Pawan Kalyan and Kiran Abbavaram : కుర్ర హీరోలు ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాత సినిమా టైటిల్స్ ని తమ సినిమాలకు ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. తొలిప్రేమ సినిమా టైటిల్ ని వరుణ్ తేజ్(Varun Tej), తమ్ముడు సినిమా టైటిల్ ని నితిన్(Hero Nithin), ఖుషి సినిమా టైటిల్ ని విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అక్కడ అమ్మాయి ..ఇక్కడ అబ్బాయి సినిమా టైటిల్ ని యాంకర్ ప్రదీప్, జానీ మూవీ టైటిల్ ని శర్వానంద్(Sharwanand) వంటి వారు ఉపయోగించుకున్నారు. వీటిల్లో తొలిప్రేమ, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. మిగిలిన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాల టైటిల్స్ ని మాత్రమే కాదు, ఆయన సినిమాల్లోని పాటల్లో ఉండే పల్లవి తో కూడా టైటిల్స్ గా మార్చుకొని సినిమాలు చేసారు. ‘కెవ్వు కేక, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సినిమాలు విడుదలయ్యాయి.
Also Read : ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఫ్యాన్స్ కి పండగే..మొత్తానికి మోహన్ బాబు సాధించాడు!
ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లో పోషించిన పాత్రల పేర్లను కూడా వాడేస్తున్నారు. ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలోని ఒక పవర్ ఫుల్ పాత్ర పేరుని టైటిల్ గా పెట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ, సినిమా టైటిల్స్ ని వాడేసుకున్నారు, పాటలను వాడేసుకున్నారు, కనీసం క్యారక్టర్ పేర్లను కూడా వదలకుండా వాడేసుకుంటారా?, ఇదెక్కడి ఖర్మరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం ఏ సినిమా క్యారక్టర్ పేరుని వాడుకుంటున్నాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఖుషి చిత్రం లోని ‘సిద్దార్థ్ రాయ్’ టైటిల్ ని వాడుతున్నారా?, లేకపోతే ‘జల్సా’ చిత్రంలో సంజయ్ సాహు టైటిల్ ని వాడబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు అత్యధిక శాతం క్యారక్టర్ పేర్లే సినిమా టైటిల్స్ గా తెరకెక్కాయి. తమ్ముడు, ఖుషి, జల్సా, తీన్మార్, పంజా, అత్తారింటికి దారేది వంటివి మాత్రమే క్యారక్టర్ పేర్లు కాకుండా వేరే పేర్లను ఉపయోగించారు. కాబట్టి ఈ సినిమాల్లో ఉండే క్యారెక్టర్స్ పేర్లలో ఎదో ఒకటి అయ్యుండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఉగాది లోపు ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా ‘దిల్ రూబా'(Dilruba Movie) అనే సినిమా చేసాడు. ‘క’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మరో సరికొత్త కాన్సెప్ట్ తో కిరణ్ అబ్బవరం చేసిన సినిమా ఇది. మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది. మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు.
Also Read : కిరణ్ అబ్బవరం దెబ్బకు నష్టాల వలయంలో బయ్యర్లు.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?