Mukesh Nita Ambani: మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. అది లేకుంటే మనిషికి ** కు తేడా ఉండదు అని వెనుకట ఓ సినిమాలో రావుగోపాలరావు అంటాడు. అందుకే ఎంత డబ్బున్నప్పటికీ, అంతకుమించి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ వాటిని అంతగా దరిచేరనివ్వడు ముఖేష్ అంబానీ. ఆయన భార్య నీతా అంబానీ కూడా అంతే. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లాగా ఉంటారు. వేడుకలకు జంటగా వెళ్తారు.. సందడి చేస్తారు. అలాంటి వారి ఇంట్లోనే భారీ వేడుక జరుగుతోంది. అలాంటప్పుడు ఎలా ఉంటారు.. మరింత సందడి చేస్తారు. అలానే చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆదివారం వరకు ఇవి కొనసాగుతాయి. ఈ వేడుకలను రిలయన్స్ రిఫైనరీ సమీపంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి వచ్చిన అతిరథ మహారధుల కోసం కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బిల్ గేట్స్ నుంచి మొదలు పెడితే రిహన్నా వరకు ప్రపంచంలో ఉన్న ప్రముఖులు మొత్తం ఈ వేడుకకు హాజరయ్యారు. శుక్రవారం కాక్ టైల్, డ్రోన్ షో తో ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కాక్ టైల్ పార్టీలో ప్రముఖులు సందడి చేశారు. ఈ పార్టీలో ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పిరమాల్ మిస్ షో కౌచర్ సంస్థ తయారుచేసిన గౌన్ ధరించి అందర్నీ ఆకట్టుకుంది.
ఈ పెళ్లి వేడుకలో కాబోయే దంపతుల కంటే ముకేశ్ అంబానీ, నీతా అంబానీ సందడే ఎక్కువగా ఉంది. వారు ఒక పాటకు రిహార్సల్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. శుక్రవారం కాక్ టెయిల్, డ్రోన్ షో ప్రారంభానికి ముందే నీతా, ముకేశ్ అంబానీ తమ అద్భుతమైన ప్రదర్శనతో అతిధులను అలరించారు. నీతా అంబానీ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్. పలు సందర్భాల్లో ఆమె తన నృత్య ప్రదర్శనతో అలరించింది. ముకేశ్ అంబానీ అప్పుడప్పుడు కాలు కదుపుతూనే ఉంటాడు. వారిద్దరూ సూపర్ రొమాంటిక్ ప్రదర్శనతో అతిథులను సమ్మోహనులను చేశారు. “ప్యార్ హువా ఇక్రార్ హువా” అనే పాటకు డ్యాన్స్ రిహార్సల్ వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో “ఇషా అంబానీ పిరమాల్” అనే ఖాతాలో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More