ఆ బాలుడికి అరుదైన వ్యాధి.. దీనితో బాధపడుతున్న అతడు ఉపశమనం కోసం తాత్కాలికంగా నిత్యం చెరువులోనే జీవిస్తున్నాడు. ఇలా ఐదేళ్లపాటు నరకయాతన అనుభవిస్తున్న అతనికి ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. అతనికి ప్రాథమికంగా పరీక్షలు చేసి త్వరలోనే మెరుగైన చికిత్సను అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. అసలు ఎవరు ఈ బాలుడు? అతనికి వచ్చిన వ్యాధి ఏంటి? దీనిపై ఎవరు స్పందించారు?
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ కు చెందిన పదహారేళ్ల ఇక్బాల్ కు అరుదైన ఆరోగ్య సమస్య ఏర్పడింది. ఈ వ్యాధి కారణంగా అతడికి శరీరం మంటలు ఉండేవి. అయితే ఈ వ్యాధి నయం చేసుకోవడానికి అతని కుటుంబం ఆర్థికంగా సిద్ధంగా లేదు. దీంతో తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు అతడు సమీపంలోని చెరువులో ఉండసాగాడు. ఎక్కువసేపు నీటిలోనే ఉంటూ అక్కడే రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ పరిస్థితిని చూసినా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది కాస్త వైర్ అయింది.
ఈ వైరల్ వీడియో పై రిలయన్స్ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్పందించాడు. ఇక్బాల్ కు అవసరమైన వైద్యం అందిస్తామని తెలిపాడు. ఇందులో భాగంగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో అతనికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత చికిత్స ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. తమ కుమారుడిని చూసి చలించినందుకు అనంత అంబానికి ఆ బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అయితే ఈ బాలుడికి వచ్చిన వ్యాధి ఏంటో చికిత్స తర్వాతే తెలుస్తుందని వైద్యులు అంటున్నారు. అతడు ఈ వ్యాధితో ఐదేళ్లపాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కువసేపు బయట కంటే నీటిలోనే ఉంటూ కనిపించాడు. అతడు అక్కడే ఆహార పదార్థాలతో పాటు వీటికి తీసుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది.
View this post on Instagram