Vantara : గతేడాది రిలయన్స్ ఫౌండేషన్ వనతార అనే ప్రాజెక్ట్ చేపట్టిన సంగతి తెలిసిందే.గాయపడిన అలాగే అంతరించిపోతున్న జంతువులను కాపాడడం వనతార ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్ట్ కింద మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక జంతువుల ప్రాణాలను కాపాడుతుంది.ఇందుకోసం గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లోని మూడువేల ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. గుజరాత్‌లో 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని అనంత్ అంబానీ అలోచనలకు అనుగుణంగా తయారు చేశారు. లాభాపేక్ష లేకుండా కేవలం జంతువుల సేవ కోసం దీనిని అంకితం చేశారు.
అంతరించిపోతున్న జంతువుల కోసం గ్రీన్స్ జూ లాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద రెస్క్యూ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దేశ,విదేశాల్లో జంతు ప్రదర్శనశాలలో బందీలుగా ఉన్న జంతువులు, ప్రమాదకరమైన వాతావరణంలో పెరుగుతున్న మృగజీవాలను రక్షించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగానే లక్ష 50వేల కంటే ఎక్కువ జంతువులను వనతారా రక్షిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఉంది. ఇది ఎక్స్-రే, సీటీ స్కాన్స్ నుండి ఎంఆర్ఐల వరకు ఏదైనా ఆపరేషన్ నిర్వహించగల విభాగాలు వనతార అందుబాటులో ఉన్నాయి. జంతువులకు సేవ చేసేందుకు 24 గంటలూ ఇక్కడ డాక్టర్లు, సేవకులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల జంతువులను సంరక్షించడానికి ఇది ప్రాంతం ఒక కేంద్రంగా ఉంది.
Also Read : 600 ఎకరాల వంతారా అడవి .. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెద్ద మనసు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీకి చెందిన ‘వనతార’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అక్కడి పరిసరాలను సందర్శించారు. వనతారలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో మోదీ సన్నిహితంగా మెలిగారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సఫారీ వాహనం ఎంతో స్పెషల్. సాధారణంగా అన్ని చోట్లా బొలేరో వాహనాలను సఫారీగా వాడితే ఇక్కడ మాత్రం రూ.రెండు కోట్ల విలువ చేసే డిఫెండర్ కారు, దానితో పాటు రూ.25 లక్షల పై చిలుకు విలువ కలిగిన Isuzu V-Cross కారును వాడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది లాంచ్ అయిన లాండ్ రోవర్ డిఫెండర్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎస్యూవీ. రూ.2కోట్ల ధరతో ఇండియాలో అమ్మకానికి ఉంది. ఈ అమ్మకానికి స్లీక్ గ్రిల్, మాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వైడ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. రూఫ్ రెయిల్స్, ఓఆర్ వీఎంలు, వీల్ ఆర్చీస్, 20అంగుళాల డైమెండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి.ఈ డిఫెండర్లో 3.0 లీటర్, 6 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ వంటివి ఉన్నాయి.
Also Read : ఆసియాలో అంబానీయే తోపు