Homeటాప్ స్టోరీస్Redmi K 100 Pro Max 5: ఐఫోన్ లాంటి ఫీచర్లు.. అందులో సగం ధరకే..

Redmi K 100 Pro Max 5: ఐఫోన్ లాంటి ఫీచర్లు.. అందులో సగం ధరకే..

Redmi K 100 Pro Max 5: కెమెరా బాగుంది. సినిమాలు కూడా తీయొచ్చు బ్యాటరీ అద్భుతంగా ఉంది. రోజుల తరబడి ఉపయోగించవచ్చు. చిప్.. నుంచి మొదలు పెడితే ఫ్రేమ్ వరకు అన్ని ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయి. చూడబోతే ఇది ఐఫోన్ లాగానే ఉంది. కాకపోతే ధర ఆ స్థాయిలో కాదు.. స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో మనదేశంలో రెడ్ మీ కంపెనీకి బలమైన మార్కెట్ ఉంది. ప్రీమియం మోడల్స్ ను బడ్జెట్ రేంజ్ లో అందించడం […]

Redmi K 100 Pro Max 5: కెమెరా బాగుంది. సినిమాలు కూడా తీయొచ్చు బ్యాటరీ అద్భుతంగా ఉంది. రోజుల తరబడి ఉపయోగించవచ్చు. చిప్.. నుంచి మొదలు పెడితే ఫ్రేమ్ వరకు అన్ని ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయి. చూడబోతే ఇది ఐఫోన్ లాగానే ఉంది. కాకపోతే ధర ఆ స్థాయిలో కాదు..

స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో మనదేశంలో రెడ్ మీ కంపెనీకి బలమైన మార్కెట్ ఉంది. ప్రీమియం మోడల్స్ ను బడ్జెట్ రేంజ్ లో అందించడం ఈ కంపెనీ ప్రత్యేకత. తాజాగా Redmi k100 Pro Max పేరుతో ఒక మోడల్ తీసుకొచ్చింది. దీనిని చైనాలో అధికారికంగా విడుదల చేసింది. చైనాలో దీని ప్రారంభ ధర 4,499 చైనా యోన్ లు. ఇది భారత కరెన్సీలో 63,650 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఒకసారి పరిశీలిస్తే..

డిస్ ప్లే

ఇందులో 6.9 ఇంచుల భారీ స్క్రీన్ ఉంది. అది AMOLED డిస్ ప్లే ను అందిస్తుంది.. దీని రీ ఫ్రెష్ రేట్ 185 హెచ్ జెడ్ తో ఉంటుంది. అందువల్లే స్మూత్ బ్రౌజింగ్.. గేమింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది.

పర్ఫామెన్స్ & ప్రాసెసర్

ఇందులో పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నడుస్తుంది.

ర్యామ్ & స్టోరేజ్

12GB+ 256 GB బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ 16 GB+ 1 TB స్టోరేజి ఆప్షన్ల వరకు ఇది అందుబాటులో ఉంది.

కెమెరా

ఇందులో మెయిన్ కెమెరా 200 మెగా పిక్సెల్ అల్ట్రా క్లియర్, అద్భుతమైన ఫోటోగ్రఫీ సదుపాయంతో వస్తుంది.
సెకండ్ కెమెరా 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా ఇందులో ఉంది.

బ్యాటరీ చార్జింగ్

బ్యాటరీ కెపాసిటీ 9,070 ఎం ఏ హెచ్ సామర్థ్యంతో ఉంటుంది. వైర్ చార్జింగ్ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది.. వైర్లెస్ చార్జింగ్ 50 W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 22.5 W రివర్స్ వైర్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. బ్యాటరీ మేనేజ్మెంట్ కోసం సర్జ్ G2 చిప్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సర్జ్ P3 ని అమర్చారు.

ప్రస్తుతం ఈ ఫోను చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో అనే దాని మీద ఇంకా అధికారికంగా క్లారిటీ లేదు. కాకపోతే ఇందులో ఐఫోన్ స్థాయిలో సదుపాయాలు ఉన్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper