కూతురు పెళ్లి అనేది ఏ తల్లిదండ్రులకైనా ఎమోషనల్ ఈవెంట్. కన్న బిడ్డకు పెళ్లైందన్న ఆనందంతో పాటు, తమను విడిచి వేరే ఇంటికి వెళ్లిపోతుందనే ఆవేదన కూడా ఉంటుంది. కాగా మెగా డాటర్ నిహారిక తల్లి పద్మజ కూతురు పెళ్లి పట్ల చాలా భావోద్వేగంగా స్పందించారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని అనుకుంటారు. అందుకే నిహారిక వివాహం ఉదయ్ పూర్ ప్యాలస్ లో అత్యంత వైభవంగా నిర్వహించాము. మరో మూడు రోజులలో పెళ్లి అనగా నేను తీవ్ర జ్వరానికి గురయ్యాను. దీనితో పెళ్లి పనులు మొత్తం వరుణ్, వాళ్ళ నాన్న నాగబాబు చూసుకున్నారని అన్నారు .
Also Read: మెగాస్టార్ కి కథ చెప్పనున్న వెంకీ !
ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ లో తన నిశ్చితార్థ చీరలో నిహారికను చూసిన నేను భావోద్వేగానికి గురయ్యాను. నాతో పాటు నాగబాబు నిహారికను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి చీరలో తనను చూసుకున్న నిహారిక సైతం చాలా సంతోషంగా కనిపించింది. నిహారిక పెళ్లి కూతురు అయ్యిందని, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని పద్మజ అన్నారు. నిహారిక తమకు ఇంకా చిన్న పిల్లలాగే కనిపిస్తుందన్న అర్థంలో ఆమె మాట్లాడడం జరిగింది.
Also Read: సుధీర్ కు సీమంతం.. ఇదేందయ్యా ఇదీ..?!
ఇక నిహారిక, చైతన్యల అభిరుచులు ఒకేలా ఉన్నాయి అన్నారు. చైతన్యతో వివాహాన్ని నిహారిక చాలా ఆనందంగా భావించిందని పద్మజ చెప్పడం విశేషం. పెళ్లికూతురుగా తయారైన కూతురుని చూసుకున్న సమయంలో వచ్చే ఆనంద క్షణాలు అత్యంత విలువైనవి అని పద్మజ తెలియజేశారు. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై ఈ వేడుకలో సందడి చేశారు. అనంతరం బంధువుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nagababu cried after niharika marriage says nagababu wife
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com