ప్రారంభం అవతాయి. వాటినే శరన్నవరాత్రులు అంటారు. అమ్మవారు నవరాత్రులు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. దశమిరోజున దసరా పండగ జరుపుకుంటారు. ఆ రోజుతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే నవరాత్రి అనే పదంలో నవశబ్ధం అనేది తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. పండగను తొమ్మిది రాత్రులు.. తొమ్మిది రోజులు ఘనంగా జరుపుతారు. ఆశ్వయూజ శుక్లపక్ష పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు తొమ్మిది రోజులు, తొమ్మిది రాత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా తొమ్మిది రోజులు, తొమ్మిది రాత్రులు నిర్వహించే పూజలు ఓ ప్రత్యేకత సైతం ఉంది. అమ్మవారి ఆరాధనలో భాగంగా దేవీ అర్చన, సహస్ర్త నామాలు, దుర్గా సప్తశతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయని పురాణం చెబుతోంది. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడేవారు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే.. శుభం జరుగుతుందని చరిత్ర చెబుతోంది.

ప్రాంతాలు.. ప్రత్యేకతలు..
అయితే దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలను ఆయా ప్రాంతాల సంప్రదాయం ప్రకారం జరుపుకుంటారు. అమ్మవారి పూజలు మాత్రం ఒకే విధంగా చేస్తుండగా.. ఉత్సవాల నిర్వహణలో వివిధ పద్ధతులు అవలంభిస్తుంటారు. ఏపీలో దసరా నవరాత్రుల సందర్భంగా కేవలం అమ్మవారిని కొలుస్తుంటారు. తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ.. నిష్టతో ఉంటారు. అయితే తెలంగాణలో వేడుకలు వేరేతీరుగా ఉంటాయి. తెలంగాణ ఆడపడుకులు బతుకమ్మ రూపంలో అమ్మవారిని కొలుస్తుంటారు. పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ఉత్సవాలు ఎంగిలిపూల పేరిట ప్రారంభిస్తారు. దసరాకు ముందు రోజున అష్టమి సందర్భంగా సద్దుల బతుకమ్మ పేరిట ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. తెలంగాణవ్యాప్తంగా వేడుకను ఘనంగా నిర్వహించుకోగా.. కొత్త వస్ర్తాలు.. కొత్త అల్లుళ్లతో వేడుక జోరుగా సాగుతుంది.
ఇక ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షం పాడ్యమి నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలనే దసరాగా పిలుస్తుంటాం. దసరాకు సంబంధించిన చరిత్రను పురాణాల్లో వివిధ రకాలుగా చెబుతుంటారు. అందులో ప్రధానంగా పూర్వకాలంలో మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధితో తపస్సు చేసేవాడు. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని వరం పొందుతుంటాడు. ఏ పురుషుడి చేతిలోనూ తనకు మరణం లేకుండా వరం ఇమ్మని కోరగా.. బ్రహ్మదేవుడు సరే అంటాడు. అప్పటి నుంచి ప్రజలను, దేవతలను తీవ్రంగా వేధించేవాడు. ఈక్రమంలో దేవతలంతా కలిసి ఓ స్ర్తీ శక్తి రూపాన్ని సృష్టించారు. వారు సృష్టించిన ఆ శక్తి దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు ఉన్న దుర్గామాత.. ఇంద్రడు నుంచి వజ్రాయుధం.. విష్ణువు నుంచి సుదర్శన చక్రమం.. శివుడి నుంచి త్రిశూలాన్ని ఆయుధాలుగా.. సింహాన్ని వాహనంగా పొందింది. తొమ్మిదిరోజులు దుర్గాదేవీ ఒక్కో అవతారంలో యుద్ధం చేసి.. మహిషారుడిని అంతం చేసింది. కాబట్టి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులుగా.. 10వ రోజును విజయానికి చిహ్నంగా విజయదశమిని ఘనంగా జరుపుకుంటాం. రామాయణంలో రావణున్ని సైతం విజయదశమిరోజున రాముడు అంతం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మహా భారతంలోనూ తమ వనవాసాన్ని ముగించుకుని తమ ఆయుధాలు జమ్మిచెట్లుపై నుంచి తీసుకున్న రోజుగా పరిగణిస్తారు.
Also Read: Pawan Kalyan: పవన్ మైండ్ ను మార్చేశారా?
విజయదశమిరోజున ఉదయాన్నే లేచి స్నానాలు చేసి కొత్తబట్టలు వేసుకోడం ఆనవాయితీ. మామిడి ఆకు తోరణాలు, బంతి పూలతో ఇంటిని అలంకరించుకుంటారు. పిండివంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి పంచుకుంటారు. సాయంతరం అమ్మవారికి, జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. జమ్మి ఆకులు మార్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రాం లీల నిర్వహిస్తారు. రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తుంటారు. విజయదశమి సందర్భంగా కొత్త పనులు.. కొత్త విద్యలు నేర్చుకుంటే చాలా మంచిదని చరిత్ర చెబుతోంది. ఆ రోజు జమ్మిచెట్టును పూజించడం లక్ష్మీప్రదము. జమ్మిని కొలవడం వల్ల ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. సో విజయ దశమి సందర్భంగా మనదరం కూడా కొత్తబట్టలు ధరించి.. వేడుకలా ఎంజాయ్ చేద్దాం.. అందరికీ.. విజయదశమి శుభాకాంక్షలు..
Also Read: TPCC Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చిందా?