House : ఒక ఇల్లు కొనుగోలు చేయాలంటే ఓ రెండు కోట్లు మూడు కోట్లు అంటే ఒకే అనుకోవచ్చు. కానీ వందలకోట్లు అని మీరు ఊహించగలరా? అయితే ఈ వార్త మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆ తర్వాత కచ్చితంగా షాక్ అవుతారు. లండన్‌లోని అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన భవనాలలో ఒకటైన అబెర్‌కాన్‌వే హౌస్‌ను కొనుగోలు చేశారు ఓ భారతీయ వ్యాపారవేత్త. దీని ధర తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ₹1,446 కోట్లు. ఈ ఫిగర్ చూశాకా బిజినెస్ లెక్కులు అనుకుంటున్నారా? కాదండోయ్ అబెర్ కాన్ వే హౌజ్ ధర. ఆ వ్యక్తి కొనుగోలు చేసిన ఈ ఆస్తి ఇప్పుడు లండన్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆస్తి. కొనుగోలుదారు మరెవరో కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదార్ పూనావల్ల.
1920లలో నిర్మించిన అబెర్‌కాన్‌వే హౌస్ చరిత్రలో నిలిచిపోయింది. ఇది గతంలో పోలాండ్ అత్యంత సంపన్న వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ యాజమాన్యంలో ఉంది. 2023లో, పూనావల్ల కుటుంబం దానిని కొనుగోలు చేసినప్పుడు ఆ సంవత్సరం లండన్‌లో విక్రయించిన అత్యంత ఖరీదైన ఆస్తిగా నిలిచింది ఈ ఇల్లు. ఇంతకీ ఇంత ఖరీదు చేసే బిల్డింగ్ ను ఎందుకు కొనుగోలు చేశారు అనుకుంటున్నారా?
సీరమ్ లైఫ్ సైన్సెస్ గ్రూప్ బ్రిటిష్ విభాగం ద్వారా ఈ ఆస్తిని పొందారు. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, పూనావల్ల కుటుంబం UK సందర్శనల సమయంలో, కొన్ని వ్యాపార ప్రయోజనాల కోసం ఈ భవనాన్ని ఉపయోగించాలని భావిస్తోందట. అయితే యూకేలో శాశ్వతంగా స్థిరపడే ఆలోచన లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
లండన్ రెండవ అత్యంత ఖరీదైన ఆస్తి ఇదే.
అబెర్‌కాన్‌వే హౌస్ ఇప్పుడు లండన్‌లోని రెండవ అత్యంత ఖరీదైన నివాస ఆస్తిగా తన రికార్డ్ సృష్టించింది. లండన్‌లో అత్యంత ఖరీదైన ఆస్తి విక్రయానికి సంబంధించిన రికార్డు ఇప్పటికీ సౌదీ అరేబియా మాజీ క్రౌన్ ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దులాజీజ్‌కు చెందినది. అతను 2020లో ఒక ఆస్తిని ₹19,000 కోట్లకు విక్రయించాడు. ఏది ఏమైనప్పటికీ, అదార్ పూనావాలా సముపార్జన లండన్‌లో 2023లో జరిగిన అత్యంత ఖరీదైన ఆస్తి లావాదేవీగా నిలుస్తుంది.
ఇంతకీ ఈ అదార్ పూనావాలా ఎవరు?
అదర్ పూనావాలా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. సైరస్ పూనావాలా కుమారుడు. 2011లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కంపెనీని ప్రపంచ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. COVID-19 మహమ్మారి సమయంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అతని నాయకత్వంలో, సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. అయితే ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి 70 దేశాలకు పంపిణీ చేశారు అదార్ పూనావాలా. ఇక అదార్ దృష్టి, వ్యాపార చతురత భారతదేశ ఔషధ పరిశ్రమను అభివృద్ధి చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని ప్రపంచ వ్యాపార నాయకులుగా కూడా స్థాపించాయి.