Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్స్ జాబితాలో ముకేశ్ గౌడ పేరు ని చూసిన నెటిజెన్స్ ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఈయన ‘గుప్పెడంత మనసు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సీరియల్ లో హీరో గా నటించాడు , ఈయనకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది , కచ్చితంగా ఇతను బాగా ఆడితే టైటిల్ విన్నర్ గా నిలుస్తాడు అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉండేవి. కానీ ఆ అంచనాలను అందుకోవడం ముకేశ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుండి విఫలం అవుతూ వస్తున్నాడు. ఎందుకంటే హౌస్ లో ఈయన ఎలివేట్ అయ్యే రేంజ్ సందర్భాలు రాలేదు , కంటెంట్ మొత్తం త్రిగున్ , రోహిత్ చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి. అయితే నేడు మాత్రం ఆయనకు రోహిత్ మీద నిజంగా కోపం వచ్చిందో , లేదంటే రోహిత్ తో పెట్టుకుంటే తనకు కూడా మంచి కంటెంట్ వస్తుందని అనుకున్నాడో తెలియదు కానీ , బ్రేక్ టైం లో రోహిత్ తో గొడవ పెట్టుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రోహిత్ ఎంగిలి కప్పులు కడగను అన్న మాటపై నాగార్జున గట్టి కోటింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ముకేశ్ ని పైకి లేపి , ఆరోజు రోహిత్ ఏమన్నాడో చెప్పమని అడుగుతాడు నాగార్జున. అప్పుడు ముకేశ్ ‘ఎంగిలి ప్లేట్స్ కడగడానికి నేను బిగ్ బాస్ హౌస్ కి రాలేదు అని అన్నాడు సార్’ అంటాడు. అప్పుడు రోహిత్ కౌంటర్ ఇస్తూ ‘బహుశా ఆరోజు ఈయన అటెంటివ్ గా లేనట్టు అనిపిస్తోంది. నేను అలా అనలేదు , రూల్స్ ప్రకారం మీరు ఎంగిలి చేసిన కప్పులను మాత్రమే కడగను అని చెప్పాను’ అంటాడు. ఆ తర్వాత నాగార్జున వీడియో ప్లే చేయగా , రోహిత్ చెప్పిందే నిజం అవుతుంది. దీనికి ముకేశ్ నేను దొరికిపోయాను అనే కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ , బ్రేక్ టైం లో నేరుగా రోహిత్ మీదకు దూసుకెళ్లాడు.
ఆ తర్వాత మాట్లాడుతూ ‘కాస్త మాట్లాడే ముందు జాగ్రత్తగా అలోచించి మాట్లాడు. నువ్వు ఇందాక నాకు అటెంటివ్ అనే పదం వాడడం అసలు నచ్చలేదు’ అని అంటాడు. అందుకు రోహిత్ ‘అది నిజమే కదా , నువ్వు నిజంగానే అటెంటివ్ గా లేవని వీడియో చూస్తూనే అర్థం అవుతోంది. ఇందులో వాదించడానికి ఏముంది’ అని అంటాడు రోహిత్. అది నాగార్జున సార్ చెప్తారు , నువ్వు చెప్పడానికి వీలు లేదు అని అంటాడు ముకేశ్. నువ్వు నోటికి వచ్చినట్టు నాపై కామెంట్స్ పాస్ చేస్తే అలాగే అంటాను అని కౌంటర్ ఇస్తాడు రోహిత్. అలా ఇద్దరి మధ్య గొడవ చాలాసేపటి వరకు జరిగింది. ఈ గొడవ లో రోహిత్ దే పై చెయ్యి అయ్యింది. ఇందులో ముకేశ్ మిస్టేక్ ఉన్నప్పటికీ , ఇప్పటికైనా నిద్రలేచాడు , ఎదో ఒక కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. చూస్తుంటే వచ్చే వారం రోహిత్ , ముకేశ్ ల మధ్య గొడవలు గట్టిగానే జరిగేలా ఉన్నాయి.